TG News

Sunday, October 15, 2017 - 06:42

ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో టీ-మాస్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు టీ-మాస్‌ ఫోరం స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రజల భవిష్యత్‌ కోసమే టీ-మాస్‌ ఏర్పడిందన్నారు గద్దర్‌. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చిన నేతలు.. హామీలన్నీ విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తుందన్నారు సాయిబాబు. వచ్చే...

Sunday, October 15, 2017 - 06:38

హైదరాబాద్ : ఐపిఎల్‌ ఫ్రాంచైజ్‌ మాదిరిగానే ఫార్ములా వన్ పేరుతో పేరుతో ఆర్భాటపు ప్రకటనలు చేశారు. వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇదిగో అదిగో అంటూ 4 సంవత్సరాల నుండి జాప్యం చేస్తూ వచ్చారు. మోసపోయామని తెలుసుకున్న వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదైంది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నైతో సహా 11 రాష్ట్రాల్లో ఫార్ములా వన్...

Sunday, October 15, 2017 - 06:34

వరంగల్ : తెలంగాణలో ఆరో దశ అమరుల స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామన్నారు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్. యాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కావాలనే అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్ వెళ్తున్న కోదండరామ్‌ను ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వాలని...

Saturday, October 14, 2017 - 21:54

హైదరాబాద్ : తెలంగాణలో ఆరో దశ అమరుల స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామన్నారు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్. యాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కావాలనే అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్ వెళ్తున్న కోదండరామ్‌ను ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద అరెస్టు చేసిన పోలీసులు ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతకు...

Saturday, October 14, 2017 - 21:50

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ప్రవాహం పెరగడంతో.. శ్రీశైలం ఏడుగేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని వదులుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓవైపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరి... జలకళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు భాగ్యనగరంలో విషాదం చోటు...

Saturday, October 14, 2017 - 21:47

వరంగల్‌ : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈనెల 22న సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో... వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్‌.. టెక్స్‌టైల్‌ పార్క్‌ను దేశంలోనే అగ్రగామికి నిలిచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు జిల్లాలో పెండింగ్‌ పనులపై అధికారులపై కేటీఆర్‌ ఆగ్రహం...

Saturday, October 14, 2017 - 20:49

తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి వేణుగోపాలాచారితో టెన్ టివి వన్ టూ వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బీజేపీతో ఎలా ఉన్నామో..భవిష్యత్ లో కూడా అలాగే ఉంటామని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 'ఎంతమంది టీఆర్ ఎస్ ఎంపీలు...

Saturday, October 14, 2017 - 18:42

హైదరాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా  పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. పాదయాత్ర ఫలితంగానే 270కి పైగా సంఘాలతో టీమాస్ ఫోరం ఏర్పాటైందని తెలిపారు. జనవరిలో ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు....

Saturday, October 14, 2017 - 18:15

కామారెడ్డి : రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు కావాలనే అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి చూపిస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 195 సెంటర్లను...

Saturday, October 14, 2017 - 17:59

హైదరాబాద్ : ఫార్మాసీటీ పేరుతో ప్రభుత్వం పేద‌ల భూముల‌ను లాక్కుంటోంద‌ని కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు ఆరోపించారు. ప్రభుత్వపు బ‌ల‌వంత భూసేక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని ఆయన హెచ్చరించారు. త్వరలో రాహుల్‌ గాంధీని ఫార్మాసిటీకి తీసుకొస్తామన్నారు. ఫార్మాసిటీతో కాలుష్యం ఉండ‌ద‌ని చెబుతున్న కేటీఆర్... కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఫార్మా కంపెనీని ఏర్పాటు అనుమ‌తిస్తారా అని వీహెచ్...

Saturday, October 14, 2017 - 17:53

వరంగల్ : జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదని అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి...అధికారులు, ఎమ్మెల్యే పనితీరు చాలా డిసప్పాయింట్ గా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపోజల్ తెచ్చి ప్రతి పనికి టెంటర్లు పిలవాలని ఆదేశించారు. నెక్ట్స్...

Saturday, October 14, 2017 - 16:31
Saturday, October 14, 2017 - 16:24

హైదరాబాద్ : విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి..తెలుగు రాష్ట్రాల్లో కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నాయి... గడిచిన 36 గంటల్లో ఎంతో మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు...రెండో రోజు కూడా నలుగురు స్టూడెంట్స్ మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది...
వనపర్తి జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య 
వనపర్తి...

