TG News

Wednesday, October 11, 2017 - 18:40

హైదరాబాద్ : మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐద్వా మహాసభలు ముగిసాయి. ఈ సందర్భంగా 81 మందితో ఏర్పాటు చేసిన నూతన కమిటీతో పాటు నూతన అధ్యక్షురాలిగా బుగ్గవీటి సరళ, ప్రధాన కార్యదర్శులుగా మల్లు లక్ష్మి ఎన్నికయ్యారు. మహాసభల్లో ఆరు తీర్మానాలు చేశామని ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళలపై హింస, అత్యాచారాలను అరికట్టేలా కఠిన చట్టం తేవాలని ఆమె డిమాండ్‌...

Wednesday, October 11, 2017 - 18:25

హైదరాబాద్ : వనస్థలిపురం చింతలకుంటలోని జాతీయరహదారి పక్కనే ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భవన నిర్మాణ దారులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా ఆర్డర్ కాపీపై ఎటువంటి స్టాంపు లేదని అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. కొద్దిసేపటి తరువాత భవన యజమానులు స్టే ఆర్డర్‌పై స్టాంపు వేయించుకుని తేవడంతో కూల్చివేతల ప్రక్రియ...

Wednesday, October 11, 2017 - 18:21

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం మేడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్మా సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. సభకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలు, ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు అరెస్ట్ చేసిన స్థానికులు, నిర్వాసితులను బస్సులో తరలిస్తుండగా.. బస్ అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని...

Wednesday, October 11, 2017 - 17:58

ఖమ్మం : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. తప్పతాగి దారి తప్పాడు. వికృతచేష్టలు చేశాడు. విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జిల్లాలోని కామేపల్లి హైస్కూల్‌లో వేణుగోపాల్‌ సోషల్‌ టీచర్‌ గా పని చేస్తున్నాడు. తొమ్మిదో విద్యార్థినిని గదిలో తీసుకువెళ్లి.. వేణుగోపాల్ అసభ్యకరంగా మాట్లాడాడు. ఇదే విషయం విద్యార్థిని బంధువులకు తెలియడంతో అడిగేందుకు...

Wednesday, October 11, 2017 - 17:49

కొమురం భీం అసిఫాబాద్ : జిల్లాలో లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పర్మిట్ లేకున్నా కొందరు అధికార పార్టీ నేతలు... లారీలు నడుపుతూ తమ పొట్ట కొడుతున్నారని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలంటూ... రెబ్బెన పీఎస్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. ఈ సందర్భంగా... పోలీసులు లారీ డ్రైవర్ల మధ్య...

Wednesday, October 11, 2017 - 16:36
Wednesday, October 11, 2017 - 15:51

సిద్దిపేట : తనకు రాజకీయ జన్మనిచ్చిన సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువేనని..తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌, మెడికల్‌ కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. సిద్దిపేట ప్రజలు ఏది కోరినా కాదనని తెలిపారు. సిద్దిపేట జిల్లాకు స్పెషల్ పోలీస్...

Wednesday, October 11, 2017 - 15:32

సిరిసిల్ల : సీఎం కేసీఆర్‌ టూర్‌ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సీఎం పర్యటన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బస్సులను రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు బస్టాండ్లలో నోటీసులు అంటించారు. బస్సులు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 

 

Wednesday, October 11, 2017 - 15:30

వనపర్తి : జిల్లా నూతన కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు ఉపముఖ్యమంత్రి మహముద్‌ అలీ భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం వనపర్తి మండలంలోని పెద్దగూడెం, అప్పాయిపల్లి గ్రామాలలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానికి ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

 

Wednesday, October 11, 2017 - 15:28

జగిత్యాల : జిల్లాలోని ధరూర్‌లో ఆర్‌ అండ్‌బీ, కలెక్టర్‌ ఆఫీస్‌లకు మంత్రి ఈటల రాజేందర్‌ శంకుస్థాపన చేశారు. కొత్తజిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతోపాటు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. 

