TG News

Tuesday, June 7, 2016 - 10:40

లాటరీ పేరుతో ఎస్సెమ్మెస్ లు..కోటి రూపాయల గిఫ్ట్ వచ్చిందంటూ మెయిల్స్..అడ్డంగా దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు...
హలో..మీకు కోటి రూపాయల లాటరీ తగిలిందంటూ ఎస్సెమ్మెస్..ఫోన్ కాల్స్ వచ్చాయా ? ఖరీదైన బహుమతి గెలుచుకున్నారంటూ పదే పదే ఫోన్స్ చేస్తూ విసిగిస్తున్నారా ? విదేశాల్లో ఉద్యోగం అంటూ ఊదరగొడుతున్నారా ? అయితే వీరి మాయలో ఏ మాత్రం పడకండి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిండా...

Tuesday, June 7, 2016 - 09:40

మెదక్‌ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న సదస్సులో పాల్గొనేందుకు ఏటిగడ్డ కృష్టాపూర్‌ కోదండరాం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్నది అభివృద్ధి కాదు.. విధ్వంసం అని ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. గత పాలకులు అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని విమర్శించారు. గత పాలకులు...

Tuesday, June 7, 2016 - 08:56

హైదరాబాద్ : అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు స్కూల్స్‌పై మరో పోరాటానికి సిద్దమయ్యారు పేరెంట్స్ జేఏసీ. ఫీజు నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేదాకా ఉద్యమం చేస్తామంటున్నారు ...ఈనెల 11 వ తేదీన మహధర్నాను చేపట్టి ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు సమాయత్తమవుతున్నారు.

పోరాటాన్ని ఉధృతం చేసిన...

Tuesday, June 7, 2016 - 08:48

హైదరాబాద్ : ముస్లింల పవిత్ర మాసం మొదలైంది. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు ఈరోజు ఉదయం సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. తొలిరోజు ఉదయం 4 గంటల 9 నిమిషాలకు ఉపవాసదీక్ష ప్రారంభించిన ముస్లింలు.. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు దీక్ష ముగించి.. ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. నెల రోజుల పాటు జరగనున్న ఉపవాస దీక్షలకు మసీదులన్నీ...

Tuesday, June 7, 2016 - 08:03

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సంఘానికి... తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య పోరు తీవ్రమైంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను ముప్పు తిప్పలు పెట్టిన గులాబి దళం.. ఇప్పుడు ఉద్యమ సంఘంపై విరుచుకు పడుతోంది. తెలంగాణ జేఏసీ ఎత్తేసిన దుకాణమంటూ టీఆర్ఎస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ టీ జాక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శలు...

Tuesday, June 7, 2016 - 07:40

హైదరాబాద్ : నిత్యం నిఘా పహారాలో ఉండే భాగ్య నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలే చైన్ స్నాచింగ్ లతో ఒక వైపు దడ పుట్టిస్తూ.. మరో వైపు ఏటీఎంలు, తాళం వేసిన ఇళ్లు, మూసివేసిన షాపులను సైతం వదలడం లేదు. తాజాగా సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ మొబైల్‌ దుకాణంలో భారీ చోరికి తెగబడ్డారు. రాత్రి సమయంలో దొంగలు చాకచక్యంగా ఒక బిస్తర్ అడ్డం పెట్టుకుని ఓ మొబైల్ షాపు...

Tuesday, June 7, 2016 - 07:38

హైదరాబాద్ : శాఖాపరమైన అభివృద్ది కార్యాక్రమాల విషయంలో అలసత్వం కూడదంటూ అధికారులకు కర్తవ్య బోధ చేస్తున్నారు మంత్రి తుమ్మల. పెండింగ్ రహదారులపై చర్చించేందుకు త్వరలో కేంద్ర మంత్రి గడ్కరిని తుమ్మల కలవనున్నారు. దీని కోసం రహదారుల డిపీఆర్‌ను సిద్దం చేయాలని అధికారులు సూచించారు.

