TG News

Saturday, January 2, 2016 - 16:59

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ నుండి నామినేషన్ వేసి విత్ డ్రా చేయడానికి కారణం కాంగ్రెస్‌ నేతల ఒత్తిడేనని మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి చెప్పారు. తన దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నారని.. మరో 2 కోట్లు అడగటంతోనే తాను విరమించుకున్నట్లు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు, రాహుల్‌కు ఆయన లేఖ రాసినట్లు తెలియచేశారు. తానిచ్చిన డబ్బును కూడా తిరిగివ్వమంటే.....

Saturday, January 2, 2016 - 16:58

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆంధ్రప్రాంత ప్రజలకు వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ....సంక్రాంతి తరువాతే గ్రేటర్‌ ఎన్నికలు ఉంటాయని కేటీఆర్‌ ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. తేదీలను ప్రకటించే అధికారం...

Saturday, January 2, 2016 - 16:55

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాహనదారులకు బీమా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ఈ-వాహన్ బీమా అనే పథకాన్ని ప్రారంభించింది. దీంతో వాహనదారులకు అత్యంత సౌకర్యంగా ఉంటుందని తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. త్వరలోనే డిజిటల్ ప్రక్రియలో ఆర్సీలు, లైసెన్స్‌లు ఇచ్చే యోచనలో...

Saturday, January 2, 2016 - 15:49

హైదరాబాద్ : ఢిల్లీ ప్రొఫెసర్‌ సాయిబాబాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయనను బేషరుతుగా విడుదల చేయాలని కోరాయి. సాయిబాబాకు మద్దతుగా హైదరాబాద్‌ లిబర్టీలోని అంబేద్కర్‌ విగ్రహాం దగ్గర ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. సాయిబాబా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌...

Saturday, January 2, 2016 - 15:45

హైదరాబాద్ : అన్ని పార్టీలూ తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని టి కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే నని స్పష్టం చేవారు. అన్నీ కూల్చాలనే ఆలోచనలు చేసే టిఆర్‌ఎస్‌ అధినేత హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ఆయన...

Saturday, January 2, 2016 - 15:43

నల్గొండ : విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుణ్ని నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి దగ్గర కారు ఢీకొట్టింది. మృతదేహం కారు టాప్‌పై పడినా కారు యాజమాని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. కారుపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంబడించి కట్టంగూర్‌ మండలం ఐటిపాముల సమీపంలో పట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...

Saturday, January 2, 2016 - 14:42

హైదరాబాద్ : ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 2015 సీజన్ కు రంగం సిద్ధమయ్యింది. ముంబైలో నేటినుంచి ప్రారంభంకానున్న లీగ్ ప్రారంభమ్యాచ్ లో ముంబై, లక్నోజట్లు తలపడతాయి. రాత్రి 7 గంటలకు ఈటోర్నీ ప్రారంభమవుతుంది. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధికారికంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో హైదరాబాద్ అంచె సమరం జనవరి 9 నుంచి 11 వరకూ జరుగుతుంది.....

...

Saturday, January 2, 2016 - 14:37

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మ‌ల్టీలెవ‌ల్ ప్లై ఓవ‌ర్ల ప్రాజెక్టు పట్టాలెక్కేలా కనిపించడం లేదు. బిడ్లు దాఖలు చేసే దిక్కు లేక టెండర్ల దశలోనే ప్రాజెక్టు ఆగిపోయింది. కానీ విచిత్రంగా మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపనకు ముహూర్తం పెట్టేశారు బల్దియా అధికారులు. ఇంతకీ మల్టీ లెవల్‌ ఫై ఓవర్‌ ప్రాజెక్టుకు ఉన్న...

Saturday, January 2, 2016 - 14:34

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు వ్యవస్థ మరింత టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే పెట్రోలింగ్‌లో జీపీఎస్‌, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి సౌకర్యాలు కలిగిన అధునాతన వాహనాలు సమకూర్చుకుంది. పోలీసు స్టేషన్లలో వైఫై, ఫేస్‌బుక్‌లతో పాటు కొత్తకొత్త యాప్స్‌ను ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లను...