Wednesday, October 11, 2017 - 15:00

సిద్దిపేట : సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దుద్దెడలో కలెక్టరేట్‌ నిర్మాణం, మెడికల్‌ కాలేజీ, పోలీస్‌ కమిషనరేట్‌లకు శంకుస్థాపన చేశారు. భవన నమూనాలను పరిశీలించిన అనంతరం.. శిలాఫలకాలను ఆవిష్కరించారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీ ఏర్పాటు చేశారు. 

 

Wednesday, October 11, 2017 - 13:26

 

మేడ్చల్ : జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై తలసాని కారుకు ప్రమాదం జరిగింది. తలసాని కారును గుడ్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి తలసాని క్షేమంగా బయటపడ్డారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కలెక్టరేట్ భవనం శంకుస్థాపనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి....

Wednesday, October 11, 2017 - 13:22

రంగారెడ్డి : జిల్లా యాచారం మండలం మేడిపల్లిఓ ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా సిటీ ఏర్పాటుపై జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళంగా మారింది. మరోవైపు సభకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను, ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, October 11, 2017 - 13:09

ఖమ్మం : జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో సంతలో విద్యుత్ షాక్ తో 12 పశువులు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Wednesday, October 11, 2017 - 12:10

 

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. బోర్డు అధికారులు అసంబద్ద నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఇంటర్‌ బోర్డు ప్రతిష్ట దిగజారుతోంది. ప్రధానంగా కాలేజీలకు గుర్తింపునిచ్చే అంశం వివాదాస్పదమవుతోంది. అఫ్లియేషన్‌ గడువు ముగిసే వరకు అనుమతి ఇవ్వకపోవడం, రాత్రికి రాత్రే వందలాది కాలేజీలకు గుర్తింపు ఇవ్వడంతో ఇంటర్‌బోర్డు...

Wednesday, October 11, 2017 - 12:07

 

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇంటర్‌ కమిషనరేట్‌లో.. ఇంటర్‌ బోర్డులో జరుగుతున్న అన్యాయాలకు అమాయకులు బలవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలు, నియామకాలు మొదలు.. ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇచ్చేంతవరకు అన్నింట్లో అవినీతి అక్రమాలే తారసపడుతున్నాయి. ఇంటర్‌ బోర్డు అవినీతి అక్రమాలకు...

Wednesday, October 11, 2017 - 11:41

కరీంనగర్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్, రామడుగు మండలం గోపాలరావు పేట లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. అధికారులు భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్, జ్యువెల్లరీని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి....

Wednesday, October 11, 2017 - 11:02

హైదరాబాద్ : నగరాన్ని వాన వదలడంలేదు. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రామంతపూర్ పెవచెరవు నీటితో 10 రోజులుగా కాలనీలు నీటితో మునిగింది. 500 కుటుంబాలు నీటి ముంపుతో అవస్థలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు గత 5రోజులుగా మోటార్ లతో నీటిని తోడుతున్నారు. ఇవాళ ఉదయం 125 హెచ్ పీ మోటార్ తో నీటిని తోడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, October 11, 2017 - 10:10

 

కరీంనగర్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్, రామడుగు మండలం గోపాలరావు పేట లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Wednesday, October 11, 2017 - 10:09

హైదరాబాద్ : నగరాన్ని వాన వదలడంలేదు. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రామంతపూర్ పెవచెరవు నీటితో 10 రోజులుగా కాలనీలు నీటితో మునిగింది. 500 కుటుంబాలు నీటి ముంపుతో అవస్థలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు గత 5రోజులుగా మోటార్ లతో నీటిని తోడుతున్నారు. ఇవాళ ఉదయం 125 హెచ్ పీ మోటార్ తో నీటిని తోడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, October 11, 2017 - 08:12

 

కరీంనగర్/సిరిసిల్ల/సిద్దిపేట : సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు సీపీఎం నేతలను ముందుస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. సీఎం పర్యటను అడ్డుకుంటారన్న సమాచారంతో ఆర్ధరాత్రి నుంచే అరెస్ట్ లు చేస్తున్నారు....

Pages

Don't Miss