TG News

Sunday, July 5, 2015 - 13:09

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఈసారి అద్భుతం ఆవిష్కృతమైంది. సివిల్స్ టాపర్స్ గా ఢిల్లీకి చెందిన వికలాంగురాలు ఇరా సింఘాల్ నిలిచారు. సివిల్స్ టాపర్‌ గా నిలవడం చాలా ఆనందంగా ఉందన్న ఇరా సింఘాల్.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉన్నారు. కూతురు టాప్ ర్యాంక్ సాధించిందని తెలిసిన ఇరా తల్లిదండ్రులు పట్టరాని సంతోషంలో...

Sunday, July 5, 2015 - 12:28

నల్గొండ : భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ యాదాద్రికి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ప్రణబ్ కు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సన్నిధికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రణబ్ కు అర్చకులు...

Sunday, July 5, 2015 - 06:35

హైదరాబాద్ : వారంతా గతంలో పీసీసీ ఛీఫ్ లుగా ఓవెలుగు వెలిగారు. కేకే , బొత్సా, డిఎస్... పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయారు. మరి ఇంకా వారి గుర్తులు మనకెందుకు. పదవులు ఆనుభవించి.. పార్టీకి ద్రోహం చేసిన వారి ఆనవాళ్లు కూడా గాంధీ భవన్ లో ఉండటానికి వీళ్లేదు..అంటూ హన్మంతన్న శివాలెత్తారు. ఆముగ్గురి ఫోటోలను తొలగించేందుకు పీసీసీ పెద్దలు తటపటాయించినా..డొంట్ కేర్ అంటూ.....

Sunday, July 5, 2015 - 06:31

హైదరాబాద్ : ఐఎస్‌ఐఎస్‌ ముప్పు పొంచి ఉందా..? ముష్కర మూకలు దాడికి తెగబడనున్నాయా..? కిరాతకుల టార్గెట్‌ ఏమిటి..? గతంలో ఇంటలిజెన్స్‌ హెచ్చరికలు నిజం కానున్నాయా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది.. కరడుగట్టిన ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనడం కలకలం రేపుతోంది.
చర్లపల్లి జైలు.. 135 ఎకరాల ఓపెన్‌ఎయిర్‌ .....

Sunday, July 5, 2015 - 06:17

ఆదిలాబాద్ : 'హరితహారం'లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలతో బిజీ బిజీగా సాగుతోంది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ నుంచి బయలుదేరి ఆయన ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం దండేపల్లి మండలం గూడెంలో 3 టీఎంసీల సామర్థ్యం గల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సభ అనంతరం మొక్కలు నాటి హరితహారంలో...

Sunday, July 5, 2015 - 06:12

నల్గొండ : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని నేడు సందర్శించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ రాకకోసం అధికార యంత్రాంగం, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేసింది. యాదగిరిగుట్టను తొలిసారిగా సందర్శించనున్న రాష్ట్రపతి దాదాపు గంటపాటు లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గడపనున్నారు.
ప్రత్యేక కాన్వాయ్‌లో రాష్ట్రపతి.....

Saturday, July 4, 2015 - 21:42

హైదరాబాద్: సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్‌ రావటం పట్ల ఇరా సింఘాల్ ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కావాలన్న కల నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. ఇందుకోసం నాలుగేళ్లుగా తీరిక లేకుండా చదివినట్లు స్పష్టం చేశారు. ఈ విజయం సాధించటంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ... పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు వెలువడగానే... హైదరాబాద్‌లో తన... బ్యాచ్‌మేట్లతో...

Saturday, July 4, 2015 - 21:34

వరంగల్‌: జిల్లాలోని కడెవెండిలో దొడ్డి కొమురయ్య వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి 10 వామపక్షపార్టీల నేతలు హాజరయ్యారు. సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకటర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలోని అమర వీరుల స్థూపానికి నేతలు నివాళ్లు అర్పించారు. అక్కడి...

Saturday, July 4, 2015 - 21:33

నల్లగొండ: జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం... గ్రామపంచాయతీ ఉప ఎన్నిక ఫలితం విడులైంది. ఈ ఎన్నికలో సీపీఎం అభ్యర్థి జూలకంటి కొండారెడ్డి విజయం సాధించారు. ఇంతకుముందు సర్పంచ్‌గా ఉన్న పురంధర్‌రెడ్డి....హత్యకు గురికావటంతో ఉప ఎన్నికను నిర్వహించారు. గ్రామంలో మళ్లీ సీపీఎం అభర్థే గెలవటంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, రంగులు చల్లుకుంటూ తమ...

Saturday, July 4, 2015 - 19:09

నల్గొండ: బీబీనగర్‌లో వేస్ట్ నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛ కమిటీ బృందం ఈ ప్లాంట్‌ను సందర్శించారు. 11 వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌.. ఆగస్ట్‌ మొదటివారంలో జనరేషన్‌ ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. 11 వందల టన్నుల చెత్తను దీనికి ఉపయోగిస్తారని వారంటున్నారు. 27 ఎకరాల్లో ప్లాంటు నిర్మాణం చేపడుతున్నారు....

