TG News

Wednesday, January 20, 2016 - 09:09

హైదరాబాద్ : నగరంలో నాగోల్ లో ఉన్న ఓ ఏటీఎం మంటల్లో కాలిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నాగోల్ పరిధిలో హెచ్ డీఎఫ్ సీ, ఐసీసీఐ బ్యాంకులకు చెందిన ఏటీఎంలున్నాయి. తాను తెల్లవారుజామున ఊడుస్తుండగా హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో పొగ..మంటలు వచ్చాయని సెక్యూర్టీ గార్డు పేర్కొన్నాడు. ఒక్కసారిగా మంటలు ఏటీఎం మొత్తం విస్తరించాయి. క్షణంలోనే ఏటీఎం..అందులో ఉన్న...

Wednesday, January 20, 2016 - 06:31

హైదరాబాద్ : అరకొర సౌకర్యాలతో... అంతంతమాత్రం వైద్యంతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి.. హైదరాబాద్‌తోపాటు.. జిల్లాల్లోని ఆస్పత్రులను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది ప్రభుత్వం.. ఇందులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది.. హైదరాబాద్‌ను హెల్త్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందు ఉస్మానియా...

Wednesday, January 20, 2016 - 06:29

హైదరాబాద్ : తెలంగాణ అటవీశాఖలో 42 సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీకి 462 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. వీటితో పాటు కాలేజీ సూపరింటెండెంట్‌ కార్యాలయంకు 55, ప్రిన్సిపల్‌ ఆఫీసుకు 24 పోస్టులు, క్లినికల్‌ స్పెషాలిటీ విభాగానికి 302,...

Wednesday, January 20, 2016 - 06:25

హైదరాబాద్ : సెంట్రల్‌ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య వెనుక.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమని తెటతెల్లమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు లేఖల ద్వారా.. కేంద్ర మంత్రిత్వ శాఖలు.. యూనివర్శిటీపై ఒత్తిళ్లు తేవడం వల్లే.. రోహిత్‌ సహా.. మరికొందరు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు పడిందని తెలుస్తోంది. ఆగస్టులో.. వర్శిటీకి చెందిన ఏబీవీపీ కార్యకర్తపై...

Tuesday, January 19, 2016 - 21:47

హైదరాబాద్ : హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ మృతికి నిరసనగా విద్యార్థి,ప్రజాసంఘాలు పెద్దఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేశారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

రోహిత్‌ మృతితో ఆందోళనలు

హెచ్‌సీయూలో దళిత విద్యార్థి...

Tuesday, January 19, 2016 - 21:42

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై తన ప్రగాడ సానుభూతిని ప్రకటించారు వైఎస్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. దళిత విద్యార్థులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు జగన్. మృతి  చెందిన విద్యార్థి రోహిత్ కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. విద్యార్థి మృతికి వీసీ కేంద్ర మంత్రుల పాత్ర ఉందని ఆరోపించారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.   

Tuesday, January 19, 2016 - 21:39

హైదరాబాద్ : దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ మృతికి హెచ్‌సియూ వైస్ ఛాన్స్‌లర్, కేంద్ర ప్రభుత్వమే నైతికంగా బాధ్యత వహించాలని  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని ఖూనీ చేశారంటూ ప్రధానిపై కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. 
హెచ్ సీయూను...

Tuesday, January 19, 2016 - 20:45

హైదరాబాద్ : హెచ్ సీయూ రిసెర్చ్ స్కాలర్ విద్యార్థి రోహిత్ మృతిపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ మృతికి నిరసనగా రచయిత అశోక్ వాజ్ పేయి తనకు ఇచ్చిన డాక్టరేట్ అవార్డును వెనక్కి పంపించారు. హెచ్ సియు ప్రదానం చేసిన డి.లిట్ అవార్డును తిప్పి పంపుతున్నట్లు ఆయన ప్రకటించారు. హెచ్ సీయూతోపాటు ఢిల్లీలో ని సెంట్రల్ యూనివర్సిటీ, దేశ వ్యాప్తంగా రోహిత్ మృతి ఘటనకు నిరసనలు...

Tuesday, January 19, 2016 - 19:19

మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ పర్యటనతో ఆ బస్తీవాసులు సంతోషంలో మునిగిపోయారు. మురికివాడలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం హామీతో ఇక తమ కష్టాలు తీరిపోయినట్లే అనుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు మంచినీటి కష్టాలు తీరుస్తానని సీఎం వరాలు కురిపించారు. ఇదంతా ఏడాది క్రితం పాలమూరు మున్సిపాలిటీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు. అయితే నేటికీ ఒక్క హామీ కూడా అమలు...

Tuesday, January 19, 2016 - 19:10

కరీంనగర్‌ : జిల్లాలో నిర్వహించిన చల్లప్ప కమిషన్‌ సమావేశం నిరసనలతో హోరెత్తింది. వాల్మీకి బోయ, కైతి లంబాడి కులస్థులను ఎస్‌టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌పై కమిషన్‌ అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ గిరిజన విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వీరికి పోటీగా తమను ఎస్‌టీ జాబితాలో కలపాలంటూ వాల్మీకి, బోయ కులాల నేతలు నిరసన చేపట్టాయి. దీంతో పరిస్థితి...

Tuesday, January 19, 2016 - 19:07

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి దత్తాత్రేయ వహించాలని మాలమహానాడు నేత కారెం శివాజీ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని దత్తాత్రేయను భర్తరఫ్ చేయాలని కోరారు. వీసీ అప్పారావుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

 

Tuesday, January 19, 2016 - 19:02

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య బాధాకరమని టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనుల్లోనే తాము బీజేపీతో భాగస్వామ్యమని...సామాజిక వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఇది వర్తించదని తేల్చి చెప్పారు.

