TG News

Thursday, September 22, 2016 - 08:37

మహబూబ్నగర్ : దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న పాలమూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి 96కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.బైపాస్ రోడ్డు మంజూరుతో పాలమూర్ జిల్లా వాసులు హర్షవ్యక్తం చేస్తున్నారు.
నెరవేరనున్న దశాబ్దాల పాలమూరు ప్రజల కల
పాలమూరుపట్టణ వాసులు...

Thursday, September 22, 2016 - 08:24

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో విషాదం నెలకొంది. గ్యాస్ లీకేజై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మౌలాలి ఈడీఏ కంపెనీలో గ్యాస్ లీకేజీ అయింది. దీంతో అందులో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు ఊపరి రాడక అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారు మృతి చెందారు. మృతులు దీరజ్ (20), విజయ్ (28)గా గుర్తించారు....

Thursday, September 22, 2016 - 07:22

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే చేతి, కుల వృత్తుల వారు, వ్యవసాయ కూలీలకు.. పునర్నిర్మాణ, పునరావాస విధానంపై స్పష్టత ఇవ్వాలని  తెలంగాణ ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. దీనికి రెండు వారాల గడువిచ్చింది.
భూ నిర్వాసితుల పిటిషన్‌ పై విచారణ 
మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది...

Thursday, September 22, 2016 - 06:59

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యర్థనల గడువు ముగిసింది. లక్షకుపైగా అభ్యర్థనలు, అభ్యంతరాలు వచ్చాయి. వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి స్వల్ప మార్పులు చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల సర్దుబాటు, ఫైళ్ళ విభజన, డికోడింగ్ తదితర ప్రక్రియలను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. 
బుధవారంతో ముగిసిన అభ్యర్థనల గడువు ...

Thursday, September 22, 2016 - 06:47

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ ఎదురుగా కుంగిపోయిన రోడ్డు మరమ్మత్తులకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని జీహెచ్ ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌  ప్రకటించారు. భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. పైప్‌లైన్‌ కుంగిన ప్రాంతాన్ని మేయర్‌ పరిశీలించారు.. 

Thursday, September 22, 2016 - 06:43

హైదరాబద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల చెరువులు, కుంటలు తెగిపోయి.. వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 
రంగారెడ్డి జిల్లాలో 
...

Wednesday, September 21, 2016 - 21:55

హైదరాబాద్ : ఏ కష్టమొచ్చిందో...ఏ సమస్య చుట్టుముట్టిందో... హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తీరు ఉలిక్కిపడేలా చేసింది...వారం రోజుల తర్వాత సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు బయటపడ్డాయి..

అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి..
ఇది నగరంలోని లంగర్‌హౌజ్‌ ప్రాంతం...ఇంద్రారెడ్డి ఫ్లైవర్‌ డౌన్‌లో ఓ వ్యక్తి...

Wednesday, September 21, 2016 - 21:51

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్‌ వల్ల భూములు నష్టపోతున్న కుల, చేతి వృత్తుల వారికి పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరపున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. పునరావాసం విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై గురువారం...

Wednesday, September 21, 2016 - 21:46

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. టీటీడీపీ ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని పరోక్షంగా తప్పుబట్టింది. ఈ అంశంపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. టీటీడీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. స్పీకర్ నిర్ణయం తర్వాత విచారణ కొనసాగిస్తామని...

Wednesday, September 21, 2016 - 21:40

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రాజెక్టుల టెలిమేట్రీతో పాటు మరో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ చేపట్టిన డిండి, పాలమూరు ప్రాజెక్టులను ఏపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక అనేక అంశాలపై...

Wednesday, September 21, 2016 - 21:36

హైదరాబాద్ : కుండపోత వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. వర్షాల వల్ల.. నగరంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రజారవాణ స్తంభించి పోయింది. వాననీరు... వరదల్లే ముంచుకు రావడంతో, పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై మోకాలి లోతులో నీరు నిలిచింది. వాహనాలు వాన నీటిలో మునిగిపోయాయి....

Wednesday, September 21, 2016 - 18:44

ఢిల్లీ : వివాదాలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ప్రయోజనం ఉండదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అన్నారు. ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి ఢిల్లీలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం రెండున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ పాల్గొన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఇద్దరు...

Wednesday, September 21, 2016 - 17:58

నల్లగొండ : నయీం కేసులో సిట్‌ వేగం పెంచింది. నయీం వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి తెరపైకి వచ్చిన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ముఖ్య అనుచరుడు పలుగుల శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ ఎమ్మెల్సీకి బినామీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాస్‌ తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామస్తుడు. శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు...

