TG News

Sunday, May 22, 2016 - 20:22

మెదక్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా నర్సాపూర్ దళిత మహిళ అత్యాచార ఘటనను పోలీసులు చేదించారు. ఐదుగురు యువకులు ఆమెను అత్యాచారం చెయ్యలేదనే నిజాన్ని తెలిపారు. అదంతా కట్టుకథని తేల్చారు. ఈనెల 20న సంగారెడ్డి వెళ్లిన ప్రమీల నర్సాపూర్ వచ్చి భాన్‌సింగ్‌ అనే వ్యక్తితో కలిసి పటాన్‌చెరు వెళ్లి లాడ్జిలో ఉన్నారు. రాత్రి ప్రమీలకు రక్తస్రావం అధికం కావడంతో...

Sunday, May 22, 2016 - 19:41

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెంలో ఓ యువకుడికి.. మహిళలు దేహశుద్ధి చేశారు. గొల్లగూడెం ప్రాంతంలో భార్యభర్తలను రాత్రి వేళల్లో చూస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని చితకబాదారు. విజయ్‌ కుమార్ అనే ఈ యువకుడు సెల్‌ఫోన్‌ను మర్చిపోయి వెళ్లడంతో నెంబర్‌ ఆధారంగా పట్టుకున్నారు. కరెంట్ స్తంభానికి కట్టేసి చెప్పులతో కొట్టి పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

 

Sunday, May 22, 2016 - 19:29

నల్గొండ : ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ తరహాలో మోడీ సర్కారు పనితీరు ఉందని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన శ్రీనివాసరావు..మోడీ సర్కారు విధానాలను ఎండగట్టారు. విద్యావ్యవస్థలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కేంద్రం...

Sunday, May 22, 2016 - 19:23

కరీంనగర్ : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చీటింగ్‌ కేసు పెట్టారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో సీఎంపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ జిల్లా తొలి పర్యటనలో జిల్లాకు 40 హామీలు  ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదని సీఎంపై చీటింగ్‌ కేసు పెట్టారు. పోలీసులు కేసీఆర్‌పై కేసు నమోదు చేయకపోతే...

Sunday, May 22, 2016 - 18:07

వరంగల్ : జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షలో గందరగోళం నెలకొంది. సుందరయ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఓఎంఆర్ షీట్స్ కు బదులు ఇన్విజిలేటర్లు నకిలీ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 

Sunday, May 22, 2016 - 15:56

మహబూబ్‌నగర్‌ : ఇద్దరూ అమ్మాయిలే పుట్టారంటూ ఓ భర్త తన భార్యను ఇంటినుంచి గెంటేశాడు. కూతురి కాపురం సరిచేద్దామని వెళ్లిన మామపై గొడ్డలితో దాడి చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో ఈ ఘటన జరిగింది. ఆరేళ్లక్రితం అనితకు, మురళితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ఇద్దరూ అమ్మాయిలే పుట్టారంటూ భార్యపై మురళి వేధింపులు పెంచాడు. ఆమెను తీవ్రంగా కొట్టి...

Sunday, May 22, 2016 - 15:52

మహబూబ్‌నగర్‌ : గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ బస్సు ప్రతి మండల, పంచాయితీ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది. ఈ యాత్రను గట్టు మండలం బోయలగూడెంలో మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి ప్రారంభించారు. 

 

Sunday, May 22, 2016 - 15:46

హైదరాబాద్ : నిరాడంబరంగా జీవితం గడిపిన పర్సా సత్యనారాయణ నేటి తరానికి ఆదర్శమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు కొనియాడారు. కమ్యూనిస్టు సీనియర్ నేత పర్సా సత్యనారాయణ వర్ధంతి సభ ఎస్వీకే లో జరిగింది.  బీవీ రాఘవులు పర్సా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్మిక ఉద్యమ నిర్మాత పర్సా అని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేశారని...

Sunday, May 22, 2016 - 15:27

మహబూబ్నగర్ : టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మహిళ పురుటి నొప్పులకు గురై మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌ మండలానికి చెందిన కవిత... టెట్ పరీక్ష రాసేందుకు జిల్లా కేంద్రానికి వచ్చారు. గంట ముందుగా ఎగ్జామ్ సెంటరైన మోడ్రన్‌ హైస్కూల్‌కు చేరుకున్నారు. అంతలోనే నొప్పులు రావడంతో హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు....

