TG News

Friday, April 29, 2016 - 17:26

హైదరాబాద్ : తనకు సీఎం కేసీఆర్‌ నుంచి ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర పరిధిలోని భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. రేవంత్‌ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారి చేసింది. తర్వాత విచారణను జూన్‌కు వాయిదా వేసింది. 

 

Friday, April 29, 2016 - 16:55

మహబూబ్‌ నగర్‌ : సూపర్ స్టార్ మహేశ్ బాబు దత్తత తీసుకున్న మహబూబ్‌ నగర్‌ జిల్లా సిద్దాపూర్‌ గ్రామంలో ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సందడి చేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన మెడికల్‌ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామస్తులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్‌ క్యాంప్ నిర్వహిస్తామని.. స్థానిక సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు....

Friday, April 29, 2016 - 16:09

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందవద్దని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ సూచించారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. 

 

Friday, April 29, 2016 - 15:54

హైదరాబాద్ : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సర్కార్‌ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తనిఖీలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.

 

Friday, April 29, 2016 - 15:51

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో స్వచ్ఛ ఆటో ట్రాలీల అదృశ్యంపై కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. లెక్కతేలని 100 ఆటోలను సాయంత్రంలోగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అదృశ్యమైన ఆటో ట్రాలీల యజమానులపై సాయంత్రంలోగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ఆటో ట్రాలీలను
భాగంగా పంపిణీ చేశారు. 

 

Friday, April 29, 2016 - 13:34

హైదరాబాద్ : నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోంది. మీకు టిక్కెట్లకు ఇబ్బంది ఉండదు.. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ఎమ్మెల్సీ సంఖ్యను పెంచొచ్చు. ఇది అటు ఏపీ సీఎం చంద్రబాబు ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు.. పార్టీలో చేరుతున్న మిగతా నేతలకు చెబుతున్న మాట. మరి 2019 ఎన్నికల్లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిలిమిటేషన్ సాధ్యమేనా.. కేంద్రం మదిలో ఏముంది.. అనేప్రశ్నలు...

Friday, April 29, 2016 - 13:19

హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. వచ్చే నెల నుంచి అధికారులతో కలసి జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. లీటర్‌కు నాలుగు రూపాయల...

Friday, April 29, 2016 - 13:10

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణకు బొగ్గు కుంభకోణం వదలడం లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కాంలో దాసరిపై మరింత ఉచ్చు బిగిసింది. ఈ రోజు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్, మధుకోడాలపై ఛార్జీషీట్ నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అక్రమ మార్గాల్లో బొగ్గు కేటాయింపులు జరిపారంటూ ఆధారాలు ఉన్నాయని...

Friday, April 29, 2016 - 12:11

ఢిల్లీ : నీట్‌ పరీక్షపై కేంద్రం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోర్టును అటార్నీ జనరల్‌ కోరారు. ఇప్పటికిప్పుడు పరీక్షను హిందీ, ఇంగ్లీషులో రాయడం కష్టమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని...

Friday, April 29, 2016 - 11:49

హైదరాబాద్ : ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ఇవాళ, రేపు తెలుగురాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. విదర్భ నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణీ ప్రభావంతో తెలంగాణ, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది....

Friday, April 29, 2016 - 11:42

హైదరాబాద్ : ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనేమో..తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆవేదనకు పరిష్కారం చూపకుండా కొత్త ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవును నివారించటానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పత్తిపంట వేయటం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కొత్త...

Friday, April 29, 2016 - 11:00

మహబూబ్ నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాసేపట్లో శంకుస్థాపన జరుగనుంది. నార్లాపూర్‌ వద్ద ప్రాజెక్టుకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఖరారు చేశారు. దీనిలో భాగంగా ఆరు ప్యాకేజీ పనులకు నార్లపూర్‌లో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు....

Friday, April 29, 2016 - 10:29

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 1గంటల వరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ సెట్‌ కోడ్ జీ-2 ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. కాకినాడలో నిర్వహించిన సెట్ కోడ్‌ ఎంపిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి కామినేని శ్రీనివాస్, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి...

Friday, April 29, 2016 - 09:25

విజయవాడ : ఏపీలో కాసేపట్లో ఎంసెట్ పరీక్ష జరగబోతోంది. నిమిషం ఆలస్యమయినా పరీక్షకు అనుమతించమన్న నిబంధన కారణంగా విద్యార్థులు సమయానికి ముందే పరీక్ష సెంటర్ల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌర్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని ఎస్సై కాళిదాసు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రానికి రావటానికి ఇబ్బంది...

Friday, April 29, 2016 - 07:07

హైదరాబాద్ : ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. పాలేరు ఉప ఎన్నిక‌, రాష్ట్రంలో నెల‌కొన్న క‌రవుపై సీఎల్పీ సమావేశం చర్చించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై న్యాయ‌పోరాటం ఉధృతం చేయాల‌ని నిర్ణయించింది. ఐతే సమావేశంలో కొందరు నేతల అలకలు, ఆగ్రహాలతో మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. ఉద‌యం ప‌ద‌కొండు గంట‌లకు మొద‌...

Friday, April 29, 2016 - 07:01

హైదరాబాద్ : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో వర్గ వివక్ష కొనసాగటం సిగ్గుచేటయిన విషయం. నేటికీ ఈ వివక్ష కొనసాగుతూనే వుంది. రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేద్కర్ 125 జయంతి వేడుకలు ఇటీవల దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాష్ట్రానికే తలమానికమైనది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన వర్శిటీ...

