TG News

Saturday, December 16, 2017 - 10:16

హైదరాబాద్ : నగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతిని ప్రజ్వరిల్లించి మహాసభలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్, సీఎం, మంత్రులు, ఇతరులు పాల్గొన్నారు. రెండో రోజైన శనివారం పలు కార్యక్రమాలు జరుగునున్నాయి. రవీంద్ర భారతి...

Saturday, December 16, 2017 - 06:45

రంగారెడ్డి : కోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేస్తారు.. రాత్రికి రాత్రే అక్రమంగా ఇళ్లుకట్టేస్తారు..గొడలకు తెల్లసున్నాలు వేసీ కలరింగ్‌ ఇస్తారు. రాజధాని శివారు ప్రాంతాల్లోని రైతుల స్ధలాల్లో తెల్లవారేసరికే అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. పోలీసుల సపోర్ట్‌కూడా ఉండటంతో కబ్జాదారులు మరింతగా రెచ్చిపోతున్నారు. రంగారెడ్డిజిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలో జరుగుతున్న కబ్జాలపై...

Saturday, December 16, 2017 - 06:35

హైదరాబాద్‌ : నగరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని పలువురు రచయితలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ శ్రీశ్రీ విగ్రహం వద్ద నిరసన తెలపడానికి వచ్చిన విరసం రచయితలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు బాగ్ లింగం పల్లి నుంచి విరసం నేత వరవరరావు ఆధర్యంలో చేపట్టిన ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకొని...

Saturday, December 16, 2017 - 06:33

హైదరాబాద్ : తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో హిందూ, ముస్లింలు పాలు-నీళ్లలా కలిసి ఉండటం ఈ ప్రాంతం గొప్పతనమన్నారు. భాగ్యనగరం తెలుగు, ఉర్దూల ఐక్యతకు నిదర్శనమన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు అసదుద్దీన్‌. 

Saturday, December 16, 2017 - 06:31

హైదరాబాద్ : నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులు తెలుగు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. తెలుగు నుడికారాలకు నాంది పలికిన అలనాటి కవులు, సాహితీవేత్తలు, భాషాపండితుల నుంచి నేటి తరం కవుల వరకు తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషిని అందరూ...

Friday, December 15, 2017 - 22:08

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రంలో మొదటి సారిగా యశోద హాస్పిటల్స్‌లో రోబోటిక్ ట్రాన్స్ ప్లాంటేషన్‌ విజయవంతంగా నిర్వహించినట్టు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్‌ రావు చెప్పారు. రోబో సాయంతో మూడు మూత్ర పిండాలు మార్చడం జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సెంటర్ ఫర్ నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యులు సూరిబాబు, ఊర్మిళ, సురేష్ బాబుల బృందం...

Friday, December 15, 2017 - 22:07

హైదరాబాద్ : లైగింక వేధింపుల నుంచి విద్యార్థులు తమను తాము.. ఏ విధంగా కాపాడుకోవాలనే అంశంపై సికింద్రాబాద్ సీతాఫల్ మండి గౌతమ్ మోడల్‌ స్కూల్లో .. అవగాహాన సదస్సు నిర్వహంచారు. సీఐఐ యంగ్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ప్రస్తుతం కాలంలో విద్యార్థులపై లైగింక దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి. వాటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో పిల్లలకు తెలియజేసే...

Friday, December 15, 2017 - 22:06

నాగర్ కర్నూలు : సుధకార్‌ రెడ్డి హత్య కేసులో నాగర్‌కర్నూలు పోలీసులు సీన్‌ ఆఫ్‌ ఎఫెన్స్‌ను రీక్రియేట్‌ చేశారు. కేసులో A1గా ఉన్న రాజేష్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఫతేపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సుధాకర్‌ రెడ్డిని ఎలా దహనం చేసిన విషయాన్ని రాజేష్‌ ద్వారా తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో హత్యకు ఉపయోగించిన గడ్డపార, చున్నీ, ప్లేట్‌, పెట్రోల్‌ బాటిల్‌ను...

Friday, December 15, 2017 - 22:04

హైదరాబాద్ : 2019లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చాలా అసంతృప్తితో ఉన్నారని.. ఇప్పటికే ఆ విషయం ఆందోళనల ద్వారా తెలుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుబాటలో సాగి.. బంగారు తెలంగాణ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని జానారెడ్డి తెలిపారు.

Friday, December 15, 2017 - 22:03

ఆదిలాబాద్ : జిల్లా హస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీలు లంబాడీల మధ్య ఘర్షణ జరిగింది. కొమురంభీం విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ ఉట్నూరులో ఆదివాసీలు ధర్నా చేశారు. తిరిగి వెళ్తున్న ఆదివాసీలపై హస్నాపూర్‌లో లంబాడీలు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను...

