TG News

Sunday, September 25, 2016 - 15:55

మెదక్ : హత్నూర్ మండలం రెడ్డిఖానాపూర్‌ గ్రామ సమీపంలో బైకుపై వెళ్తున్న వాహనదారుడు గల్లంతయ్యాడు. నర్సాపులం మండలం జక్కపల్లికి చెందిన ఆంజనేయులు గౌడ్, చంద్రయ్య విధులకు బైకుపై వెళ్తుండగా రెడ్డి ఖానాపూర్‌ వద్ద రోడ్డుపై వరద ఉద్ధృతంగా ప్రవహించింది. రోడ్డు దాటుతుండగా బైకుతో సహా ఆంజనేయులు గౌడ్‌ కొట్టుకుపోయాడు. చంద్రయ్య ఈదుకుంటూ...

Sunday, September 25, 2016 - 15:51

కరీంనగర్ : మరోవైపు ఎస్సారెస్పీలో 85 టీఎంసీల నీటినిల్వను స్థిరంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వస్తుండటంతో దానికి అనుగుణంగా ఎస్సారెస్పీ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది... దీంతో ఉదయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు...

Sunday, September 25, 2016 - 15:42

హైదారబాద్ : రేపు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం రద్దైంది. వరదల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని సీఎం కేసీఆర్ రద్దుచేశారు. జిల్లాలలో ఉండి పరిస్థితులను సమీక్షించాలని మంత్రులను ఆదేశించారు. గోదావరి నదికి ఉద్ధృతి పెరుగుతుండడంతో కరీంనగర్,నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని...

Sunday, September 25, 2016 - 15:26

కరీంనగర్ : అప్పర్‌ మానేరు, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మిడ్‌మానేరుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. రెండు లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. కట్టకు గండి పడి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మన్వాడ, పుత్తూరు, మల్లాపూర్‌, కందికట్కూరు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు....

Sunday, September 25, 2016 - 15:08

కరీంనగర్: మిడ్ మానేరుకు వరద పోటెత్తింది. దీంతో అదికారులు దిగువ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.నాలుగు రోజులుగా కురుస్తోన్నవర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతుండటంతో మిడ్‌మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పరిస్థితిని పరిశీలించేందుకు మంత్రి ఈటెల మానేరు వాగు ప్రాంతానికి...

Sunday, September 25, 2016 - 14:24

హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ, గోదారమ్మలు పరవళ్లు తొక్కుతున్నాయి. జలశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. జూరాల, శ్రీశైలం, నిజామ్‌ సాగర్‌, కడెం, కొమురం భీమ్‌ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 

 

Sunday, September 25, 2016 - 13:54

కరీంనగర్ : అప్పర్‌ మానేరు, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మిడ్‌మానేరుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. రెండు లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. కట్టపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కేవలం మూడు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండడంతో.. మిగతా నీటిని అధికారులు దిగువకు...

Sunday, September 25, 2016 - 13:20

కరీంనగర్ : జిల్లాలో జలాశయాలు నిండుకుండలా మారాయి. మిడ్ మానేరుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టకు గండి పడింది. కలెక్టర్ తో కలిసి పరిస్థితిని మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఎస్సారెస్పీ నుంచి ప్రవాహం పెరగడంతో మిడ్ మానేరు నిండిపోయింది. అక్కడి నుంచి లోయర్ మానేరుకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు మిడ్ మానేరుకు...

Sunday, September 25, 2016 - 12:54

నిజామాబాద్ : కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు...

Sunday, September 25, 2016 - 12:50

కరీంనగర్ : జిల్లాలోని మిడ్ మానేరుకు ఇన్‌ ఫ్లో భారీగా పెరగడంతో తాత్కాలికంగా నిర్మించిన కట్టకు గండి పడింది. దీంతో స్థానికంగా ఉన్న మన్వాడ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, September 25, 2016 - 12:47

హైదరాబాద్ : వర్షం దెబ్బ నుంచి ఇంకా భాగ్యనగరం కోలుకోలేదు. పలు కాలనీల్లో ఇంకా నీళ్లు నిలిచే ఉన్నాయి. కూకట్‌పల్లి బండారి లేఅవుట్‌, ధరణినగర్‌ వాసులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమ కాలనీలో నిలిచివున్న నీళ్లను వెంటనే తొలగించాలని మహిళలు రోడ్డెక్కారు. మరోవైపు బాధితులకు బోటు ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Sunday, September 25, 2016 - 12:36

హైదరాబాద్ : నగరంలో వర్షాలు తగ్గినా ఇంకా రోడ్లపై నీళ్లు నిలిచేవున్నాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాచారంలో రోడ్లపై నీళ్లు నిలిచివుండడంతో వాహనాల దారి మళ్లించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, September 25, 2016 - 12:32

కరీంనగర్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్‌ చెరువుకు గండిపడింది. దీంతో గ్రామంలోకి భారీగా  వరదనీరు చేరింది. ఈ వరదనీటిలో రెండు ఇళ్లు, పశువులు కొట్టుకుపోయాయి. గంభీరావుపేట, గోరంట్లలోను వరద ఉధృతి కొనసాగుతోంది.

