TG News

Wednesday, August 15, 2018 - 14:52

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను టీకాంగ్రెస్ నేతలు సవాలుగా తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని టీ.కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల ప్రకటన కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Wednesday, August 15, 2018 - 14:36

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి నిప్పంటించుకున్నాడు. పోలీసులు మంటలను ఆర్పి అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Wednesday, August 15, 2018 - 13:32

హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీ అండ్‌ టీ కాలనీలో దారుణం జరిగింది. సుడాన్‌ దేశానికి చెందిన రాషెష్‌ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ముగ్గురి మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. దీంతో క్షణికవేశానికి లోనైనా తోటి విద్యార్ధులే రాషెష్ ను కత్తితో పోడిచి గాయపరిచారు. తీవ్రగాయాలపాలైన రాషెష్...

Wednesday, August 15, 2018 - 13:30

వికారాబాద్ : పూడూరు మండలం చీలాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయం పొలం వద్ద స్తంభానికి ఉన్న ఎర్తింగ్ వైర్ తగిలి విద్యుత్ షాక్ తో కృష్ణయ్య అనే రైతు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Wednesday, August 15, 2018 - 13:26

మేడ్చల్ : షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టాటాఏసీ ఆటో ఢీకొనడంతో ..ముందుకు వెళ్తున్న లారీ కిందపడి ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారి తుకుంటా గ్రామంలోని అలంకృత రిసార్ట్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Wednesday, August 15, 2018 - 10:28

హైదరాబాద్ : గోల్కొండలో ఏర్పాటు చేసిన 72వ స్వాతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోటలోని రాణీమహల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ దినోతవ్స శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తు.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం...

Wednesday, August 15, 2018 - 09:29

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు కోర్టు తీర్పును అమలు పర్చని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లను కేటాయించమని హైకోర్టు చెప్పినా కోర్టు...

Wednesday, August 15, 2018 - 09:19

హైదరాబాద్ : రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ధీటుగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ పార్టీ స్కాంగ్రెస్‌ పార్టీగా మారిందని ఆరోపణలు చేసింది. ప్రజాస్వామ్య గొంతుక, విలువలను కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించింది.

రాహుల్‌ వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్‌ కౌంటర్‌...

Wednesday, August 15, 2018 - 09:14

యాదాద్రి : రాష్ర్టంలోనే అతి పెద్ద జాతీయ జెండా అవిష్కరణకు వేదికగా నిలిచింది యాదాద్రి భువనగిరి జిల్లా. 2వేల అడుగుల జాతీయ జెండాను ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. పట్టణంలో 3500మంది విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన జాతీయతా భావాన్ని రెట్టింపు చేసింది. భారత్ మాతాకి జై, జై జవాన్ జై కాసాన్ నినాదాలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్బంగా పలువురు...

Wednesday, August 15, 2018 - 09:10

కామారెడ్డి : గణతంత్ర, స్వతంత్ర దినోత్సవాలకు భరత మాతను స్మరించుకోవడం అందరికీ తెలిసిందే. కానీ.. భరత మాతకు గుడికట్టి.. నిత్యం పూజలు చేస్తున్నారంటే కొంత ఆశ్చర్యంతోపాటు.. మరికొంత గర్వంగానూ ఉంటుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో దీపారాధన, భజనలు, జేజేల నినాదాలతో మార్మోగుతున్న భరత మాత ఆలయంపై 10టీవీ ప్రత్యేక కథనం..

బిచ్కుందలో...

Wednesday, August 15, 2018 - 08:40

ఢిల్లీ : భారతదేశం ఓ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటపై నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశం ఒక ఆత్మవిశ్వసంతో ముందుకెళ్తోంది. స్వప్నాన్ని...

Wednesday, August 15, 2018 - 08:21

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్నిఇనుమడింపజేశారని ప్రధాని నరేంద్రమోదీ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం తన ప్రసంగంలో పేర్కొన్నారు. నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి...

Tuesday, August 14, 2018 - 22:24

హైదరాబాద్ : ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోపిడీ చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగం తాండవిస్తోందని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలేదని, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని...

Tuesday, August 14, 2018 - 21:30

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు హైకోర్టు ఫారమ్..01 నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలు నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు అసెంబ్లీ రిజిస్ట్రర్ కోర్టుకు సమర్పించాలని...

Tuesday, August 14, 2018 - 20:56

కరీంనగర్ : కాంగ్రెస్‌ అనవసర ఆరోపణలు చేయడం మానేసి రుజువు చేయాలన్నారు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజన్నను మంత్రి దర్శించుకున్నారు. వేములవాడలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. మరో 15 సంవత్సరాల పాటు టీఆర్ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి...

Tuesday, August 14, 2018 - 20:53

హైదరాబాద్‌ : గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. రాహుల్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు .. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

Tuesday, August 14, 2018 - 20:42

హైదరాబాద్ : గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వసిద్ధమయింది. కోటలోని రాణీమహల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ జెండా ఎగరవేయనున్నారు. వేడుకలకు పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. 15 వందల మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతో పాటు పరిసర ప్రాంతాలను నిఘా నీడలో ఉంచారు. 
సీసీ కెమెరా...

Tuesday, August 14, 2018 - 20:33

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం చింతపట్లలోని సెయింట్‌ స్టీఫెన్‌ హైస్కూల్‌లో దారుణం జరిగింది. బ్లాక్‌ రిబ్బన్‌లు వేసుకురాలేదని టీచర్‌ మనీషా విద్యార్థిని జుట్టు కత్తిరించింది. టీచర్‌ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఘటనపై విచారణ జరుపుతామని ఎంఈవో అన్నారు. 

 

Tuesday, August 14, 2018 - 18:49

హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం సాగిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకన్నాక నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని అనుకున్నామని.. తెలంగాణ వచ్చాక కన్న కలలు సాకారం కాలేదన్నారు. సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నోటిఫికేషన్ వేయలేదు..వేసిన వాటికి రిక్రూట్ మెంట్...

Tuesday, August 14, 2018 - 18:28

హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ రావడానికి కారణం విద్యార్థులేనని అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది అత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల...

Tuesday, August 14, 2018 - 17:01

హైదరాబాద్ : మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. రాహుల్ తోపాటు బస్సులో ఆర్.కృష్ణయ్య బయల్దేరారు. రాహుల్‌ తోపాటు ఆర్.కృష్ణయ్య వెళ్లడం రాజకీయంఆ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరుతున్నారన్న అనుమానం కలుగుతోంది. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి...

Tuesday, August 14, 2018 - 16:48

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు మరోసారి శృంగభంగం తప్పదని టీఆర్‌ఎస్‌ నేత దానం నాగేందర్‌ హెచ్చరించారు. 2019లో కాంగ్రెస్‌కు అధికారం కల్ల అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల్లో చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృతంలోని టీఆర్‌ఎస్‌కు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కే మళ్లీ పట్టం...

Tuesday, August 14, 2018 - 16:33

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు కోర్టు ఫారమ్ 01 నోటీసులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీ లు నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్ ను కూడా ఇందులో ఇన్ క్లూడ్ చేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేశారు....

Pages

Don't Miss