TG News

Wednesday, August 16, 2017 - 12:20

హైదరాబాద్ : నగరంలోని మెహదీపట్నంలో గోడకూలి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా సరిగా బేస్ మిట్ లేని గోడ కూలినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు మహబూబ్ నగర్ చెందినవారు. మరొకరు ముంబైకి చెందినవారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Wednesday, August 16, 2017 - 12:04

హైదరాబాద్ : ఓమన్‌ దేశం నుంచి గల్ఫ్‌ కార్మికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఓమన్ పెట్రోస్‌ గల్ఫ్‌ కంపెనీలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు 400 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ కార్మికులకు గత 6 నెలల నుంచి యాజమాన్యం వేతనాలు ఇవ్వకపోడంతో.. తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. వీరికి కంపెనీ నుండి ఒక్కొక్క కార్మికునికి 4...

Wednesday, August 16, 2017 - 11:51

కొత్తగూడెం : జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో దారుణం జరిగింది. రాయల భాస్కర్ అనే వ్యక్తి హత్యకు గురైయ్యాడు. అతన్ని న్యూడెమోక్రసీ రవి దళసభ్యులు హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. భూమి విషయంలో హత్య జరినట్టు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, August 16, 2017 - 09:54

హైదరాబాద్ : యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నో డ్రగ్స్‌ అని అవగాహన కల్పిస్తూ.. క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. డ్రగ్స్‌ తీసుకోవడం మాని స్పోర్ట్స్‌ పై దృష్టి పెట్టాలని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ కార్ఖాన ప్లే గ్రౌండ్‌లో ఎన్‌ఎన్‌యుఐ ఆధ్వర్యంలో.. యువతకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. జంట నగరాల్లోని క్రీడాకారులు ఇందులో...

Wednesday, August 16, 2017 - 09:52

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో మళయాళీలు ఓనం ఉత్సవాలు జరుపుకుంటున్నారు.. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాలకు వచ్చిన మళయాళీలు... ఆట పాటలతో సందడిగా గడిపారు.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.. కేరళ సంప్రదాయ వంటలతో సహపంక్తి భోజనాలు చేశారు.

Wednesday, August 16, 2017 - 09:51

హైదరాబాద్ : హైదరాబాద్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికెన్‌గున్యా, డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ లాంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విషజ్వరాల బారినపడి అవస్థలు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో ప్రైవేటు , ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కొన్ని...

Wednesday, August 16, 2017 - 09:49

హైదరాబాద్ : సర్కార్‌ బడుల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పంచాజెండా ఊపింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి కేసిఆర్ పాఠశాల విద్యాశాఖను ఆదేశించడంతో అధికారులు నోటిఫికేషన్ పై కసరత్తు మొదలుపెట్టారు. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యపై...

Wednesday, August 16, 2017 - 07:33

హైదరాబాద్ : 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన తేనేటి విందు సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు హాజరయ్యారు. ఇద్దరు చంద్రులు రాజ్‌భవన్‌ వేదికగా మరోసారి కలిశారు. గవర్నర్‌ దంపతులు ఇద్దరు సీఎంలను ఆత్మీయంగా ఆహ్వానించారు. గవర్నర్‌ నరసింహన్‌ ఇద్దరిని వెంటతీసుకుని వెళ్లారు...

Tuesday, August 15, 2017 - 21:12

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు తెలిపారు. ఆయన రాసిన పలు పాటలను పాడి వినిపించారు. అశోక్ తేజ తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Tuesday, August 15, 2017 - 20:29

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది... హైదరాబాద్‌ గోల్కొండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జెండా ఆవిష్కరించగా... తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ పతాకం ఎగురవేశారు. జెండా వేడుకలతో రెండు రాష్ట్రాలు సందడిగా మారాయి..  
ఏపీలో 
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి.... తిరుపతిలోని తారకరామ స్టేడియంలో...

Tuesday, August 15, 2017 - 19:34

హైదరాబాద్ : ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా  తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర కొనసాగించిన తీరతానని  టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు.ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం ఈనెల 21న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనాలని టీ జాక్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 22న...

Tuesday, August 15, 2017 - 19:32

హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను పాఠశాల స్థాయి నుంచే దేశ స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలు చదివానని, వారు చేసిన త్యాగాలు, పోరాటాలు తెలుసుకొని ఎంతో స్ఫూర్తి పొందానన్నారు. ప్రతిఒక్కరూ...

Tuesday, August 15, 2017 - 18:41

హైదరాబాద్ : టి.జేఏసీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలపై టీ.జేఏసీ స్టీరింగ్‌ కమిటీ నాంపల్లిలోని జేఏసీ కార్యాలయంలో సమావేశమైంది. నిజామాబాద్‌, నేరెళ్ల, ఘటనలపై ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. 

 

Tuesday, August 15, 2017 - 16:33

భద్రాద్రి కొత్తగూడెం : ఆయనో బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి. నేడు స్వాతంత్ర్య దినోత్సవం అన్న సంగతి మరిచారు. కార్యాలయంలో జెండా ఎగురవేయాలన్న ఇంగితం మరిచి పూటుగా మద్యం సేవించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్చుతాపురంలో  అతిపెద్ద ఫారెస్ట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఉంది.  ఈ సెంటర్‌లో ఇవాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగలేదు.  సెంటర్‌ రేంజర్‌...

Tuesday, August 15, 2017 - 16:15

అదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడ, వాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు అటవీశాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. 21 శాతం ఆదాయ వృద్ధిరేటుతో తెలంగాణ.. దేశంలోనే...

Tuesday, August 15, 2017 - 12:41

హైదరాబాద్ : శాసనమండలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Tuesday, August 15, 2017 - 12:35

హైదరాబాద్ : ఎంహెచ్ భవన్‌లో 10టీవీ, నవ తెలంగాణ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను 10టీవీ ఎండీ వేణుగోపాల్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్యతో పాటు 10టీవీ, నవ తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్న భారతదేశంలో... ఈరోజు ఒకే సంస్కృతిని నమ్ముకున్నవాడు,...

Tuesday, August 15, 2017 - 12:34

హైదరాబాద్ : ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురి కావొద్దన్న ఉదార్థ ఆశయంతో ప్రభుత్వం తపన పడుతుంటే... కొన్ని సంకుచిత శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు కేసీఆర్‌. అయినా వెనకడుగు వేయకుండా ప్రభుత్వం వారి జీతాలు పెంచిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం...

Tuesday, August 15, 2017 - 12:32

హైదరాబాద్ : మిషన్‌ భగీరథ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు కేసీఆర్. శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా కేజీ టూ పీజీ విద్యలో భాగంగా... రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 522 గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్‌ విద్యను అందిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. 

Tuesday, August 15, 2017 - 12:31

హైదరాబాద్: విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు సీఎం కేసీఆర్‌. వ్యవసాయ రంగానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని.. యాసంగి నుంచి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మిగులు విద్యుత్‌ను సాధిస్తుందని కేసీఆర్‌ అన్నారు.

Tuesday, August 15, 2017 - 12:30

హైదరాబాద్ : గోల్కొండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. ఈ ఏడాది రాష్ట్రం 21.7 శాతం వృద్ధి సాధించి.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు కేసీఆర్‌. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తుందన్నారు. అనేక కార్యక్రమాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ...

Tuesday, August 15, 2017 - 12:24

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆగస్టు 15 వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ మధుసుదనాచారి జెండా ఎగరేశారు. అంతా కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. దాస్య శృంఖలాలు తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు.. ఎంతో శుభప్రదమైనదని స్పీకర్ అన్నారు. 

Pages

Don't Miss