TG News

Friday, July 10, 2015 - 15:54

మహబూబ్ నగర్: సీఎం కేసీఆర్ పై టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు బంద్ వెనుక ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన అనంతరం కొండంగల్ లో రేవంత్‌రెడ్డి తొలిసారి మీడియాతో మాట్లాడారు. పాలమూరు బంద్ ను ప్రభుత్వమే ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పాలమూరు బంద్ వెనుక ప్రభుత్వ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు....

Friday, July 10, 2015 - 13:00

హైదరాబాద్:గవర్నర్ ఇచ్చే ఇప్తార్ విందు ప్రాధాన్యం సంతరించుకుంటోంది..? ఈ కార్యక్రమానికి రానున్న ఇద్దరు చంద్రులపైనే అందరి చూపులు ఉండనున్నాయి.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు పలకరించుకుంటారా..? లేదంటే అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తారా..?ఇదే అంశం ఆసక్తికర మారుతోంది...                                         
ఇద్దరు సీఎంల విమర్శల పర్వం.......

Friday, July 10, 2015 - 11:50

హైదరాబాద్:తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. సీఐటియు ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు.కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, బోనస్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత చుక్కారాములు, రాజారావు, సాయిబాబు పాల్గొన్నారు.

Friday, July 10, 2015 - 11:40

హైదరాబాద్:మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు సమ్మెను విరమించేది లేదంటున్నారు. మరో వైపు సమ్మెతో హైదరాబాద్‌ నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు.

Friday, July 10, 2015 - 10:04

హైదరాబాద్: ఎల్ బినగర్లో హంగామా చేశారు బాహుబలి అభిమానులు.. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారంటూ విజయలక్ష్మి థియేటర్ అద్దాలు ధ్వసం చేశారు.. గంటలకొద్దీ క్యూ కట్టినా టికెట్లు ఇవ్వడంలేదని ఆరోపించారు.. అలాగే టికెట్ క్యూలదగ్గరకోపంతో థియేటర్‌పై రాళ్లు విసిరారు.. వెంటనే పోలీసులు అభిమానులపై స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు.. అటు టికెట్ క్యూలదగ్గర తోపులాట జరిగింది..

Friday, July 10, 2015 - 07:11

హైదరాబాద్:గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినేట్‌ భేటీ కానుంది. ఈ నెల 11న జరగనున్న కేబినేట్‌ భేటీలో వయోపరిమితి పెంపుపై నిర్ణయం, ఉద్యోగ ప్రకటనల జారీపైనా చర్చించనున్నారు. దీంతో పాటు మంత్రుల పనితీరుపైనా... సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపే అవకాశం ఉంది.                                 
తెలంగాణ పుష్కరాల...

Thursday, July 9, 2015 - 21:30

హైదరాబాద్ : బాహుబలి..బాహుబలి..బాహుబలి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా వినిపిస్తున్న జక్కన్న జపం ఇది. సినీ ప్రేక్షకులు కళ్లలో లక్షల ఒత్తులేసుకుని మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వేల కోట్ల టర్నోవర్‌ నడిపిస్తున్న సినీ పరిశ్రమ జరగబోయే అద్భుతాన్ని చూడటానికి ఉత్కంఠతో చూస్తున్నారు. వెండితెరే ఆశ్చర్యపోయేలా బాహుబలి చిత్రం సెల్యూలాయిడ్‌ పైకి...

Thursday, July 9, 2015 - 21:23

హైదరాబాద్ : మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మూడోసారీ విఫలమయ్యాయి. సమస్యను వాయిదా వేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో పరిష్కారం కావటం లేదు. ఇప్పటికే అనేకసార్లు వాగ్దానభంగం జరగటంతో ఈసారి పక్కాగా సెటిల్‌ చేస్తేనే సమ్మె విరమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు గల్లిగల్లికీ తిరిగిన ముఖ్యమంత్రి, మంత్రులు.. కోట్లకు కోట్లు...