Friday, December 15, 2017 - 22:01

హైదరాబాద్ : మన భాష, యాసను మనమే కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు నేలను తాకకపోతే తనకు ఏదో కోల్పోయినట్లు ఉంటుందన్నారు. అందుకే జన్మభూమిలో నెలకొక్కసారైనా అడుగుపెట్టకుండా ఉండలేనన్నారు. భాష సహజమైన ప్రవాహమన్నారు. కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దన్నారు వెంకయ్య నాయుడు. గురువుకు ప్రత్యామ్నాయం గూగుల్ కాదని.. ఇంటర్నెట్...

Friday, December 15, 2017 - 22:00

హైదరాబాద్ : తెలుగు భాష కమ్మదనాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు భావితరాలకు అందిస్తాయన్నారు తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్. తెలుగు మహాసభలను చూస్తుంటే భువన విజయం జరుగుతున్నట్లు ఉందన్నారు. నన్నయ నుంచి నారాయణ రెడ్డి వరకు ముందు వరసలో కూర్చున్నట్లు ఉందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనటం మధురమైన అనుభూతన్నారు

 

Friday, December 15, 2017 - 21:59

హైదరాబాద్ : తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. సిద్దిపేట అద్భుతమైన సాహితీ క్షేత్రమన్నారు. ఎంతోమంది సాహితీ కుసుమాలు వికసించిన నేల సిద్దిపేట అని కొనియాడారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది సాహితీవేత్తలు తెలంగాణలో ఉన్నారన్నారు. వందల కొద్దీ కవులు చక్కటి తెలుగులో.. తెలంగాణ భాష, యాసతో అనేక రచనలు చేశారన్నారు.సభలో...

Friday, December 15, 2017 - 21:58

హైదరాబాద్ : భాగ్యనగరంలో అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు ప్రపంచ నలుమూలలా నుంచి అనేకమంది భాషాభిమానులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ తన గురువు బ్రహ్మశ్రీ వేలేటి మృత్యుంజయశర్మ గారికి...

Friday, December 15, 2017 - 18:11

హైదరాబాద్ : రోబో అనగానే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో చిట్టి గుర్తుకొచ్చేస్తుంది. అందులో చిట్టి రోబో సర్జరీ అవసరం లేకుండా డెలివరీ చేసేస్తే అది చూసి మనం ఔరా .. అనుకున్నాం.రోబో సినిమాలో డెలివరీ సీన్ అది సినిమా కదా.. అని లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు నిజంగానే రోబోలు వైద్యరంగంలోకి అడుగుపెట్టడమే కాదు.. సర్జరీలు చేసేస్తున్నాయి. నిజానికి విదేశాల్లో...

Friday, December 15, 2017 - 18:08

హైదరాబాద్ : తెలుగు మహాసభలను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద నిరసనకు బయలుదేరిన వరవరరావు బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగ్‌ లింగంపల్లి నుంచి ర్యాలీగా బయలుదేరిన వరవరరావు, ఇతర నేతలను.. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిరసన జరిగే ట్యాంక్ బండ్‌ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.

Friday, December 15, 2017 - 18:07

హైదరాబాద్ : తను కాంగ్రెస్‌లోనే ఉన్నానని... పార్టీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని.. మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ అన్నారు. తన కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు అందరూ తనను పరామర్శించారని .. అందుకే ఆత్మీయ సమ్మేళనానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించానని ఆయన అన్నారు. 2019లో గోషామహల్‌ నుంచే పోటీ చేస్తాననంటున్నారు. 

Friday, December 15, 2017 - 18:06

మహబూబాబాద్ : జిల్లా మునికిచెర్ల దగ్గర మావోయిస్టు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు కోమళ్ల శేషగిరిరావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూర్‌ మండలం వెలకట్టే గ్రామానికి చెందిన శేషగిరిరావు.. ఆర్థిక ఇబ్బందులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులంటున్నారు. శేషగిరిరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Friday, December 15, 2017 - 18:05

ఢిల్లీ : చెన్నమనేని రమేష్‌ భారతీయ పౌరసత్వంపై రివ్యూ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. రమేష్‌ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2017 ఆగస్ట్‌ 31న కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రమేష్‌ భారతీయ పౌరుడు కాదని తేల్చడం ఇది మూడోసారి. మరోవైపు హైకోర్టు, కేంద్ర హోంశాఖ చెప్పినా.. చెన్నమనేని ఇంకా ఎమ్మెల్యే పదవిని పట్టుకుని పాకులాడుతున్నారని బీజేపీ నేత...

Friday, December 15, 2017 - 18:04

హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్యపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య వనితారెడ్డి విజయ్‌సాయిని ఫోన్‌లో బెదిరించినట్లు ఓ ఆడియో క్లిప్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. తన ఈగోని రెచ్చగొడితే లైఫ్‌లాంగ్‌ గుర్తుండిపోతుందని..వనితా రెడ్డి చెప్పింది. తన రివెంజ్‌ ఎలా ఉంటుందో చూపిస్తానని ఫోన్ రికార్డింగ్‌లో నమోదైంది. 

Pages

Don't Miss