TG News

Monday, July 6, 2015 - 06:34

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఊపందుకుంటోంది. టీడీపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించేందుకు సిద్దమయిన ఏసిబి అధికారులు... ఆయన ఇచ్చే సమాచారంతో మరికొందరికి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఈ జాబితాలో 10 మంది అధికార పార్టీ ఎమ్యెల్యేలు ఉన్నట్లు సమాచారం. మొత్తం 25 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ...

Monday, July 6, 2015 - 06:15

హైదరాబాద్: తమ సమ్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించారు. కాని వీరి సమస్యలు పట్టించుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైంది. అయితే గతనెల 25 నుంచే సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అయితే తమకు కొంత సమయం కావాలని సర్కార్‌ కోరింది. దీంతో సమ్మెను 10 రోజుల పాటు...

Monday, July 6, 2015 - 06:12

హైదరాబాద్:హరితహారం పథకంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, సదాశివనగర్, కామారెడ్డి, రామాయంపేట్‌లలో కేసీఆర్ పర్యటన ఖరారైంది. జిల్లాలోని మిషన్‌కాకతీయ పథకాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం ఈజిల్లాలో పర్యటించడం రెండోసారి. సీఎం పర్యటన కోసం గులాబీ శ్రేణులు, అధికారులు అన్ని ఏర్పాట్లు...

Sunday, July 5, 2015 - 21:28

హైదరాబాద్: తెలంగాణలో ఇఫ్తార్ విందును టీ.ప్రభుత్వం వాయిదా వేసింది. 8వ తేదీకి బదులు 12 న అన్ని జిల్లాలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. గ్రేటర్ పరిధిలో 100 చోట్ల, ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ లో 195 మసీదుల్లో, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 95 వేల మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు...

Sunday, July 5, 2015 - 21:17

వాషింగ్టన్: అమెరికాలో తానా 20వ మహాసభలు అట్టహాసంగా సాగుతున్నాయి. డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జరుగుతున్న తానా మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. తెలుగు సినిమా హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు అదరగొట్టె స్టెప్పులతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

 

Sunday, July 5, 2015 - 21:01

హైదరాబాద్: బొల్లారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ టీడీపీ లీడర్లు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రణబ్‌ను కలిసిన వారిలో ఎల్‌.రమణ, రావుల, మల్లారెడ్డి, పెద్దిరెడ్డి ఉన్నారు. 

Sunday, July 5, 2015 - 18:28

వరంగల్: విద్యుత్‌ హై ఓల్టేజీ రెండువందల ఇళ్లల్లో భారీ నష్టం మిగిల్చింది. వరంగల్‌ జిల్లా హన్మకొండ రెడ్డి కాలనీలోని రెండువందల ఇళ్లల్లో విద్యుత్‌ హై ఓల్టేజీ కారణంగా కలర్‌ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్స్‌ లాంటి ఎలక్ట్రానిక్ గృహోపకరాణాలు షార్ట్ సర్క్యూట్‌ అయ్యాయి. గత నెల రోజులుగా సమస్య తలెత్తినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని... ఫలితంగా లక్షలాది రూపాయల...

Sunday, July 5, 2015 - 18:25

నల్లగొండ: జిల్లాలో దారుణం జరిగింది. నేరేడుచర్ల మండలం శూన్యపహాడ్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శూన్యపహాడ్‌లో రామాచారి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఉదయం పూట రామాచారి ఇంటికి వచ్చిన దుండగులు తలుపులు బాదారు. తలుపులు ఎంతకూ తీయకపోవడంతో కిటికీలు ద్వంసం చేసి ఇంట్లోకి చొరబడి రామాచారిని గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది....

Sunday, July 5, 2015 - 18:20

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని కమాన్ బజార్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గార్లపాటి మెటల్ స్టోర్స్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టోర్ పరిసరాల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. ఎక్కువ ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో... మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులోని వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేస్తున్నాయి. సుమారు కోటిమేర ఆస్తినష్టం...