Thursday, July 9, 2015 - 21:20

హైదరాబాద్ : ఏపీలో యాక్షన్‌కు తెలంగాణలో రియాక్షన్‌ ఎదురవుతోంది. ఇటు తిరిగి అటు తిరిగి తెలంగాణ తమ్ముళ్లను ఇరకాటంలో పడేస్తోంది. చంద్రబాబు వైఖరి ఏం సమాధానం చెబుతారోనని నిలదీసేలా చేస్తోంది. తాజాగా పాలమూరు వ్యవహారం రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాల మధ్య వైరాన్ని మరింత పెంచుతోంది.
మహబూబ్‌నగర్‌ జిల్లా బంద్‌ పిలుపు..
పాలమూరు ఎత్తిపోతల...

Thursday, July 9, 2015 - 21:16

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మొదటి రోజుల కస్టడీ ముగిసింది. ఉదయం చర్లపల్లి నుండి తీసుకొచ్చిన అధికారులు న్యాయవాది సమక్షంలో విచారించారు. ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఆ వర్షంలో సండ్ర మునిగారో తేలారో ఏసీబీ నివేదిక వచ్చాకే తెలుస్తోంది. ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సెబాస్టియన్‌ ఇది తప్పుడు కేసంటూ...

Thursday, July 9, 2015 - 20:29

హైదరాబాద్ : ప్రముఖ పిల్లల ఆసుపత్రి 'రెయిన్ బో' నాలుగో శాఖ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ప్రారంభమైంది. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు ఈ ఆసుపత్రిని గురువారం ప్రారంభించారు. చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రెయిన్ బో గొప్ప పేరు తెచ్చుకుందని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి కితాబిచ్చారు. హైదరాబాద్ ను మెడికల్ హబ్ గా మార్చడానికి తెలంగాణ...

Thursday, July 9, 2015 - 20:10

హైదరాబాద్ : ఆ పథకాన్ని జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అప్పుడు వీధి వీధిలో బ్యాండ్‌బజాయించి విస్తృత ప్రచారం చేసింది. కాని అది ఆ కొత్త ఊపులోనేనని ఇప్పుడు తేటతెల్లమైంది. అప్పుడు ఎంత అట్టహసంగా చేపట్టిందో ఇప్పుడు అంత నీరుగారుస్తోంది. కాదు కాదు నీరు గార్చింది కూడా. ఆ పథకంపై ఆధారపడ్డ వేలాది మంది ఇప్పుడు ఆకలిమంటతో ఆవేదన చెందుతున్నారు. భోజనామృత్. సరిగ్గా...

Thursday, July 9, 2015 - 20:09

హైదరాబాద్ : వచ్చే నెల నుంచి హెల్మెట్ లేనిదే రోడ్డెక్కారా ?అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడబోతోంది. పోలీసుల నుండి తప్పించుకుంటాం అంటారా ? అయితే సరే..మీకు ఫైన్ పడనుంది. పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నా ఇంటికి ఫైన్ నోటీసు వస్తుంది. గతంలో కాకుండా ఈసారి కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. వచ్చే నెల ఒకటినుంచి ఈ రూల్‌ను కఠినంగా పాటించేలా చర్యలు...

Thursday, July 9, 2015 - 20:07

హైదరాబాద్ : మీకు పుస్తకాలు చదవడమంటే ఇష్టమా ? ఏయే పుస్తకాలు కావాలో ఎంపిక చేసుకోండి. ధర గురించి బెంగే వద్దు. అవి ఎంత తూగితే అంతకే డబ్బు చెల్లించండంటూ పుస్తక విక్రయ కేంద్రాలు అందరికీ ఆహ్వనం పలుకుతున్నాయి. వినడానికి కొత్తగా ఉన్నా ... ప్రస్తుతం భాగ్యనగరంలో హల్ చల్ చేస్తోన్న నయా ధోరణి ఇది. ట్రెండ్ మారడంతో పుస్తక దుకాణాల్లో కొనుగోళ్లు మందగించాయి. ప్రముఖ బుక్...

Thursday, July 9, 2015 - 17:53

హైదరాబాద్ : వాటర్ బోర్డులో సమ్మె కొనసాగుతోంది. పీఆర్సీ అమలు కోసం మూడు రోజులుగా హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సివరేజి కామ్ గార్ యూనియన్ సమ్మె చేస్తోంది. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మె ఉధృత స్థాయికి చేరింది. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుండగా మరో పక్క వాటర్ బోర్డు కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. 
తమ సమస్యలు...

Thursday, July 9, 2015 - 17:28

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టును అడ్డుకోవడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే పాలమూరు ప్రజల...