Sunday, May 22, 2016 - 13:37

ఢిల్లీ : కాషాయ మూకలు మళ్లీ దాడులకు తెగబడుతున్నారు. గోల్ మార్కెట్ లో ఉన్న సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ నేతలు దాడులకు దిగారు. కేరళలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ కేరళలో బీజేపీ నేతల హత్యకు సీపీఎం కారణమని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సీపీఎం కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం పార్టీ బోర్డును ధ్వంసం చేసి...

Sunday, May 22, 2016 - 10:08

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 10-12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 – 5.00 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష కోసం మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ముషిరాబాద్ లోని ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పలు ఇబ్బందులకు గురయ్యారు. రెండు ఫొటోలు తీసుకరాకపోవడంతో పలు సమస్యలు ఎదుర్కొన్నారు.
...

Sunday, May 22, 2016 - 08:49

హైదరాబాద్ : కొత్త జిల్లాలను రాత్రికి రాత్రే ప్రకటించి, ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దని సీఎల్పీనేత జనారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి శాస్త్రీయంగా, రాజ్యాంగబద్దంగా, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జిల్లాల ఏర్పాటు జరగాలని ఆయన అన్నారు. రాజకీయపార్టీలు, ఉద్యోగ - ప్రజాసంఘాలు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. నల్లగొండ...

Sunday, May 22, 2016 - 06:39

హైదరాబాద్ : ఉద్యమకాలంలో చురుకుగా ఉన్న తెలంగాణ ఉద్యోగ సంఘాలలో చీలిక వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాక్ లో కలిసి పనిచేసిన ఉద్యోగ సంఘాలన్నీ క్రమంగా జాక్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఘాల్లో కీలకంగా ఉన్న టీఎన్జీవో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత...

Sunday, May 22, 2016 - 06:36

ఆదిలాబాద్ : జిల్లా సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించే చనాఖా కొరాట బ్యారేజీకి లైన్‌ క్లీయర్‌ అయింది. బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఎన్‌వోసీపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2018 జూలై కల్లా ప్రాజెక్టును...

Sunday, May 22, 2016 - 06:30

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ జేఈఈ, తెలంగాణలో టెట్‌ ఒకేరోజు జరగబోతున్నాయి. ఇవాళ నిర్వహించబోయే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.. జేఈఈకి తెలుగు రాష్ట్రాల నుంచి 22వేలమంది.. టెట్‌కు 4లక్షలమంది హాజరుకాబోతున్నారు. ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్‌కు సర్వం సిద్ధమైంది.. ఈ పరీక్షకు...

Sunday, May 22, 2016 - 06:28

హైదరాబాద్ : రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తప్పించి వాణిజ్య పన్నుల శాఖ ను సీఎం కేసీఆర్ ఇటీవలే తన వద్ద ఉంచుకున్నారు. తాజాగా ఈ శాఖ పనితీరుపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పన్నుల వసూలు శాస్త్రీయంగా బేరీజు వేసుకుని పని...

Sunday, May 22, 2016 - 06:19

హైదరాబాద్ : వెస్ట్ జోన్‌ పరిధిలోని పంజాగుట్ట, ఎల్లారెడ్డిగూడలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. అనుమతులు లేని 24 ప్రైవేట్‌ హాస్టళ్లపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్స్‌ లేని 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న 16 హుక్కా...

Saturday, May 21, 2016 - 21:56

ఆదిలాబాద్‌ : జిల్లా సరిహద్దులో చనాఖా కొరాట ప్రాంతంలో నిర్మించబోయే బ్యారేజీకి లైన్‌ క్లీయర్‌ అయింది. బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తూ అటవీ, వన్యమృగ సంరక్షణ, గనులకు సంబంధించి ఎన్‌ఓసీ జారీచేసింది. మొత్తం 51వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు అనుమతి కోసం తెలంగాణ...

Saturday, May 21, 2016 - 18:50

కరీంనగర్ : ఈ ఏడాది తునికాకు సేకరణ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అడివిలో తునికాకు తగ్గడం, అనుకున్నంత ఆకు దొరక్క పోవడం, దీనికి తోడు తునికాకు యూనిట్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. కూలీలను దయనీయ స్థితిలో పడేస్తున్నాయి.

ఆకు లభ్యత తగ్గిపోవడంతో...