 

Sunday, September 25, 2016 - 10:41

మెదక్‌ : జిల్లాలోని పాపన్నపేట దగ్గర ఏడుపాయలలో చిక్కుకున్న 23 మంది కూలీలను రెస్క్యూ టీమ్‌ రక్షించింది. రెండు హెలికాప్టర్ల ద్వారా బీహార్‌, ఒడిశాకు చెందిన 23 మంది కూలీలను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వరద ఉధృతి పెరగడంతో నిన్న మధ్యాహ్నం కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. రాత్రి నుంచి డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి సహాయక చర్యలను...

Sunday, September 25, 2016 - 10:29

హైదరాబాద్ : టీమిండియా వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ధోనీ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమం హైదరాబాద్‌ జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎంఎస్ ధోనీతోపాటు సినీదర్శకుడు రాజమౌళి, ఇతర సినీప్రముఖులు హాజరయ్యారు. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధోనీ క్యారెక్టర్‌లో సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్‌  ...

Sunday, September 25, 2016 - 10:22

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. శారదా బట్టలషాపులో షార్ట్‌సర్క్యూట్‌ మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి.. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 3 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. 

 

Sunday, September 25, 2016 - 09:47

హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా ప్రారంభమైంది. 80కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.  నాలుగు రోజులపాటు జరిగే కార్నివాల్‌లో 132కి పైగా సినిమాలు ప్రదర్శించనున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలను ఏకతాటిపైకి తేవడమే  కార్నివాల్‌ ఉద్దేశమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. 
రామోజీ ఫిల్మ్‌...

Sunday, September 25, 2016 - 08:02

హైదరాబాద్ : జోరువానలతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో.. కృష్టా, గోదావరి నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లక్షలాది క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. మహరాష్ట్ర కర్నాకల్లో కురస్తున్న వర్షాలతో గోదావరి, కష్ణా నదుల్లో వరద ఉధృతి పెరిగింది. తెలంగాణవ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు...

Sunday, September 25, 2016 - 07:46

హైదరాబాద్‌ : భాగ్యనగరాన్ని ఇంకా వరద భయం వెంటాడుతూనే ఉంది. అనేక కాలనీల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అపార్ట్‌మెంట్ల నుంచి కిందకు దిగలేక.. నిత్యావసరాలు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీని రంగంలోకి దింపింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం సహాయక చర్యలు ఇంకా వేగవంతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌...

Sunday, September 25, 2016 - 07:37

హైదరాబాద్ : తెలంగాణలో వర్ష బీభత్సానికి ప్రజానీకం ఇంకా తేరుకోలేదు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లన్నీ తెగిపోయి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో కనీసం నిద్రాహారాలు కూడా మానేసి  బాధితులు ఎదురు చూపులు చూస్తున్నారు.  ఆదుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు. మరోవైపు మరికొద్ది రోజుల...

Saturday, September 24, 2016 - 21:40

హైదరాబాద్ : హైదరాబాదును విశ్వనగరం చేస్తాం.. అక్రమ కట్టడాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.. గత పాలకుల ఖర్మ మనం అనుభవిస్తున్నాం.. ఐదారేళ్లలో భాగ్యనగరం రూపురేఖలు మార్చేస్తాం.. ప్రజలకు ఉత్తుత్తి మాటలు చెప్పం.. చెప్పిందే చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు...

Saturday, September 24, 2016 - 21:36

హైదరాబాద్ : తెలంగాణలో వర్ష బీభత్సం సృష్టించిన విలయ తాండవానికి ఇంకా ప్రజానీకం తేరుకోలేదు. అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో కనీసం నిద్రాహారాలు కూడా మానేసి ఎదురు చూపులు చూస్తున్న బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో రోడ్లన్నీ తెగిపోయి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది...

Saturday, September 24, 2016 - 18:38

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షానంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎప్పటిలాగా తనదైన శైలిలో విపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ప్రతిపక్షాలుగా వున్న ఈనేతలే పాలన వల్లనే హైదరాబాద్ దుస్థితికి కారణమని ఎద్దేవా చేశారు. వర్షాలపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమై వుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు...

Pages

Don't Miss