అలసత్వంపై మంత్రి...

Tuesday, June 7, 2016 - 07:09

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. నేటి నుంచి రెండు రోజుల పాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల వివరాలు బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

శాస్త్రీయమైన అధ్యయనం చేయాలన్న సీఎం ...
...

Monday, June 6, 2016 - 22:05

హైదరాబాద్ : కృష్ణా రివర్‌ బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బోర్డు నిర్ణయాలపై జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రి ఉమాభారతిని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని కృష్ణాబోర్డుకు సూచించింది. కృష్ణా రివర్‌ బోర్డు తీరుపై..  తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కేంద్ర...

Monday, June 6, 2016 - 21:14

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కోదండరాం కుబుసం విడిచిన నాగుపాము వంటి వారని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ అన్నారు. ఈమేరకు సుమన్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు.  

 

Monday, June 6, 2016 - 21:09

హైదరాబాద్ : తెలంగాణలో పొలిటికల్‌ జేఏసీ ఉనికిలో లేదని జేఏసీ రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. చైర్మన్‌గా చెప్పుకుంటున్న కోదండరాం.. ఏ జేఏసీకి చైర్మనో.. అది ఎప్పుడు ఏర్పడిందో దాని లక్ష్యాలు ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని కోదండరాం విమర్శలు చేయడం సరికాదన్నారు. 

 

Monday, June 6, 2016 - 19:31

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..తాగు, సాగునీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈమేరకు ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణ నదుల నుంచి తెలంగాణ నీటి వాటాను సద్వినియోగం చేసుకునే క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేస్తే ఏపీ సీఎం అడ్డుకుంటున్నారని విమర్శించారు.

 

Monday, June 6, 2016 - 19:24

హైదరాబాద్ : బత్తిన సోదరులు ఇచ్చే చేపమందులో ఎలాంటి శాస్త్రీయత లేదని ప్రముఖ శాస్త్రవేత్త భార్గవ అన్నారు. ఎలాంటి శాస్త్రీయత లేని చేపమందు పంపిణీకి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అస్తమాను తగ్గించే అవశేషాలు ఏవీ చేపమందులో లేవని పరీక్షల్లో తేలిందన్నారు. చేపమందు పంపిణీకి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం వల్ల లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేయడమేనని ఆయన అన్నారు...

Monday, June 6, 2016 - 19:20

హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్రంలో ఎలాంటి చర్చా జరగడం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొందని.. తొందరపడి నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరామని...

Monday, June 6, 2016 - 18:18

హైదరాబాద్ : సీఎల్పీనేత జానారెడ్డి పనికిరారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వందసార్లు తిట్టారని, సర్వే సత్యనారాయణ గాంధీభవన్‌లోనే జానారెడ్డిని తీవ్రంగా విమర్శించారని, వారందరికీ లేని షోకాజ్ నోటీసులు తనకు ఎలా ఇస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పనితీరుపై తాను చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో...

Monday, June 6, 2016 - 17:14

హైదరాబాద్ : నిఖిల్ రెడ్డి ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. సర్జరీ అనవసరంగా చేశారని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఇవాళ నిఖిల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న కౌన్సిల్ అధికారులు... ఇందుకు బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Monday, June 6, 2016 - 14:47

హైదరాబాద్ : వాతావరణం చల్లడింది... బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరోవైపు.. గతి తప్పుతున్న రుతుపవానాలను సరిగ్గా అంచనా వేసే పరిజ్ఞానం... ఇక మన శాస్త్రవేత్తలకు అందుబాటులోకి రానుంది. దీనికోసం కేంద్రం ఓ విమానాన్ని కొనుగోలు చేస్తోంది. మే నెల ఎండమంటలను మబ్బుతెరలు అడ్డుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా...