Saturday, May 21, 2016 - 18:33

ఖమ్మం : రైల్ నిలయంలో సీఆర్ పీఎఫ్ , సీఐఎస్ భద్రతా దళాలు ఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేశారు. ఆర్పీఎఫ్ ఏఎస్సై సుబ్బారావుపై పాశవికంగా దాడి చేసి చితకబాదారు. ఆర్పీఎఫ్ , సీఆర్ పీఎఫ్ సిబ్బింది వారించినప్పటికీ జవానులు మూకుమ్మడిగా రెచ్చిపోయారు. రప్తీసాగర్ రైలులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేకపోవడంతో రైలును ఖమ్మం రైల్ నిలయంలో...

Saturday, May 21, 2016 - 17:43

మెదక్ : నర్సాపూర్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కరవు అయిందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తరువాత మహిళలపై హింస పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రిగారి జిల్లాలోనే దాదాపు 15 కేసులు జరిగాయని తెలిపారు. మహిళలపై పెరుగుతున్న హింసా ఘటనలు వింటుంటే బాధగా వుంటుందన్నారు. బాధిత కుటుంబాలను ప్రజాప్రతినిధులు...

Saturday, May 21, 2016 - 16:52

హైదరాబాద్ : బ్రాహ్మణకులాలను కించపరిచేలా మాట్లాడారని కంచె ఐలయ్యపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'స్వేదం.. వేదం' అనే అంశంపై జరిగిన సమావేశంలో తమ్మినేని పాల్గొని, మాట్లాడారు. ఐలయ్యపై ఆరోపణలను తమ్మినేని ఖండించారు. ఐలయ్యకు తమ పార్టీ అండగా ఉంటుందని...

Saturday, May 21, 2016 - 16:44

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ లోని మహేంద్రహిల్స్‌లో ఉన్న ఆర్‌సీఐ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి 9 కోట్ల 85లక్షల డబ్బును నొక్కేశారు. శుక్రవారం సాయంత్రం సర్వీస్‌ సెంటర్‌కు సంబంధించిన 9.85 కోట్ల డబ్బు కనిపించడంలేదని సంస్థ మేనేజర్‌ నాగరాజు తుకారాంగేట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే కేసు నమోదు చేసుకున్న...

Saturday, May 21, 2016 - 16:35

హైదరాబాద్ : యాడ్‌ ఏజెన్సీలతో హైదరాబాద్ మేయర్, కమిషనర్ సమావేశం ముగిసింది నగరంలో హోర్డింగ్స్‌పై ఉన్న ప్లెక్సీలను వెంటనే తొలగించాలని సమావేశంలో మేయర్ ఆదేశించారు. ప్రస్తుతమున్న హోర్డింగ్‌ల సామర్థ్యం అనుమతి తీసుకున్న ప్రకారం ఉన్నాయో.. లేదో పరిశీలించేందుకు 10 కమిటీలు ఏర్పాటు చేశారు.గత కొద్దిరోజులు గా కురుస్తున్న వర్షానికి హోర్డింగ్స్ కూలి ప్రాణాలు...

Saturday, May 21, 2016 - 12:49

కరీంనగర్: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జరిగింది. పెద్దలు పెళ్లికి నిరాకరించటంతో మనస్థాపానికి గురైన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన మౌనిక, కృష్ణమూర్తి గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. 

Saturday, May 21, 2016 - 12:48

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. వైద్య పరిభాషలో జెజునవ్ గాంగ్లియోటిక్ పరిగగ్లియాన్ అని పిలిచే వింత కంతి... రాములు అనే రోగి కడుపులో నుంచి శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. కాంటినెంటల్ గ్యాస్ర్టా ఎంటరాలజిస్ట్ డాక్టర్ విజయ్ రాం నేతృత్వంలో వైద్య బృందం అత్యాధునికి పరిజ్ఞానంతో...

Saturday, May 21, 2016 - 12:44

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల తేనెతుట్టె కదిలింది. మొన్న మహబూబాబాద్‌... నిన్న గద్వాల... ఇవాళ రామగుండం.. వేములవాడ.... ఇలా రోజుకో జిల్లాలో ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. కొత్త జిల్లాల కోసం అనేకమంది ఆందోళన బాటపడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం, వేములవాడలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలన్న డిమాండ్‌తో ప్రజలు కథం తొక్కతున్నారు.

...

Pages

Don't Miss