TG News

Monday, April 17, 2017 - 15:58

నిజామాబాద్ : ఇరవై ఏళ్లు వస్తే కాళ్లు వంకర్లు పోతాయి. పరుగెత్తాల్సిన వయసులో అడుగు తీసి అడుగు వేసేందుకు అపసోపాలు పడతారు. ఇదేమీ వింత జబ్బుకాదు. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారుతోంది. నిజామాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామం ఫ్లోరైడ్‌ బారినపడి నరకయాతన అనుభవిస్తున్న దుస్థితిపై ప్రత్యేక కథనం.

ఫ్లోరైడ్ అనగానే గుర్తొచ్చేది..........

Monday, April 17, 2017 - 15:50

ఖమ్మం : గులాబీ కూలీదినాల్లో భాగంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ బార్బర్‌ అవతారమెత్తారు. ఖమ్మంలోని ఓ హెయిర్‌స్టయిల్‌ షాపులో ఆయన గడ్డం గీశారు. ఆ తర్వాత చికెన్‌ షాపులో చికెన్‌ కొట్టారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి చాయ్‌లు అమ్మారు. మూడు పనుల ద్వారా 10వేల 500 రూపాయలు సంపాదించారు. ఈ డబ్బును టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఖర్చు చేస్తామని పువ్వాడ తెలిపారు.

...
Monday, April 17, 2017 - 14:49

ఢిల్లీ : సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. హైకోర్టు తీర్పులోని పేరా నంబర్‌ 15,16లను సమర్ధించింది. సింగేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. అర్హత ఉండి, మెడికల్‌గా అన్‌ఫిట్‌ అయితేనే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...

Monday, April 17, 2017 - 13:58

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అన్నారు. ధర్నాచౌక్‌ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు. ధర్నాచౌక్‌పై సానుకూల నిర్ణయం వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

 

 

Monday, April 17, 2017 - 12:59

విజయవాడ : 'మీ పాలన భేష్‌.. బీసీలు, ఎస్టీలు, ముస్లింమైనార్టీల రిజర్వేషన్ల కోటా పెంచడానికి ప్రయత్నిస్తున్న మీకు అభినందనలు' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అభినందన లేఖ రాశారు. తమ ముఖ్యమంత్రిలా చేయొద్దన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరినందుకే చంద్రబాబు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ముద్రగడ తన లేఖలో...

Monday, April 17, 2017 - 12:02

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ను ఎత్తివేయడంపై కాంగ్రెస్‌ పోరుబాటపట్టింది. ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నేతలు నిరసనకు దిగారు. ఆందోళన చేపట్టడానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వీ.హనుమంతరావు, దానం నాగేందర్‌ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరిండంలో టీఆర్ ఎస్ సర్కార్‌ విఫలం అవుతోందని...

Monday, April 17, 2017 - 11:56

ఆదిలాబాద్‌ : జిల్లాపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం రోజులుగా జిల్లాలో 45 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు జనాన్ని భయపెడుతున్నాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు మధ్యాహ్ననానికి అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండతో చిన్నపిల్లలు, వృద్ధులు ...

Monday, April 17, 2017 - 08:35

హైదరాబాద్ : డబ్బున్న యువకులే ఆమె టార్గెట్‌. చాటింగ్‌లతో మతి పోగోడుతుంది. ఆకట్టుకునే క్యాప్షన్లతో పరిచయం పెంచుకుంటుంది. వాట్సాప్‌ అంటూ గంటల పాటు తనతో మాట్లాడేలా చేస్తుంది. మరో అమ్మాయి పోటో చూపించి మాయ చేస్తుంది. ప్యార్‌ అంటూ  ఫేస్‌బుక్‌లో అడ్డంగా బుక్‌ చేస్తుంది. తన మాయలో పడ్డవారిని బురిడీ కొట్టిస్తుంది.   
లేడీ కిలాడీ లీలలు 
ఈ...

Monday, April 17, 2017 - 08:28

హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 57 శాతం... సెకండియర్‌ లో 66.4 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ ఎప్పట్లాగానే బాలికలే పైచేయి సాధించారు.  
2,75,273 మంది ఉత్తీర్ణత
తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.. హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంత్రి...

Monday, April 17, 2017 - 07:50

హైదరాబాద్ : స్వల్ప వివాదం చినికిచినికి గాలివానలా మారింది. హైదరాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాల్మీకినగర్, సూర్యనగర్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకినగర్ బస్తీలో రోడ్డుపై పెళ్లి విందు ఏర్పాటు చేయడంతో.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. వారించడంతో ఆగ్రహించిన యువకులు తమ బ్యాచ్‌తో వచ్చి వాల్మీకినగర్‌లో హంగామా చేశారు. రాళ్లు,...

Monday, April 17, 2017 - 07:40

హైదరాబాద్ : ముస్లింలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై అసెంబ్లీలో అధికార టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. అసెంబ్లీతో పాటు మండలిలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వ పలు విషయాల్లో సర్కారు తీరును ఎండగట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపుదల బిల్లును...

