TG News

Monday, November 7, 2016 - 16:44

హైదరాబాద్ : రష్యా విప్లవం..! ప్రపంచ పరిణామాలను గణనీయంగా ప్రభావితం చేసిన విప్లవం. రష్యాలో ఈ మహా విప్లవం తర్వాతే ప్రజాస్వామ్య భావన విశ్వవ్యాప్తమైంది. అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. అసలు రష్యా విప్లవం ఎప్పుడు.. ఎందుకు.. ఎలా.. జరిగింది.? పర్యవసానాలు ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
జారు చక్రవర్తిపై సైన్యం తిరుగుబాటు
అది...

Monday, November 7, 2016 - 14:15

మహబూబ్ నగర్ : ఎన్నెన్నో వాగ్ధానాలు చేసిన కేసీఆర్‌.. ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయలేదని, తెలంగాణ ప్రజల బతుకు మార్చే పరిపాలన కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రలో భాగంగా వనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తమ్మినేని పాదయాత్రకు పలువురు నేతలు, ప్రముఖులు సంఘీభావం తెలిపారు

...

Monday, November 7, 2016 - 13:54

మహబూబ్ నగర్ : సామాజిక న్యాయం, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తలపెట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 22వ రోజుకు చేరింది. ఈరోజు వనపర్తి జిల్లాలో ప్రారంభమైన యాత్ర ఖానాపల్లె, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరులలో కొనసాగనుంది. పాదయాత్రకు ప్రజల నుంచి ఎన్నో వినతులు, విజ్ఞాపనలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు, రేషన్‌కార్డుల సమస్యలతో పాటు.. దళితులకు మూడేకరాల...

Monday, November 7, 2016 - 13:49

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయీమ్ కేసును త్వరగా పూర్తి చేసేందుకు సిట్ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నయీమ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్శింగ్ పీఎస్ లో విచారిస్తున్నారు. నయీమ్ కేసుల్లో ఇప్పటి వరకు 166 కేసులు నమోదయ్యాయి. ఇందులో...

Monday, November 7, 2016 - 13:17

హైదరాబాద్ : పరిపాలన విధానాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ అధికార విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. పరిపాలన నిర్వహణకు కేవలం ఐఏఎస్‌ల మీదనే ఆధారపడకుండా, సొంత క్యాడర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గ్రూప్‌-1 అధికారులను..కేంద్ర సర్వీసు అధికారులకు సమాంతరంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది....

Monday, November 7, 2016 - 12:50

హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారని గవర్నర్‌కు వివరించారు. సెక్రటేరియట్‌లో ఇటీవలే నిర్మించిన భవనాలు కూడా ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. వాస్తు పేరుతో ప్రభుత్వ భవనాలను కూల్చాలనుకోవడం సరికాదన్నారు...

Monday, November 7, 2016 - 11:17

హైదరాబాద్ : ఎత్తు పెంపు చికిత్స మళ్లీ తెరమీదకు వచ్చింది. 10 రోజుల క్రితం నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెంపు చికిత్స కోసం గ్లోబల్ హాస్పిటల్ వైద్యలు సర్జరీ చేశారు. అక్టోబర్ 27న డా.భూషణ్ నిఖిల్ రెడ్డికి సర్జరీ చేశారు. నవంబర్ 4న నిఖిల్ కు వైద్యులు మరోసారి సర్జరీ చేయాల్సి వుండగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డా.భూషణ్ ను రెండు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీంతో...

Monday, November 7, 2016 - 10:46

హైదరాబాద్ : భీమిలి సబ్ రిజిష్ట్రార్ సంజీవయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో వనస్థలిపురంలోని విజయపురి కాలనీలో సంజీవయ్య నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్టణం, ఒంగోలు ఇలా ఏకకాలంలో ఐదు ప్రాంతాలలో ఏసీబీ దాడులు చేపట్టింది. ఈ దాడులలో రూ.5లక్షల నగరదు, బంగారు, వెండి ఆభరణాలను అధికారులు...

Monday, November 7, 2016 - 10:12

హైదరాబాద్ : పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయాలకు బారులు తీరారు. నదీజలాల్లో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.

Monday, November 7, 2016 - 09:50

హైదరాబాద్‌ : నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజు కూ మితిమీరిపోతున్నాయి. అర్థరాత్రి వరకూ తెరిచి వున్న వైన్ షాపులు..తాగి తూగుతున్న నగర ప్రజలు రాత్రంతా వీధుల్లో తిరుగుతు అరాచకాలు సృష్టిస్తున్నారు. తాగి వాహనాలు నడుపుతు పలువరి ప్రాణాలను తీస్తున్నారు. మరికొంతమంది వీరి నిర్లక్ష్యానికి బలైయిపోతున్నారు. తాగి వాహనాలు నడుపుతు కొంతమంది...