Sunday, July 5, 2015 - 18:12

హైదరాబాద్: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన గోదాములపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 64 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాచారం మానిక్‌ చంద్‌ వద్ద ఓ గోదాములో ఎల్‌ బీ నగర్‌, సరూర్ నగర్‌లకు చెందిన పలువురు రేషన్‌ డీలర్లు బియ్యాన్ని తరలించి.. అక్కడి నుంచి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకొని దాడి చేసినట్లు ఎస్‌ఓటీ...

Sunday, July 5, 2015 - 18:06

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో గోపాలపురం పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. బైక్‌ రేసింగ్‌ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అతివేగంతో బైకులు నడుపుతూ...వాకర్లను ఇబ్బందికి గురిచేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజూ ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో వాకర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు వారం పాటు స్పెషల్ డ్రైవ్‌ను...

Sunday, July 5, 2015 - 18:03

హైదరాబాద్: వాయువేగంతో దూసుకుపోతున్న బైకు రేసర్లకు హైదరాబాద్‌ శివారులోని నార్సింగి పోలీసులు కళ్లెం వేశారు. ఓల్‌ సిటీకి చెందిన పలువురు విద్యార్థులు గండిపేట ప్రాంతంలో బైక్ రేసింగ్‌ నిర్వహించారు. గమనించిన స్థానిక పోలీసులు 31 మందిని అదుపులోకి తీసుకుని 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 20 మంది మైనర్లు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి...

Sunday, July 5, 2015 - 18:00

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో మలుపు తిరగనుంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసుగా పరిగణించే అంశాన్ని ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌ సన్‌తో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ వల వేసినట్లు సమాచారం. రేవంత్ బెయిల్ పిటీషన్‌లో ఏజీ ప్రత్యేక వాదనలు వినిపించనుంది. ఏజీ వాదనలకు బలం చేకూరే విధంగా ఆధారాల సేకరణలో ఏసీబీ బిజీగా ఉంది. ఏసీబీ.. 10 మంది...

Sunday, July 5, 2015 - 17:47

హైదరాబాద్: ఓయూ పరిశోధక విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఓయూ పరిశోధక విద్యార్థులు చేపట్టిన నిరవదిక దీక్ష 15వ రోజుకు చేరుకుంది. మెస్‌ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల దీక్షకు నారాయణ సంఘీభావం ప్రకటించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ...

Sunday, July 5, 2015 - 17:39

హైదరాబాద్: సబ్‌ప్లాన్‌ సాధనకు పూర్తి మద్దతుతో పాటు సీపీఎం ఆధ్వర్యంలో పోరాడుతామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం అన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటే ఏ ఒక్కరికో జరిగే న్యాయం కాదని, కుల ప్రాతిపదికన వివక్ష కొనసాగితే డిమాండ్‌...

Sunday, July 5, 2015 - 17:09

కరీంనగర్: హరితహారంతో తెలంగాణలోని అన్ని జిల్లాలు పచ్చగా మారతాయని సీఎం కేసీఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ చెట్లను పెంచే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

Sunday, July 5, 2015 - 16:15

హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం 14 వేల 170 రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే పర్మినెంట్‌ చేయాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 40 వేల కార్మికులు...

Sunday, July 5, 2015 - 14:55

హైదరాబాద్: తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తోందని విమర్శించారు. మేనిఫెస్టోలోని హామీలను అమలుపర్చాలని డిమాండ్ చేశారు. ఐతే కొందరు కాంగ్రెస్ నాయకులపై ఆయన ఆరోపణలు చేశారు. తనను పొమ్మన లేక పొగబెడుతున్నారని విమర్శించారు.

 

Sunday, July 5, 2015 - 13:09

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఈసారి అద్భుతం ఆవిష్కృతమైంది. సివిల్స్ టాపర్స్ గా ఢిల్లీకి చెందిన వికలాంగురాలు ఇరా సింఘాల్ నిలిచారు. సివిల్స్ టాపర్‌ గా నిలవడం చాలా ఆనందంగా ఉందన్న ఇరా సింఘాల్.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉన్నారు. కూతురు టాప్ ర్యాంక్ సాధించిందని తెలిసిన ఇరా తల్లిదండ్రులు పట్టరాని సంతోషంలో...