Monday, April 17, 2017 - 07:21

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు గుండెపోటు రావడంతో నెహ్రూ మృతి చెందారు. 22 జూన్ 1954 సం.లో నెహ్రూ జన్మించారు. దేవినేని నెహ్రూ అసలు పేరు రాజశేఖర్. దేవినేనికి అక అబ్బాయి, ఒక అమ్మాయి...

Sunday, April 16, 2017 - 21:42

హైదరాబాద్ : జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్‌ పెరగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మండలిలో జరిగిన చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో 90శాతం మంది ప్రజలు వెనకబడిన వర్గాల వారికి చెందిన వారని పేర్కొన్నారు. 50శాతం రిజర్వేషన్‌తో ఈ వర్గాలకు న్యాయం జరగదని చెప్పుకొచ్చారు. అందుకే రిజర్వేషన్‌ పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మతప్రాతిపదికన రిజర్వేషన్‌ ఇవ్వడం లేదని స్పష్టం...

Sunday, April 16, 2017 - 21:37

హైదరాబాద్ : ముస్లింలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ, టీడీపీ నిరసన చేపట్టాయి. అసెంబ్లీ లోపల, వెలుపల ఆందోళన కొనసాగించాయి. నల్లకండువాలు ధరించి అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన  బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌  మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. 
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ...

Sunday, April 16, 2017 - 21:01

హైదరాబాద్ : ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును  బీజేపీ పూర్తిగా వ్యతిరేకించగా, కాంగ్రెస్‌, సీపీఎంలు సమర్థిస్తూ.. కొన్ని సూచనలు చేశాయి.  ముస్లింతోపాటు బీసీలు, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలని సీపీఎం, టీడీపీ సభ్యుల సూచనలకు...

Sunday, April 16, 2017 - 17:42

హైదరాబాద్ : రిజర్వేషన్ల బిల్లుకు తాము వ్యతిరేకమని బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సభ నుంచి తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ బీజేపీ సభ్యులు గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుతో ప్రభుత్వం న్యాయవ్యవస్థను అవమాన పరిచిందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల...

Sunday, April 16, 2017 - 17:29

హైదరాబాద్ : ముస్లిం రిజర్వేషన్లు సాధించేందుకు అవసరమైతే కేంద్రం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ముందుకు రాకపోతే లోక్‌సభను స్తంభింపచేస్తామన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై జరిగిన చర్చకు కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. కొన్ని మతతత్వ పార్టీలు గుడ్డిగా ముస్లిం రిజర్వేషన్లను...

Sunday, April 16, 2017 - 17:21

హైదరాబాద్ : ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లీంలు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. ముస్లీంలు ఈ దేశ పౌరులు కారా అని నిలదీశారు. పేదరికం, దుర్బరమైన జీవితం అనుభవిస్తున్న కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పు లేదని స్ఫష్టం...

Sunday, April 16, 2017 - 17:20

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ముగిసింది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సభను నిరవధిక వాయిదా వేశారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ బిల్లుతోపాటు హెరిటేజ్, జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణలో గిరిజన, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లును సభ్యులెవ్వరూ వ్యతిరేకించకపోవడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సుమారు నాలుగు గంటలపాటు బిల్లుపై చర్చ...

Sunday, April 16, 2017 - 17:08

హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి 6 నెలలు ఎందుకని....అరగంట చాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వానికి బీసీల రిజర్వేషన్ పెంచాలనుకుంటే బీసీ కమిషన్ నుంచి సిఫారసు లేఖ తెప్పించుకోని రిజర్వేషన్లు పెంచవచ్చని తెలిపారు. బీసీలలోకి 14 ముస్లిం కులాలు పోతే మొత్తం 98 కలాలు అవుతాయని... బీసీల రిజర్వేషన్లు 52 శాతం పెంచాలని డిమాండ్ చేశారు.

Sunday, April 16, 2017 - 16:15

హైదరాబాద్ : బీసీలతోపాటు, ఎస్సీల రిజర్వేషన్లు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. బీసీ కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాత మళ్లీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఇందుకోసం బిల్లు తీసుకొస్తామని శాసనసభ దృష్టికి తెచ్చారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను కూడా ఒక శాతం పెంచేందుకు వీలుగా తర్వలో ఎస్సీ కమిషన్‌ను నియమిస్తామని కేసీఆర్‌ చెప్పారు.  

...
Sunday, April 16, 2017 - 16:07

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుకు సీపీఎం పూర్తి మద్దతు ప్రకటిచింది. ముస్లింలను బీసీ ఈ లో చేర్చడం సీపీఎం స్వాగతిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. మైనార్టీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారని...వారికి 12 శాతం రిజర్వేషన్లు రావడం శుభపరిణామమని తెలిపారు. అలాగే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడం మంచిదే.. కానీ...

Sunday, April 16, 2017 - 13:19

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర 'ఒక్క రోజు' అసెంబ్లీలో బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఒక్క రోజు సమావేశమైంది. ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం...

Sunday, April 16, 2017 - 13:02

హైదరాబాద్ : రాజ్యాంగ వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్ బిల్లును చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. గిరిజనుల రిజర్వేషన్లకు బీజేపీ మద్దతిస్తోందని, గిరిజన వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఒక్క రోజు సమావేశమైంది. ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల కోటాను పెంచుతూ తెలంగాణ...

Pages

Don't Miss