Monday, November 7, 2016 - 09:37

హైదరాబాద్ : కొత్త జిల్లాల రాకతో నియోజకవర్గాల నిధుల కేటాయింపుపై అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల అమలుతో ఒక్కో నియోజకవర్గం రెండుకు పైగా జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో వీటికి నిధులను ఏ ప్రాతిపదికన విడుదల చేయాలన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై దృష్టిసారించిన అధికారులు తీవ్ర కసరత్తుల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

కొత్త...

Monday, November 7, 2016 - 09:19

జయశంకర్ : పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం అధికార ఝలుం ప్రదర్శిస్తోంది. ఏళ్ల తరబడి పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేసి మరోసారి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. రైతులపై దాడులు చేయడమే కాదు..పంటలను సైతం ధ్వంసం చేశారు. జయశంకర్‌ జిల్లా ఏటూరునాగారంలో పంటలను ధ్వంసం చేసిన అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు....

Monday, November 7, 2016 - 09:15

రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. తెల్లవారింది మొదలు..రాత్రివరకు యథేచ్చగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు మాఫియాగాళ్లు. అధికారులు, పోలీసుల అండదండలతో వందలు, వేల టన్నుల ఇసుకను అమ్ముకొంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగడంలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడి సొంత...

Sunday, November 6, 2016 - 21:23

హైదరాబాద్ : ఎత్తు పెంపు కోసం ప్రమాదకరమైన శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు చికిత్స నిలిపివేశారు. నిఖిల్‌కు ఆపరేషన్‌ చేసిన వైద్యుడు చంద్రభూషణ్‌పై తెలంగాణ వైద్యమండలి వేటు వేసిన నేపథ్యంలో.. తమ కుమారుడికి చికిత్స అందించేందుకు గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నట్లు నిఖిల్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో కాళ్లకు...

Sunday, November 6, 2016 - 19:56

నల్గొండ : అధికార పార్టీలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ఆయన. పైకి చాలా గుంభనంగా కనిపించినా.. తెర వెనక మంత్రాంగం నడిపించడంలో దిట్ట. సీపీఎంలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని.. టీడీపీ, కాంగ్రెస్ లలో వివిధ పదవులు అనుభవించి.. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పంచన చేరారు. రెండు రోజులుగా ఆయన మళ్లీ పార్టీ మారనున్నారని ప్రచారం ఊపందకుంది. ఇంతకు ఎవరాయన? ఆయన...

Sunday, November 6, 2016 - 19:43

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్రకు కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి మద్దతు ప్రకటించారు.. రోజుకు కాస్త దూరం నడిస్తేనే అలసిపోతామని... అలాంటిది తెలంగాణలో పాదయాత్ర బృందం 4వేల కిలోమీటర్లు నడవబోతోందని ప్రశంసించారు.. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంకితభావంతో సీపీఎం బృందం పర్యటిస్తోందని చెప్పుకొచ్చారు.. సీపీఎం ఒక సిద్దాంతానికి కట్టుబడిన పార్టీ అని కితాబిచ్చారు.....

Sunday, November 6, 2016 - 19:40

జయశంకర్ : ప్రొఫెసర్ జయశంకర్‌ జిల్లాలో టీడీపీ రైతు పోరు యాత్ర కొనసాగుతోంది. యాత్రలో సమస్యలను ప్రజలు తమ ముందు వెళ్లబోసుకుంటున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Sunday, November 6, 2016 - 14:49

హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రి అప్రతిష్ఠపాలవుతోంది. ఆసుపత్రి పరిపాలనా అంతా నా ఇష్టం అంటూ దవాఖానాను భ్రష్టు పట్టిస్తున్నాడు ఇక్కడి సూపరింటెండెంట్‌. అధికారంలో ఉన్న ఓ చోటా నాయకుని అండతో రెచ్చిపోతున్నాడు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆగడాలపై 10 టీవీ ప్రత్యేక కథనం..! సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సొంత...

Sunday, November 6, 2016 - 14:38

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముప్పు తప్పదా? వారిపై అనర్హత వేటు పడటం ఖాయంగా కనిపిస్తోందా? సుప్రీం కోర్టు స్పీక‌ర్‌కు ఇచ్చిన గ‌డువు ద‌గ్గర ప‌డుతుండ‌టంతో.. సభాపతి ఏం చెబుతారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం వెల్లడించినా.. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని హస్తం పార్టీ నేతలు ఎందుకు భావిస్తున్నారు....

Pages

Don't Miss