 

Tuesday, January 19, 2016 - 18:57

హైదరాబాద్ : పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ దురదృష్టకరమని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఈ ఘటనలో హెచ్ సీయూ వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ వైఖరిని ఖండించారు.

 

Tuesday, January 19, 2016 - 17:39

నల్గొండ : అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు కిడ్నీ విక్రయించిన నూకరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్‌ నడుపుతున్న సురేశ్ ప్రజాపాటి... 57మందిని కొలంబోకు తరలించి కిడ్నీ మార్పిడి చేయించారని పోలీసులు తెలిపారు. కిడ్నీ కొనుగోలుచేసిన వారి ఆచూకీ రాబడుతున్నామని ప్రకటించారు. అవసరమైతే కొలంబో వెళ్లి దర్యాప్తు...

Tuesday, January 19, 2016 - 16:47

హైదరాబాద్ : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉద్యమాన్ని వ్యతిరేకించినవారు ఇప్పుడు పాలకులై జనాల నెత్తిన కూర్చున్నారని విమర్శించారు.

Tuesday, January 19, 2016 - 16:44

మహబూబ్ నగర్ : హెచ్ సీయూలో రోహిత్ మృతికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ దిష్టిబొమ్మను పీడీఎస్ యూ నాయకులు దహనం చేశారు. రోహిత్ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 

Tuesday, January 19, 2016 - 15:46

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై సీపీఎం ఆగ్రహం  వ్యక్తం చేసింది. రోహిత్ ది ఆత్మహత్య కాదని.. ఎన్ డీఏ హత్య అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విద్యా కాషాయీకరణను ఎండగడతామని చెప్పారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయలను వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతు...

Tuesday, January 19, 2016 - 14:51

హైదరాబాద్  : సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు వర్సిటీ వీసీ, హెచ్చార్డీ మినిష్టర్ స్మృతి ఇరాని బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో రాహుల్ వర్సిటీకి చేరుకున్నారు. అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. రోహిత్  తల్లి, దండ్రులను పరామర్శించారు. జేఏసీ ఏర్పాటు చేసిన మీటింగ్ లో...

Tuesday, January 19, 2016 - 13:42

హైదరాబాద్ : హెచ్ సియూ లో రోహిత్ చిత్ర పటానికి ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ....యూనివర్శిటీలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు.

Tuesday, January 19, 2016 - 13:34

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చేరుకున్నారు. హెచ్ సియూ లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లి దండ్రులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.అనంతరం రోహిత్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం సస్పెన్షకు గురైన మరో 4 గురు విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖా ముఖీ నిర్వహిస్తున్నారు.

Tuesday, January 19, 2016 - 12:45

హైదరాబాద్ : రోహిత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాసేపట్లో హైదరాబాద్‌ రానున్నారు. అయితే రాహుల్‌ పర్యటనను అడ్డుకుంటామని ఏబీవీపీ హెచ్చరిస్తోంది. మానవాతా ధృక్పథంతో పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడమేంటని నాగేందర్ ప్రశ్నించారు.

Tuesday, January 19, 2016 - 12:42

రంగారెడ్డి : చెంగిచర్ల మ్యారీగోల్డ్‌ ఫామ్‌హౌస్‌లో వంశీకృష్ణ అనుమానాస్పదంగా చనిపోవడంతో.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే 17 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ తర్వాత ఈ వంశీకృష్ణ చనిపోయినట్లు తెలుస్తోంది. 

Tuesday, January 19, 2016 - 12:37

హైదరాబాద్ : బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా హెచ్ సియూ చేరుకోనున్నారు. రోహిత్ ఆత్మహత్య, పర్యవసనాలపై తోటి విద్యార్థులతో చర్చించనున్నట్లు సమాచారం. రోహిత్ కుటుంబ సభ్యులతో, వర్శిటీ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపుతున్నాయి.

Tuesday, January 19, 2016 - 10:28

హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కు నిరసనగా ఈ రోజు ఉదయం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణ జాగృతి యువజన విభాగం యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాగృతి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దత్తాత్రేయ లేఖ వల్లే విద్యార్థుల బహిష్కరణ, ఆత్మహత్యకు కారణమంటూ కార్యకర్తలు తెలిపారు. తక్షణమే...

Tuesday, January 19, 2016 - 09:32

హైదరాబాద్ : టీవీ నటుడు జబర్దస్త్‌ ప్రోగ్రాం కమెడియన్‌ చలాకీ చంటీ న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కారు. తనను ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు అసభ్య పదజాలంతో కామెంట్స్‌ చేశాడంటూ ఖమ్మం జిల్లా ఇల్లందు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబందించి ఇల్లందుకు చెందిన గిరిజనుడు గొగ్గల రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో ప్రభాస్‌ను బకరా అన్నాడని అందుకే తన ఫ్రెండ్స్...

Tuesday, January 19, 2016 - 09:30

నల్లగొండ : నార్కెట్‌పల్లి మండలం అక్కెనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గుట్టల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tuesday, January 19, 2016 - 09:08

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బేగం పేటకు చేరుకుని… అనంతరం రోడ్డు మార్గం ద్వారా హెచ్‌సీయూను సందర్శిస్తారు. రోహిత్‌ ఆత్మహత్యకు గల కారణాలు, తదితర పరిణామాలపై విద్యార్థి సంఘాల నేతలతో రాహుల్...

Pages

Don't Miss