TG News

Friday, December 7, 2018 - 15:04

నల్గొండ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్న అతడు గుండెపోటుతో అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడిని నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన నర్సింహగా...

Friday, December 7, 2018 - 14:54

నల్గొండ : నాకు చూపు సరిగ్గా కనబడదు..టీఆర్ఎస్‌కి ఓటు వేయాలని ఆ దివ్యాంగుడు కోరితే...ఆ అధికారి ఏకంగా ‘చేయి’ గుర్తుకు ఓటు వేశాడు....తీవ్ర ఆగ్రహానికి గురైన అక్కడి వారు అతనిపై చేయి చేసుకుని చితకబాదారు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే...
...

Friday, December 7, 2018 - 14:48

ఢిల్లీ : తెలంగాణ  ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు సుప్రీంకోర్టులో ఆనాడు పూర్తిస్థాయి అధికారంతో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి (అసెంబ్లీని రద్దు చేసిన ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం...

Friday, December 7, 2018 - 14:37

నల్గొండ : జిల్లాలో పోలింగ్ సిబ్బంది అత్యుత్సాహం చూపారు. భోజనం కోసం ఏకంగా పోలింగ్ కేంద్రానికే తాళం వేయడం వివాదాస్పదమైంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. అక్కడకక్కడ సమస్యలు ఏర్పడినా వాటిని అధికారులు...

Friday, December 7, 2018 - 14:28

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీన జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ 50 శాతానికి చేరుకుంది. ఇదే కంటిన్యూ అయితే పోలింగ్ ముగిసే సరికి 70 శాతానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
...

Friday, December 7, 2018 - 14:08

హైదరాబాద్ : ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు పరాభవం ఎదురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బూత్ లోకి వెళ్తున్న ఆయనను ఓటర్లు అడ్డుకున్నారని, నేరుగా బూత్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు స్పష్టం...

Friday, December 7, 2018 - 13:58

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లరు అనూహ్యంగా స్పందించారు. మధ్యాహ్నం 1గంటకే 48.3 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో అభివ‌ృద్ధి చేయలేదని...

Friday, December 7, 2018 - 13:51

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య సమ్రతతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ ను చూడగానే అభిమానులంతో చుట్టుముట్టారు. సెల్ఫీ అడిగిన అభిమానులను అలరించారు. కాగా కొంతసేపే క్యూ...

Friday, December 7, 2018 - 13:20

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వింత జరిగింది. ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో తొలిసారి ఓటు వేశారు. తన భార్యతో కలిసి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అల్వాల్‌లోని వెంకటాపురంలో గద్దర్ ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉంది. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో...

Friday, December 7, 2018 - 12:59

హైద‌రాబాద్: టెన్నిస్ స్టార్..తెలంగాణ ఆడబిడ్డ, పాకిస్థాన్ కోడలు అయిన సానియా మీర్జా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇటీవ‌ల పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన సానియా మీర్జా హై ద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. కాగా రాష్ట్ర‌వ్యాప్తంగా టాప్ సెల‌బ్రిటీలు సాధారణ వ్యక్తుల్లా వచ్చి...

Friday, December 7, 2018 - 12:57

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంట‌నే టోల్‌ప్లాజాలు ఎత్తివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం వరకు టోల్‌ప్లాజాలు ఎత్తివేయాలని సీఎస్‌ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్‌ప్లాజాలు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ...

Friday, December 7, 2018 - 12:49

కొడంగల్ (మహబూబ్ నగర్) : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం డేగకళ్లతో పర్యవేక్షిస్తోంది. అయినాసరే కొడంగల్ నియోజకవర్గంలో డిసెంబర్ 6 తేదీ రాత్రి సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఘటన జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు...

Friday, December 7, 2018 - 12:41

గజ్వేల్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఓటింగ్ జరుగుతోందని..టీఆర్ఎస్‌కు అనుకూల పవనాలున్నాయని తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు కేసీఆర్ సతీసమేతంగా చింతమడక గ్రామానికి వచ్చారు. పోలింగ్...