Friday, April 29, 2016 - 06:50

ఖమ్మం : పాలేరు ఉపఎన్నికలో సీపీఐ, వామపక్షాలు బలపర్చిన సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ రావు గురువారం నామినేషన్ వేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య... పార్టీ జిల్లా నేతలు.. భారీ ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం అభ్యర్థి పోతినేని టెన్ టివితో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో సీపీఎం పార్టీ...

Friday, April 29, 2016 - 06:31

కర్ణాటక : సాగునీటి రంగంలో కర్నాటకతో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని రాజోలిబండ మళ్లింపు పథకం అపరిష్కృత పనులను రెండు నెలల్లో పూర్తి చేయడానికి కర్నాటక అంగీకరించింది. అలాగే తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల గొంతు తడిపేందుకు నారాయణ్‌పూర్...

Friday, April 29, 2016 - 06:28

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్‌, మెడిసిన్‌, అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష--- ఎంసెట్‌ వాయిదా పడ్డాయి. వచ్చే నెల 1న టెట్‌, 2న ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలకు ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ వీటి యాజమాన్యాలు బంద్‌ పాటిస్తున్నాయి. పోటీ పరీక్షలకు తమ విద్యా సంస్థలను ఇవ్వబోమని ప్రకటించాయి...

Thursday, April 28, 2016 - 21:29

ఖమ్మం : రాష్ట్రంలో కరవు విజృంభిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం సభలో కరవుపై నోరెత్తకపోవడం దారుణమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ ప్రజాసమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్న కేసీఆర్‌ నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని సీపీఎం పొలిట్‌...

Thursday, April 28, 2016 - 21:24

హైదరాబాద్ : నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌.. నీట్‌ను కచ్చితంగా నిర్వహించి తీరాలన్న సుప్రీం ఆదేశం.. తెలుగు రాష్ట్రాల బైపీసీ విద్యార్థుల్లో గందరగోళాన్ని నింపింది. ఏపీలో శుక్రవారం ఎంసెంట్‌ జరుగనుంది. తెలంగాణలోనూ మే 2న ఎంసెట్‌ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దశలో.. నీట్‌ పరీక్ష తప్పనిసరన్న సుప్రీం తీర్పుతో.. విద్యార్థులు...

Thursday, April 28, 2016 - 20:28

హైదరాబాద్ : నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే, విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ ఏడాది వరకు నీట్‌ నుంచి వెసులుబాటు కల్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు విధానం మార్చుకుంటే విద్యార్థులకు నష్టం కలుగుతుందని మంత్రి అన్నారు....

Thursday, April 28, 2016 - 18:23

హైదరాబాద్ : డ్యాన్స్‌ హైదరాబాద్‌ డ్యాన్స్ పేరుతో 10 జిల్లాలతో కూడిన మొట్టమొదటి రియాల్టీ షోని నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి జోగు రామన్న అన్నారు. డ్యాన్స్‌లో తమ ప్రతిభ చూపించాలని ఎదురుచూస్తున్న వారికిది మంచి అవకాశమని తెలిపారు. రియాల్టీ షో ప్రోమోను మంత్రి విడుదల చేశారు. మే1 నుంచి తెలంగాణ జిల్లాల్లో ఆడిషన్సు నిర్వహిస్తామని...

Thursday, April 28, 2016 - 18:20

వరంగల్ : కరువు బారినుంచి రైతులనుఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని జెఎసి నేతలు ప్రొఫెసర్‌ కోదండరామ్, మాజీ జస్టిస్‌ చంద్రకుమార్ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన నేతలు ఏనుమాముల మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు మిర్చి, పసుపు, పత్తి కొనుగోళ్లను...

Thursday, April 28, 2016 - 18:18

కరీంనగర్ : జిల్లాలో బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కోనరావుపేట మండలం బావుసాయి పేటలో 18 సంవత్సరాల అబ్బాయి, 16 సంవత్సరాల అమ్మాయికి వివాహాం చేస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు రంగప్రవేశం చేసి వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సింగ్ ఇచ్చారు.

 

Thursday, April 28, 2016 - 18:17

హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 17న నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఎస్‌ఐ సివిల్ పరీక్షలో లక్షా 74 వేల 962 మంది హాజరుకాగా 88 వేల 875 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 52 శాతం, మహిళలు 41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్‌ఐ కమ్యూనికేషన్ పరీక్షకు 10వేల 584 మంది...

Thursday, April 28, 2016 - 17:05

హైదరాబాద్ : మనసు, మమత, మాధుర్యాల కలబోత మానవత.... గుప్పెడు గుండె చప్పుడే జీవన మనుగడ.... బంధం, అనుబంధం, సంబంధాల సమ్మేళనమే కుటుంబ సరాగం.. సంసార సాగరం. చిన్న అపశ్రుతి.. క్షణికావేశం.. కట్టుతప్పిన ఆలోచన.. తప్పుదారి పట్టిన అలవాటు బ్రతుకు నావకు చిల్లు పొడిస్తే మునిగిపోతున్న కుటుంబాలెన్నో.. మరుగున పడుతున్న వ్యథార్థ గాథలెన్నెన్నో.. ఈ నిజం దృశ్యం...

Pages

Don't Miss