Saturday, October 14, 2017 - 16:15

హైదరాబాద్ : ఫార్మలా వన్‌ పేరుతో హైదరాబాద్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. నగరానికి చెందిన మచ్దర్‌ మోటారు సంస్థ రేసులు నిర్వహిస్తామని ఓ వ్యాపారవేత్త నుంచి 12కోట్ల 50లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రేసులు నిర్వహించకపోవడంతో... బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో...మచ్దర్‌ మోటారు సంస్థ  నిర్వాహకురాలు అంజనారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో...

Saturday, October 14, 2017 - 16:09

కరీంనగర్ : జ్యోతినగర్‌ లోని సెయింట్ ఆల్పోన్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిచే యాజమాన్యం కట్టలు కొట్టించారు. అయితే ప్రమాద వశాత్తు కాలికి గొడ్డలి తగలడంతో ఎడమకాలి వేళ్లు తెగిపోయాయి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయగా...

Saturday, October 14, 2017 - 15:37

హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని.. తెలంగాణ రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. అక్టోబర్‌ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన.. పోలీస్‌ ఎక్స్‌ఫో కార్యక్రమాన్ని నాయిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే...

Saturday, October 14, 2017 - 13:01

 

జనగామ : ఇవాళ జిల్లాలో అమరుల స్ఫూర్తియాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ జేఏసీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. లింగాలఘణపురం పోలీస్టేషన్‌లో పలువురు జేఏసీ నాయకులను నిర్బంధించారు. మరోవైపు ఇవాళ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, ఇతర టీజేఏసీ నాయకులు జనగామజిల్లాకు వస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు...

Saturday, October 14, 2017 - 12:56

వరంగల్ : జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి అంటే విద్య ఎంతో అవసరం. అందుకోసమే కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ఉత్కర్ష 2017 వేడుకలు ఏర్పాటు చేశారు. గతానికి భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రైజాన్‌ ట్రాంజ్‌ బ్యాచ్‌ మెడికోలు. వారం పాటు సాగే ఈ వేడుకల్లో వైద్య విద్యార్థులు అనేక కార్యక్రమాలను చేపట్టారు. నేటితరం విద్యార్థుల కోసం ఏర్పాటు...

Saturday, October 14, 2017 - 12:55

 

హైదరాబాద్ : గ్రేటర్‌ రోడ్లు నరక యాతన మిగులుస్తున్నాయి. వానొస్తుందంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతున్నాయి. గుంతలు, పగుళ్లు వచ్చిన రోడ్ల కారణంగా వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కోవాల్సి వస్తోంది. గత పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సిటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. పరిస్థితులు ఇంత...

Saturday, October 14, 2017 - 12:53

మేడ్చల్ : జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజీగూడలో లారీ బీభత్సం సృష్టించింది. రాంగ్‌సైడ్‌ నుంచి దూసుకొచ్చిన లారీ.. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి, లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Saturday, October 14, 2017 - 12:52

వరంగల్ : జిల్లాలో ఆరవదశ అమరుల స్ఫూర్తియాత్రకు కోదండరాం బృందం సిద్ధం అవుతోంది. దీనికోసం ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవడానికి తార్నాక నుంచి కోదండరాం బయలు దేరారు. యాత్ర సందర్భంగా అధికారులు, పోలీసుల ప్రవర్తిస్తున్న తీరుపై హోం మంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్నారు కోదండరామ్‌. ఈ...

Saturday, October 14, 2017 - 07:17

2010 రాబిట్ ఫామ్ ప్రారంభించమని, దానికోసం రకరకాల ప్రయోగాలు చేశామని దానిలో భాగంగా హెడ్జ్ లోస్ వచ్చిందని, ఇందులో మంచి మాంస కృత్తులు ఉంటాయని, దానలో పోషక విలువలు తక్కువగా ఉంటాయని,  హెడ్జ్ లోస్ లాంగ్ పంట ఇది ఎకరానికి 5 నుంచి పది టన్నులు వస్తోందని షాద్ నగర్ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Saturday, October 14, 2017 - 07:06

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మైదుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ..3 రోజులుగా ప్రియుడి ఇంటి ప్రియురాలు ధర్నా చేస్తోంది. అయితే మనస్తాపంతో ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి...

Pages

Don't Miss