Thursday, July 9, 2015 - 16:29

మహబూబ్ నగర్ : పాలమూరు ప్రాజెక్టుకు ఎవరూ అడ్డు వచ్చినా పనులు ఆగవని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలనే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. అందుకనే మహబూబ్ నగర్ జిల్లాకు బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ను అడ్డుకుంటే ఊరుకొనేది...

Thursday, July 9, 2015 - 16:22

హైదరాబాద్ : నగరంలో పేరుకపోయిన చెత్తను ఏరివేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమీషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఔట్‌సోర్స్ కార్మికుల జీతాల పెంపు.. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు వెంటనే మోక్షం కలించాలన్న మొత్తం 16 డిమాండ్లతో ఎనిమిది కార్మికసంఘాలతో ఏర్పడిన ఐక్యకార్యచరణ ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగింది. ఈ నేపథ్యంలో కమిషనర్...

Thursday, July 9, 2015 - 16:14

హైదరాబాద్ : నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్ చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పి ప్రస్తుతం చెత్త హైదరాబాద్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఔట్‌సోర్స్ కార్మికుల జీతాల పెంపు.. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు వెంటనే మోక్షం కలించాలన్న మొత్తం 16 డిమాండ్లతో ఎనిమిది కార్మికసంఘాలతో ఏర్పడిన ఐక్యకార్యచరణ ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగింది. దీనితో నగరంలో ఎక్కడ చెత్త...

Thursday, July 9, 2015 - 12:24

హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరుకుంది. హైదరాబాద్‌లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. రంజాన్ మాసం కారణంగా చార్మినార్ పరిసరాల్లో చెత్తాచెదారం పెద్ద మొత్తంలో పేరుకుపోయింది. దీంతో చేసేదేమి లేక... పోలీసులే చీపుర్లు పట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌లు అంతా కలిసి రోడ్లను శుభ్రం చేస్తున్నారు. 

Thursday, July 9, 2015 - 12:00

హైదరాబాద్: ఓటుకు నోటుకు కేసులో... టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Thursday, July 9, 2015 - 11:58

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీమాంధ్ర నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా జనసేనాని మాటల తూటాలు పేల్చారు. ఎపి విభజన చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభలో ఎంతమంది ఉన్నారని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. తనకున్న సమాచారం మేరకు ఐదుమందే ఉన్నారని తేల్చి చెప్పాడు.

Thursday, July 9, 2015 - 11:42

హైదరాబాద్: మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేశారు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదని అంటున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో నగరంలో చెత్త చెదారం పేరుకుపోయింది.

 

Thursday, July 9, 2015 - 11:21

హైదరాబాద్: సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయాన్నే చర్లపల్లి జైలుకెళ్లిన అధికారులు సండ్రను తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండ్రోజుల పాటు విచారించనున్నారు.

 

Thursday, July 9, 2015 - 08:11

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలం కావడంతో.. కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వం సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తుందో.. ఎలా పరిష్కరిస్తుందో చెప్పడం లేదని...

Thursday, July 9, 2015 - 07:52

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు.. తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. పవన్‌కు టీడీపీ నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎంపీలు స్పెషల్‌ స్టేటస్‌ మరిచి వ్యాపారాలు చేసుకుంటున్నారన్న ఆయన మరోసారి ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. తనను తిట్టినంత మాత్రాన ఏపీకి ప్రత్యేక హోదా రాదని చురకలంటించారు. కేసులు పెడితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమంటూ...

Thursday, July 9, 2015 - 07:41

హైదరాబాద్: పాలనకు కేంద్ర బిందువు సచివాలయం. సీఎం, మంత్రులతో ఎప్పుడూ కళకళలాడాల్సిన సెక్రటేరియట్ వెల వెలబోతోంది. సీఎం కేసీఆర్‌ మొదటి నుంచి కూడా ఈ సచివాలయాన్ని ఇష్ట పడటం లేదు. వాస్తు దోషం ఉందని...బేగంపేట క్యాంప్‌ నివాసం నుంచే పాలన సాగిస్తున్నారు. అప్పట్లో సీఎం అడపా దడపా సచివాలయానికి వచ్చే వారు. కానీ ఈ మధ్య పూర్తిగా రావడం మానేసారు. మిషన్ కాకతీయ, స్వచ్ఛ హైదరాబాద్...

Pages

Don't Miss