Monday, June 6, 2016 - 14:34

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ కోర్టు కాంప్లెక్స్ ఎదుట తెలంగాణ న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయాధికారుల కేటాయింపు నిలిపివేయాలని న్యాయవాదులు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

Monday, June 6, 2016 - 10:55

వరంగల్‌ : డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఏటీఎం సెంటర్లు వెలిశాయి.. ఇప్పుడు మంచినీటి కోసం అవస్థలు పడకుండా.. ఏటీడబ్ల్యూ సెంటర్లు విస్తరిస్తున్నాయి. ట్యాప్‌ తిప్పితే కాదు...కార్డు పెడితే నీరు వస్తోంది... అవును.. వరంగల్‌ జిల్లాలో ఇప్పుడు ఏనీ టైం వాటర్‌ సదుపాయం ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది.

పాపులర్‌ అవుతున్న ఏటీడబ్ల్యూ...

Monday, June 6, 2016 - 10:44

నిజామాబాద్ : అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది నిజామాబాద్ జనరల్‌ ఆసుపత్రి తీరు. రెండు శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం ఇక్కడ పనిచేసే సిబ్బందికి శాపంగా మారింది.. దీంతో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి విధులు నిర్వహిస్తున్నారు. తమది పైచేయి అంటే తమదే పై చేయి అంటూ ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. దీంతో ఆసుపత్రికి వైద్యం...

Monday, June 6, 2016 - 10:35

ఆడపిల్ల అనగానే పురిట్లోనే చంపే రోజులు పోవాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదేంటీ ? ఇలా అంటున్నారేంటీ ? అనుకుంటున్నారా ? కేంద్ర ప్రభుత్వం 'బేటీ బచావో.. బేటీ పడావో' పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం మరింతగా జనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశ్యంతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే స్లిప్స్ పై యాడ్ ను తెలుగులో అనువదిస్తూ..ప్రచురించింది. అది ఎలా...

Monday, June 6, 2016 - 10:34

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో ప్రాజెక్టు నిర్మాణం రోజురోజుకీ వివాదంగా మారుతోంది. ఈ నిర్మాణం నిర్వాశితుల ప్రాణాల కూడా హరిస్తోంది. యూనిటీకి మారుపేరుగా గిరిజనుల సంబంధాలను ఈ ప్రాజెక్టు దెబ్బతీస్తోంది. మల్లన్న ప్రాజెక్ట్ మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేయనుందా? అంటే నిజమనే అనుకోవాల్సి వస్తోంది. సోమవారం నాడు మల్లన్న సాగర్ ముంపు...

Monday, June 6, 2016 - 08:42

హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులకు సొంత ఇంటి కల త్వరలో నేరవేరనుందన్నారు. కార్మిక శాఖ తరపున జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు హోం మంత్రి నాయిని. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ...

Monday, June 6, 2016 - 07:54

హైదరాబాద్ : ఈ ఖరీఫ్ సీజన్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు నీరందించాలనే లక్ష్యంతో హరీష్‌రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకోసం నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. దీని కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగిస్తున్నారు. వాట్స్ ఏప్ గ్రూపుల ద్వారా క్షేత్రస్ధాయి పనితీరును...

Monday, June 6, 2016 - 07:41

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ఇప్పటినుంచే పావులు కదుపుతోందా... ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్‌ పేరుతో వివిధ పార్టీ నేతలను చేర్చుకుంటోందా..రాష్ట్రవ్యాప్తంగా పూర్తి పట్టు సాధించడం కోసం గులాబీ దళపతి ప్రణాళికలు రచిస్తున్నాడా... అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్ ముందుచూపు...

Monday, June 6, 2016 - 07:29

హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. దళిత ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తమ సామాజిక వర్గానికి ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత.. గతాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. 

ఐఏఎస్‌ఐపీఎస్‌లు తమ వర్గాన్ని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు.....

Sunday, June 5, 2016 - 21:27

హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాకు నీరిస్తామనడం అవివేక చర్యని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహబూబ్‌నగర్‌లో అన్నారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న పలు ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటూ కేసిఆర్ చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని తమ్మినేని...

Pages

Don't Miss