Saturday, January 2, 2016 - 14:31

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో గ్రేటర్ వార్‌ హీటెక్కిస్తోంది. బల్దియా బరిలో నిలిచే... రేసుగుర్రాల వేటలో పడింది హస్తం పార్టీ. అభ్యర్థి ఎంపిక నుంచి బూత్ కమిటీల వరకు... ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేష‌న్ రాగానే... డోర్ టు డోర్ ప్రచారంతో హోరెత్తించాల‌ని డిసైడ్ అయ్యింది. మేయర్‌ అభ్యర్థిని సైతం...

Saturday, January 2, 2016 - 14:28

హైదరాబాద్ : అమెరికా నుంచి హైదరాబాదులోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 15 మంది విద్యార్థులు తిరిగి వచ్చారు. 15మంది తెలుగు విద్యార్థులు ఉన్నతచదువుల కోసం అమెరికా వెళ్లారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అమెరికా అధికారులు వారిని వెనక్కి పంపారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సియాటెల్‌ వర్సిటీలో తమను బంధించారంటూ విద్యార్థులు ఆరోపించారు. అమెరికాలో తాము...

Saturday, January 2, 2016 - 12:50

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ రేపు సాయంత్రం వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం... జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారంతో అన్ని పక్షాల నేతలు ఎన్నికలకు సమాయత్తమయ్యారు.

 

Saturday, January 2, 2016 - 10:54

హైదరాబాద్ : అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. సుమారు 15 మంది తెలుగు విద్యార్థులు ఈ రోజు ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. గత కొద్ది కాలంగా ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన విద్యార్థులను అక్కడి అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. అయితే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా అధికారులు తిప్పిపంపిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం...

Saturday, January 2, 2016 - 09:43

హైదరాబాద్ : పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్ లను అధికారులు అప్రమత్తం చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు భద్రత పెంచారు. శంషాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

 

Saturday, January 2, 2016 - 08:53

హైదరాబాద్ : గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వ్యూహాత్మకంగా సిద్ధమ‌వుతున్న గులాబీ పార్టీ...బల్దియా కోటపై జెండా ఎగరేసేందుకు దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటి వ‌ర‌కు నిర్వహించిన స‌ర్వేల‌లో ఫ‌లితాల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయన్న స‌మాచారం వ‌స్తోంద‌ని అధికార పార్టీ అంటోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేసుకున్న గులాబి ద‌ళ‌ప‌తి వాటిని అధిగ‌మించేందుకు అన్నిర‌కాల...

Saturday, January 2, 2016 - 08:35

హైదరాబాద్ : నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్ శాఖపై తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రాజెక్టు డైరెక్టర్ రాధాకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లో రైతులకు ఎట్టపరిస్థితుల్లో పగటిపూట 9 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇతర...

Saturday, January 2, 2016 - 07:47

హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉదయం సచివాలయంలో సమావేశం అవుతుంది. సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో అజెండా భారీగా ఉంది. అందుకే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం దాదాపు నాలుగున్నర వరకు జరిగనుంది.
గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధాన చర్చ
మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా...

Friday, January 1, 2016 - 21:32

హైదారాబాద్ : తెలంగాణ క్యాబినెట్ రేపు సమావేశం కానుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, బడ్జెట్ రూపకల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా పలు వరాలు ప్రకటించనున్నారు. దీంతో పాటు క్యాబినెట్‌లో పలు వివాదాస్పద అంశాలపైనా చర్చించనున్నారు.

ఉదయం 11 గం.ల నుంచి...

Friday, January 1, 2016 - 21:28

హైదరాబాద్‌ : నగరంలో నుమాయిష్ సందడి మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేసిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో... ప్రభుత్వ, ప్రైవేట్ స్టాళ్లు సహా పలు ఉత్పత్తులను ప్రదర్శించారు. 46...

Friday, January 1, 2016 - 21:27

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కలిసి పోరాడారు. కానీ తెలంగాణలో మాత్రం సిగపట్లు పడుతున్నారు. బైపోల్‌, కౌన్సిల్ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్నా... గ్రేటర్‌లో మాత్రం కమలదళం టార్గెట్‌గానే TRS అస్త్రాలను ప్రయోగిస్తోంది. బల్దియా ఫైట్‌... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య... దూరం పెంచేలా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో పాటు కాషాయనేతలపై గులాబీ లీడర్లు...