Sunday, July 5, 2015 - 12:28

నల్గొండ : భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ యాదాద్రికి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ప్రణబ్ కు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సన్నిధికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రణబ్ కు అర్చకులు...

Sunday, July 5, 2015 - 06:35

హైదరాబాద్ : వారంతా గతంలో పీసీసీ ఛీఫ్ లుగా ఓవెలుగు వెలిగారు. కేకే , బొత్సా, డిఎస్... పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయారు. మరి ఇంకా వారి గుర్తులు మనకెందుకు. పదవులు ఆనుభవించి.. పార్టీకి ద్రోహం చేసిన వారి ఆనవాళ్లు కూడా గాంధీ భవన్ లో ఉండటానికి వీళ్లేదు..అంటూ హన్మంతన్న శివాలెత్తారు. ఆముగ్గురి ఫోటోలను తొలగించేందుకు పీసీసీ పెద్దలు తటపటాయించినా..డొంట్ కేర్ అంటూ.....

Sunday, July 5, 2015 - 06:31

హైదరాబాద్ : ఐఎస్‌ఐఎస్‌ ముప్పు పొంచి ఉందా..? ముష్కర మూకలు దాడికి తెగబడనున్నాయా..? కిరాతకుల టార్గెట్‌ ఏమిటి..? గతంలో ఇంటలిజెన్స్‌ హెచ్చరికలు నిజం కానున్నాయా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది.. కరడుగట్టిన ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనడం కలకలం రేపుతోంది.
చర్లపల్లి జైలు.. 135 ఎకరాల ఓపెన్‌ఎయిర్‌ .....

Sunday, July 5, 2015 - 06:17

ఆదిలాబాద్ : 'హరితహారం'లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలతో బిజీ బిజీగా సాగుతోంది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ నుంచి బయలుదేరి ఆయన ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం దండేపల్లి మండలం గూడెంలో 3 టీఎంసీల సామర్థ్యం గల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సభ అనంతరం మొక్కలు నాటి హరితహారంలో...

Sunday, July 5, 2015 - 06:12

నల్గొండ : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని నేడు సందర్శించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ రాకకోసం అధికార యంత్రాంగం, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేసింది. యాదగిరిగుట్టను తొలిసారిగా సందర్శించనున్న రాష్ట్రపతి దాదాపు గంటపాటు లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గడపనున్నారు.
ప్రత్యేక కాన్వాయ్‌లో రాష్ట్రపతి.....

Saturday, July 4, 2015 - 21:42

హైదరాబాద్: సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్‌ రావటం పట్ల ఇరా సింఘాల్ ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కావాలన్న కల నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. ఇందుకోసం నాలుగేళ్లుగా తీరిక లేకుండా చదివినట్లు స్పష్టం చేశారు. ఈ విజయం సాధించటంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ... పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు వెలువడగానే... హైదరాబాద్‌లో తన... బ్యాచ్‌మేట్లతో...

Saturday, July 4, 2015 - 21:34

వరంగల్‌: జిల్లాలోని కడెవెండిలో దొడ్డి కొమురయ్య వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి 10 వామపక్షపార్టీల నేతలు హాజరయ్యారు. సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకటర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలోని అమర వీరుల స్థూపానికి నేతలు నివాళ్లు అర్పించారు. అక్కడి...

Saturday, July 4, 2015 - 21:33

నల్లగొండ: జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం... గ్రామపంచాయతీ ఉప ఎన్నిక ఫలితం విడులైంది. ఈ ఎన్నికలో సీపీఎం అభ్యర్థి జూలకంటి కొండారెడ్డి విజయం సాధించారు. ఇంతకుముందు సర్పంచ్‌గా ఉన్న పురంధర్‌రెడ్డి....హత్యకు గురికావటంతో ఉప ఎన్నికను నిర్వహించారు. గ్రామంలో మళ్లీ సీపీఎం అభర్థే గెలవటంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, రంగులు చల్లుకుంటూ తమ...

Pages

Don't Miss