Friday, December 7, 2018 - 12:37

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వర్‌రావు, కుటుంబసభ్యులు ఓటు వేశారు. జూబ్లీహిల్స్...

Friday, December 7, 2018 - 12:29

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్ లో భాగంగా మెగాస్టార్ కుటుంబ సభ్యలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మోగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కుమార్తె శ్రీజలతో...

Friday, December 7, 2018 - 12:29

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కావాల్సిన పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రజత్ కుమార్...

Friday, December 7, 2018 - 12:01

హైదరాబాద్ : తొలిసారిగా చేసిన ఏ పని అయినా అదొక తీపిగుర్తుగా వుండిపోతుంది. అందులోనే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఆనందంగా వుందటున్నాడు నిర్మలా కాన్వెంట్ సినిమాతో తొలిసారి హీరోగా తెరగ్రేటం చేసిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఊహన ముద్దుల తనయుడు రోషన్.  'నిర్మలా కాన్వెంట్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన...

Friday, December 7, 2018 - 11:50

హైదరాబాద్: డిసెంబర్ 7 రాష్ట్రం అంతా ఓట్ల కోలాహలంగా వుంది. పలువురు రాజకీయా నేతలుతమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ ప్రచారంతో ఓట్లు అడిగిన నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటమే కాక అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆపద్ధర్మ మంత్రులు తమ సతీ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు...

Friday, December 7, 2018 - 11:42

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో రికార్డు శాతం ఓటింగ్ నమోదు కానుందని తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ నాలుగు గంటలు వరకు 23 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇదిలా ఉంటే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓటర్లను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నాడని..వెంటనే ఆయనపై చర్యలు...

Friday, December 7, 2018 - 11:42

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాజకీయ నాయకులు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో బూత్ నెంబర్ 124లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్...

Friday, December 7, 2018 - 11:30

ఖమ్మం : ‘ఉదయం 7గంటలకు వచ్చినం..ఇంకా క్యూ లైన్‌లోనే ఉన్నం..ఇంకా ఓటేయ్యలే’..అంటూ ఖమ్మం ఓటర్లు పేర్కొంటున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు....

Friday, December 7, 2018 - 11:12

మహబూబ్ నగర్ : ప్రశాంతంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకటైన కల్వకుర్తిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అమన్ గల్ మండలం జంగారెడ్డి పల్లెలో ఓ బూత్‌ను పరిశీలించేందుకు వంశీచంద్...

Friday, December 7, 2018 - 11:08

హైదరాబాద్: డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంట్లో భాగంగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు ప్రభుత్వ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి నగరంలోని ప్రశాసన్‌నగర్‌లో గల సెరికల్చర్ కార్యాలయంలో...

Friday, December 7, 2018 - 10:49

వరంగల్ : జిల్లా అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరుతున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గెలుపొందేందుకు నేతలు అడ్డదారులు తొక్కారు. ఈసీ అధికారులు..పోలీసులు జరిపిన దాడులు..తనిఖీల్లో భారీగా నగదు..మద్యం...

Friday, December 7, 2018 - 10:43

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లు వేయటనికి సాధారణ ప్రజానీకంతో పాటు ప్రముఖులు కూడా క్యూలలో నిలబడి ఓటు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జోరుగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయడానికి ఉత్సాహంగా తరలి వచ్చారు. టీఆరెస్ ఎంపీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు...

Friday, December 7, 2018 - 10:30

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. కొన్ని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించటంతో ఆలస్యంగా ప్రారంభం అయ్యింది ఓటింగ్. ప్రముఖులు అందరూ ఉదయం 7 గంటల నుంచే బూతులకు తరలివచ్చారు. 10 గంటలలోపు చాలా మంది రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సామాన్యుల్లా క్యూలో నిల్చొని మరీ ఓటు వేశారు.
...

Friday, December 7, 2018 - 10:19

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, తల్లితో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. క్యూలైన్‌లో నిరీక్షించి మరీ జూనియర్...

Pages

Don't Miss