Friday, January 1, 2016 - 20:57

హైదరాబాద్ : కోట్లాది మంది మనసు దోచుకుంటున్న టీవీ షో, అప్రతిహాసంగా దూసుకుపోతున్న గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్ -3లో ఓ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇప్పటి వరకు మీలో ఎవరు కోటీశ్వరుడులో గెలుచుకున్న అత్యధిక మొత్తం రూ.12లక్షల యాభై వేలు మాత్రమే. కానీ ఈ సీజన్ 3లో ఈ రికార్డును బ్రేక్ చేశారు రావణ శర్మ. ఎక్కడ చూసినా రావణ శర్మ పై చర్చ జరుగుతోంది. 'రావణ శర్మ' తో...

Friday, January 1, 2016 - 18:24

హైదరాబాద్ : నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సంవత్సరాదిని దైవ దర్శనంతో ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రముఖ ఆలయాలకు బారులు తీరారు. 31 రాత్రి నుంచే భక్తుల రాకపోకలు కొనసాగాయి. మినిస్టర్లు, అధికారులు, ప్రముఖులు వివిధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల...

Friday, January 1, 2016 - 18:12

హైదరాబాద్ : గ్రేటర్‌లో లెఫ్ట్‌, లోక్‌సత్తా కూటమి... కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేసింది. ప్రజా సమస్యలపై పోరాటం తప్పదని వామపక్ష, లోక్‌సత్తా నేతలు హెచ్చరించారు. తక్షణమే గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. మెరుగైన పారిశుద్ధ్యం, గ్రీన్ సిటీ, అందరికీ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా... పోరాటం చేస్తామని వామపక్ష, లోక్‌...

Friday, January 1, 2016 - 18:11

ఆదిలాబాద్ : ముల్తానీలు..! ఈ పేరు వింటేనే ఆదిలాబాద్‌ జిల్లా ఉలికిపడుతుంది. ముఖ్యంగా అటవీ పరిసర ప్రాంతాలు ఆగమాగమై పోతాయి. ముల్తానీల కర్కశత్వాన్ని గురించి కథలు కథలుగా గుసగుసలు పోతాయి. అటవీ, పోలీసు అధికారుల ఫైళ్లు.. వారి నేరాల గురించి రికార్డు.. రికార్డులుగా చాటుతాయి. వారి వద్దకు వెళ్లడమే తప్ప తిరిగి వచ్చిన వారు లేరన్న ప్రచారమూ ఉంది. ఇంతకీ ఎవరీ...

Friday, January 1, 2016 - 16:18

హైదరాబాద్ : కోడి కొండెక్కేసింది. వంద నోట్లు మూడు చూపిస్తే గాని ముక్కకూడా రాల్చనంటోంది. ఐదు సెంచరీలు దాటేసిన మేకను వదిలేసిన మాంసప్రియులు కోడితో సరిపెట్టేసుకుంటున్నారు. ఇప్పుడా కోడి కూడా డబుల్ సెంచరీ దాటడంతో అరకోడితో సర్దుకుంటున్నారు.

కరుస్తోన్న కందిపప్పు...

కందిపప్పు సామాన్య జనాన్ని కసురుకుంది. టమాట మాట వింటేనే...

Friday, January 1, 2016 - 16:07

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ సర్కార్‌పై టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్ మాయమాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ ఎంసీ మేయర్ ఎన్నికను... ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్‌ నేతలు... ఆంధ్రా సోదరులంటూ జపం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్...

Friday, January 1, 2016 - 14:32

నల్గొండ :యాదాద్రి జిల్లా అయ్యే విధంగా కరుణించాలని కోరుతూ.. యాదగిరి నరసింహునికి టి.టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు వినతిపత్రం సమర్పించారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించేలా సీఎం కేసీఆర్‌కు సద్బుద్ధి ప్రకటించాలని నరసింహుని కోరినట్టు ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Pages

Don't Miss