TG News

Thursday, October 8, 2015 - 20:15

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో పేదల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చివరిదశకు చేరుకున్నాయి. ఐడిహెచ్ కాలనీలో ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు గదుల ఇళ్ల నిర్మాణాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. పేదలకు మంచి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్.. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా...

Thursday, October 8, 2015 - 19:29

వరంగల్ : ప్రభుత్వం రైతు రుణమాఫీని వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని వామపక్షాలు నేతలు హెచ్చరించారు. లేనిపక్షంలో ఈనెల 10న రాష్ర్ట బందు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు రుణాలకు మారిటోరియం ప్రకటించాలని, ప్రభుత్వం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను నియంత్రించాలని నేతలు డిమాండ్‌ చేశారు. వరంగల్‌ నియోజక వర్గం వామపక్షాల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి గాలివినోద్‌ కుమార్‌ సన్నాహక...

Thursday, October 8, 2015 - 19:26

వ‌రంగ‌ల్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపరం కొనసాగుతూనే ఉంది. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప‌త్తిరైతు తన పొలంలో పురుగుల‌ మందు తాగి బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడిన ఘ‌ట‌న వెలుగుచూసింది. మృతుడు దేవ‌రుప్పలమండలం చిన్నమాడురుకు చెందిన న‌ర్సయ్యగా గుర్తించారు. మృతుడు నర్సయ్య 4 ఎక...

Thursday, October 8, 2015 - 18:59

నల్లగొండ : జిల్లాలోని ఇంద్రపాలనగరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం స్థానికులను విషాదంలోకి నెట్టింది. భువనగిరి-నల్లగొండ మార్గంలో దాదాపు ఆయా గ్రామాల ప్రజలే బస్సులో ప్రయాణిస్తుంటారు. దీంతో ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులలో దాదాపు సమీపంలోనే వారే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు మేల్కొన్నారు. ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద ఉన్న చెట్లను...

Thursday, October 8, 2015 - 18:33

ఆదిలాబాద్ : జిల్లాలోని బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 9న చలో అసెంబ్లీకి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈమేరకు వివిధ జిల్లాల నుంచి ఆశా వర్కర్లు ఈరోజు హైదరాబాద్ తరలివస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఆశా వర్కర్లు హైదరాబాద్ వస్తుండగా 50 మంది ఆశా వర్కర్లను బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో...

Thursday, October 8, 2015 - 15:27

నల్లగొండ : జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను కలెక్టర్‌ సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ పరామర్శించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో...

Thursday, October 8, 2015 - 15:00

ఖమ్మం : జిల్లాలో నేడు కాంగ్రెస్ రైతు భరోసాయాత్ర చేపట్టారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలన్నందుకు తమను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీని టీఆర్‌ఎస్‌ భవన్‌లా మార్చారని ఎంపీ మధుయాష్కి విమర్శించారు. రైతులకు రుణమాఫీ ఒకేసారి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలకు సమాధానం...

Thursday, October 8, 2015 - 13:50

వరంగల్ : దసరా నవరాత్రి ఉత్సవాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. మహిళలు అందంగా అలంకరించుకుని బతుకమ్మ పాటలు పాడుతుంటారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న మహిళలు భయపడుతున్నారు. బయటకు ఎలా రావాలి అని బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకు ?  చారిత్రాత్మకమైన త్రినగరి వణికిపోతుంది. వరంగల్‌ మహానగరంలోకి చొరబడ్డ ముఠాలు పంజా విసురుతున్నాయి. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉన్నా...

Thursday, October 8, 2015 - 13:38

హైదరాబాద్ : ఈనెల పదో తేదీన జరుగబోయే బంద్ కు సహకరించాలని అన్ని వర్గాలకు విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. గురువారం శాసనసభ ఆవరణలో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 10న జరగబోయే బంద్‌కు తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మద్దతు ప్రకటించాయి. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించాయి. అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ భవన్‌లా మార్చేశారని నేతలు మండిపడ్డారు నేతలు. ఈ సందర్భంగా...

Thursday, October 8, 2015 - 13:30

హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో సుమారు 10 గుడిసెలకు పైగా తగలబడ్డాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కూలీ..నాలి పనిచేసకుంటున్న పది కుటుంబాలు ప్రశాంత్ నగర్ లో గుడిసెలు వేసుకుని జీవనం గడుపుతున్నారు. గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ గుడిసెలో వంట చేస్తుండగా ఈ ప్రమాదం చోటు...