Wednesday, September 21, 2016 - 17:54

హైదరాబాద్ : జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎదురువున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ 220 అత్యవసర బృందాలను ఏర్పాటు చేసింది. పొంగిపొర్లుతున్న డ్రెయిన్లు, నాలాలు, నీటి మునిగిన కాలనీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2.00గలకు 518 ఫిర్యాదులొచ్చినట్లుగా జీహెచ్ఎంసీ అధికారి...

Wednesday, September 21, 2016 - 17:51

హైదరాబాద్ : కొత్త జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై అభ్యంతరాలకు గడువు నేటితో ముగిసింది. ప్రభుత్వానికి లక్ష కుపైగా దర్యాప్తులు అందాయి. దీంతో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. రెవెన్యూ డివిజన్లు 44 నుంచి 58కి.. మండలాలు 459 నుంచి 534 కి పెరగనున్నాయి. అయితే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా చిన్నగూడూరును సీఎం...

Wednesday, September 21, 2016 - 17:48

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు.. ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని.. మరో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని ఉమాభారతి అన్నారు. ఇరు...

Wednesday, September 21, 2016 - 16:42

హైదరాబాద్ : తెలంగాణ సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధనకోసం మహాజన పాదయాత్ర చేపడుతున్నామని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.. ఈ అక్టోబర్‌ 17నుంచి వచ్చే ఏడాది మార్చి 12వరకూ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు... హైదరాబాద్‌లోని ఎస్వీకే లో పాదయాత్రకు సంఘీభావంగా దళితుల సమస్యపై చర్చాగోష్టి జరిగింది.. ఈ...

Wednesday, September 21, 2016 - 16:13

హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. లంగర్ హౌస్ నుండి టోలీచౌకీ వెళ్లేదారిలో కారుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేసమయానికి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గుర్తు తెలియని ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగి వారం...

Wednesday, September 21, 2016 - 15:19

హైదరాబాద్ : నగరంలో మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసంది. దీనితో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్వాల్ లో రహదారులు..కాలనీలు నీట మునిగిపోయాయి. ప్రధానంగా టెంపుల్ అల్వాల్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. నాలాలు పొంగి పొర్లుతుండడంతో సమీప కాలనీలు నీట మునిగిపోయాయి. సుమారు మూడు ఫీట్ల మేర నీరు నిలవడం..కాంప్లెక్స్ సెల్లార్ లు నీటితో...

Wednesday, September 21, 2016 - 15:13

ఢిల్లీ : 'అపెక్స్' కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ఈ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..చంద్రబాబు నాయుడులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి ఉమా భారతి అధ్యక్షతనలో ఈ భేటీ జరుగుతోంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కృష్ణా యాజమాన్య బోర్డు ప్రజంటేషన్ ఇచ్చింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరిని ఆయా రాష్ట్రాల...

Wednesday, September 21, 2016 - 14:47

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో జలమయ్యాయి. భారీ వర్షానికి మోత్కూర్ లో జనజీవనం అతలాకుతలం అయ్యింది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్దానికులు చీకట్లోనే గడిపారు. చెరువులకు గండ్లు పడటంతో భారీగా పంటలు నీట మునిగాయి. మోత్కూర్ లో గతంలో నాలా ఉన్న ప్రదేశంలో అపార్ట్ మెంట్ నిర్మించటంతో వరద...

Wednesday, September 21, 2016 - 14:36

ఢిల్లీ : 'అపెక్స్' కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది.  ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు హాజరయ్యారు. తొలుత కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తరపున ప్రజెంటేషన్‌ ఉంటుంది. దాని తర్వాత 2 గంటల 35 నిమిషాలకు అజెండా అంశాలపై చర్చిస్తారు. అపెక్స్ కౌన్సిల్‌లో మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఏపీ సీఎం...

Wednesday, September 21, 2016 - 13:47

ఢిల్లీ : తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగబోతుంది. ఢిల్లీలో మ.2. గం.లకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరుకానున్నారు. మ.2.05 గం.లకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రజెంటేషన్ ఇవ్వనుంది. మ.2.15 గం.లకు ఆంధ్రప్రదేశ్ తరపున...

Wednesday, September 21, 2016 - 12:57

హైదరాబాద్ : నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు, రహదారులు జలమయమ‌య్యాయి. వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా నీరు చేరడంతో ఎప్పటికప్పుడు నీటిని బయటికి వదులుతున్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది.  కూకట్ పల్లిలోని ఆల్విన్ కాలనీ,...

Wednesday, September 21, 2016 - 12:00

హైదరాబాద్ : నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో అల్వాల్ అతలాకుతలమైంది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. వరద నీటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గుడిసెలు వేసుకుని నివసించే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇళ్లలోకి భారీగా నీరు చేరింది....

Pages

Don't Miss