Thursday, October 8, 2015 - 13:27

హైదరాబాద్ : సిమ్లా యాపిల్‌ల ధరలు నేలను తాకుతున్నాయి. ఒకప్పుడు తినాలంటేనే ధరను చూసి భయపడ్డ సామాన్యులు ఇపుడు ధరలు తగ్గడంతో సిమ్లా యాపిల్‌ను ఇష్టంగా కొంటున్నారు. ఒక్కొక్కరు కేజీల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు గతంలో రోజుకి ఒక్క బాక్సు మాత్రమే అమ్మే వ్యాపారులు..ఇప్పుడు నాలుగైదు బాక్సులు అమ్మేస్తూ లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌...

Thursday, October 8, 2015 - 13:25

హైదరాబాద్ : చార్మినార్‌.. హైద‌రాబాద్‌లో మంచి ప‌ర్యాట‌క కేంద్రం. ఇప్పుడీ చార్మినారే జీహెచ్ఎంసీ అధికారుల‌కు కాసుల వర్షం కురిపిస్తుందా? కోట్లకు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నా సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదా? అంటే అవున‌నే అనిపిస్తుంది. చార్మినార్‌ను జాతీయ వార‌స‌త్వ క‌ట్టడంగా గుర్తించిన కేంద్రం ఆ ప్రాంతాన్ని మ‌రింత‌గా అభివృద్ది చేయ్యాల‌ని నిర్ణయించింది....

Thursday, October 8, 2015 - 11:50

మహబూబ్ నగర్ : గద్వాల పట్టణంలో బుధవారం పురాతనంగా ఉన్న బిందె బయటపడింది. తేరుమైదానం సమీపంలో పాత మహారాజ కూరగాయల మార్కెట్ కూల్చివేసి నూతన మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. నూతన మార్కెట్ సమీపంలో మురుగు కాల్వ నిర్మాణం చేపట్టారు. బుధవారం కాల్వ కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జేసీబీకి భారీ బిందె తగలడంతో బయటకు తీశారు. క్షణాల్లోనే ఈ విషయం...

Thursday, October 8, 2015 - 10:48

నల్గొండ : జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మరిచిపోకముందే నార్కట్ పల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటోను కారు ఢీకొనడంతో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. వీరందరీ పరిస్థితి నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తోంది.
కొంతమంది పత్తి కూలీలు గురువారం ఉదయం...

Thursday, October 8, 2015 - 09:21

హైదరాబాద్ : తెలంగాణభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ కన్వీనర్ లు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. మార్కెట్ , దేవాలయ కమిటీల నియామకంపై భేటీలో చర్చ జరగనుంది. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశ‌పెట్టిన గులాబీ పార్టీ....రిజ‌ర్వేషన్ లకు అనుగుణంగా ప‌ద‌...

Thursday, October 8, 2015 - 08:31

హైదరాబాద్ : సునాయసంగా డబ్బులు సంపాదించాలని కొందరు దొంగలు అనుకున్నారు. ఇందుకు బ్యాంకు ఏటీఎంలో ఉండే డబ్బులను చోరీ చేయాలని యత్నించారు. ఇందుకు నగర శివారు ప్రాంతంలో ఉన్న ఏటీఎంలను ఎంచుకున్నారు. పథకం ప్రకారం వెళ్లారు. కానీ ఏటీఎం మాత్రం తెరుచుకోలేదు.. మరో బ్యాంకు ఏటీఎం ను ట్రై చేశారు. అది కూడా తెర్చుకోలేదు. చివరకు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. ఈఘటన వనస్థలిపురంలో చోటు...

Thursday, October 8, 2015 - 06:32

విశాఖపట్టణం : ఓ పక్క విశాఖ ఏజెన్సీలో కిడ్నాప్‌నకు గురైన ప్రజాప్రతినిధులు ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. మరోపక్క ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో అపహరణకు గురైన ముగ్గురు రైతులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు విభిన్న ఘటనల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరినీ...

Thursday, October 8, 2015 - 06:28

హైదరాబాద్ : వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సమగ్ర జల విధానం సమావేశానికి తెలంగాణ సర్కార్‌ ఎట్టకేలకు మూహుర్తం ఖరారు చేసింది. ఈనెల 15న హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. భవిష్యత్‌లో చేపట్టబోయే నీటి ప్రాజెక్టులు ఎలా ఉండాలి ? ప్రస్తుత ప్రాజెక్టులను రీడిజైనింగ్‌ చేయాల్సిన అవసరం ఏమిటి? తదితర విషయాలపై మీటింగ్‌లో స్పష్టత...

Thursday, October 8, 2015 - 06:25

హైదరాబాద్ : తెలంగాణ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 23న ప్రారంభమైన శాసనసభ.. బుధవారంతో ముగిసింది. ప్రారంభం రోజు మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్, ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణానికి సంతాపం ప్రకటించిన తర్వాత.. సభ వాయిదా పడి.. 29వ తేదీన పునప్రారంభమైంది. అక్కడి నుంచి వరుసగా బుధవారం వరకు సాగింది.

ఏడు రోజులు..
మొత్తం...

Wednesday, October 7, 2015 - 21:29

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. చివరిరోజు పలు అంశాలపై చర్చించిన శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిసినందున సభను వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

కేసీఆర్‌ సభలో చాలాసేపు మాట్లాడారు...

Wednesday, October 7, 2015 - 19:45

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనకై నిర్వహించిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 

Wednesday, October 7, 2015 - 19:40

మహబూబ్‌నగర్‌ : గద్వాలలో తవ్వకాలలో ఓ పురాతన పాత్ర బయటపడింది. గద్వాల్‌లోని కూరగాయల మార్కెట్‌ నిర్మాణంలో ఉండగా.. అక్కడి పురాతన భవనానిన జెసీబీతో తవ్వుతుండగా ఒక భారీ పురాతన పాత్ర బయటపడింది. అయితే అందులో బంగారం ఉందనే టాక్‌ రావడంతో.. జనమంతా భారీగా తరలి వచ్చారు. వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. ఆ పాత్రను స్వాధీనపర్చుకున్నారు.

Wednesday, October 7, 2015 - 16:57

హైదరాబాద్ : వరకట్న దాహానికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలైంది. హైదరాబాద్‌ కేపీహెచ్ బీ కాలనీ పీఎస్‌ పరిధిలో శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. నిజాంపేట రోడ్డు ప్రశాంత్‌ నగర్‌లో నివాసం ఉంటున్న శైలజ, భర్త నవీన్‌కుమార్‌ల మధ్య కొంతకాలంగా గొడవలు జరిగేవి. ఉదయం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలని శైలజను నవీన్‌కుమార్‌ తీవ్రంగా వేధించాడు. దీంతో...

Wednesday, October 7, 2015 - 16:50

హైదరాబాద్ : ఈ నెల 10 న ఇచ్చిన రాష్ర్టబంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వరంగల్‌ ఉప ఎన్నిక ప్రకటన రాకపోయినప్పటికీ వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన తమ్మినేని టెన్ టివి తో మాట్లాడుతూ... రాఊంలో ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ...

Wednesday, October 7, 2015 - 16:46

హైదరాబాద్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే ప్రధాన కారణమన్నారు కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణ. ఎన్నికల ముందు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ గద్దెనెక్కారని విమర్శించారు. రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం కూడా రైతులు ఆత్మహత్యలకు ప్రధాన...

Wednesday, October 7, 2015 - 16:44

హైదరాబాద్ : ఈనాటి రైతుల ఆత్మహత్యలకు గత పాలకులే కారణమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని గత 50 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు రాష్ట్రంలోని చెరువులను పూర్తి నిర్లక్ష్యం చేశాయన్నారు. చెరువులను సంపూర్ణంగా పునరుద్ధరించి ఉంటే.. బోర్లు ఎండిపోయేది కాదని.. తద్వారా రైతుల ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం...

Wednesday, October 7, 2015 - 16:41

హైదరాబాద్‌ : నగర శివార్లలోని బాలాపూర్‌ వద్ద కృష్ణా వాటర్‌ పైప్‌లైన్‌ పగిలిపోయింది. దీంతో మొత్తం వాటర్‌ చాలా ఫోర్స్‌గా రోడ్డుపైన పొంగింది. దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.

Pages

Don't Miss