Saturday, July 4, 2015 - 18:48

హైదరాబాద్: వీర తెలంగాణ రైతాంగ విప్లవ జ్వాలకు పురుడు పోశాడు. నాటి రాజాకార్ల దౌర్జాన్యాలను తన ధీరత్వంతో ఎదురొడ్డి నిలిచాడు. దేశ విముక్తి కోసం, నైజాం నవాబుల దౌర్జన్యాలకు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాడు. అలనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రాణాలర్పించారు. ఆయనే దొడ్డి కొమురయ్య. ఇవాళ ఆయన 69వ వర్ధంతి సందర్భంగా అనాటి పోరాట జ్ఞాపకాల్ని 10 టీవీ గుర్తు...

Saturday, July 4, 2015 - 16:54

హైదరాబాద్: గవర్నర్‌ బాధ్యతల నుంచి నరసింహన్ ను వెంటనే తప్పించాలని టీకాంగ్రెస్ నేత మర్రిశశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన కేంద్రహోంమంత్రికి లేఖ రాశారు. లేఖలో గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై మర్రిశశిధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించటంలో గవర్నర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మంత్రిగా కొనసాగుతున్నారని...

Saturday, July 4, 2015 - 16:46

హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నుంచి పిలుపొచ్చింది. అధికారులు రెండో సారి సండ్రకు నోటీసులు పంపారు. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు విచారణకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన లేకపోవడంతో.. బయట తలుపుకు అధికారులు నోటీసులు అంటించారు. ఇదిలావుండగా ఓటుకు నోటు కేసులో విచారణ నిమిత్తం...

Saturday, July 4, 2015 - 16:13

హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జైలులో తన భార్య, తల్లితో భత్కల్ 27సార్లు మాట్లాడారని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం తాము ల్యాండ్ ఫోన్లో మాట్లాడేందుకు అనుమతించామని తెలిపారు. వారిద్దరితో భత్కల్ ఫోన్ సంభాషణ హిందీ, అరబిక్ భాషలో...

Saturday, July 4, 2015 - 15:51

హైదరాబాద్: తెలంగాణలోని జేఈఈ విద్యార్థులకు ఊరట లభించింది. తెలంగాణ విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ర్యాంకులు వెబ్‌ సైట్‌లో చూసుకోవచ్చని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆప్షన్ల నమోదుకు రేపటి వరకు గడువు ఉందని మంత్రి చెప్పారు. 

Saturday, July 4, 2015 - 13:47

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4వేల మందిలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎమ్‌బీ.భవన్‌లో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని సీపీఎం ఘనంగా నిర్వహించింది. కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి సీపీఎం నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Saturday, July 4, 2015 - 13:46

హైదరాబాద్ :వామపక్షాల విలీనానికి సీపీఐ సిద్ధంగా వుందని ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ అవినీతి పాలనపై కేంద్రకమిటీ సమావేశాల్లో చర్చించామన్నారు. అవినీతికి పాల్పడ్డ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని, మిగిలిన వామపక్ష పార్టీలతో కలిసి కార్యాచరణ...

Saturday, July 4, 2015 - 13:11

మెదక్ : సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తాను ఇక్కడి వాడినని, ప్రజల దీవెనలతో ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. పంటలు పండించుకోవడానికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని, అలాగే హైదరాబాద్ కు నార్త్ లో విమానాశ్రయం...

Saturday, July 4, 2015 - 12:47

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు. 1996-97 సంవత్సరంలో సిద్ధిపేట శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ కార్యక్రమం...

Saturday, July 4, 2015 - 12:40

హైదరాబాద్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఎస్ఎఫ్ఐ పోరాటం ఉధృతం చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఐదు వేల రూపాయలకు కుదించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఉన్నత విద్యా మండలి ముట్టడికి ప్రయత్నించింది. ఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించేందుకు ముందుకు కదిలారు. కానీ అక్కడనే ఉన్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు...

Saturday, July 4, 2015 - 08:19

హైదరాబాద్ : యాసిన్ భత్కల్..ఒక అంతర్జాతీయ ఉగ్రవాది..ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్ వ్యవస్థాపకుడు..భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడిన అనేక మంది ఉసురు తీసిన ఈ భత్కల్ పారిపోయేందుకు ప్లాన్ రచించినట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఇతను దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో సూత్రధారి కావడం తెలిసిందే. ఇతను చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు...

Saturday, July 4, 2015 - 06:39

ఆదిలాబాద్ : జిల్లాలో గోదావరి పుష్కర పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పుష్కరాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పుష్కరాలు సమీపిస్తున్నా.. అధికారులు మాత్రం స్పందించడం లేదు. మరోవైపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 15 మండలాల్లో 40 పుష్కరఘాట్‌లను...

Saturday, July 4, 2015 - 06:37

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా.... ఢిల్లి పెద్దలకు వీర విధేయుడుగా పేరున్న డి శ్రీనివాస్ పార్టీకి హ్యండివ్వడాన్ని జీర్ణించుకోలేకపోతోంది కాంగ్రెస్. డీఎస్ ఝలక్‌తో ఖంగుతిన్న కాంగ్రెస్.. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్‌పై దృష్టి సారించింది. డీఎస్ పై మాటల దాడి కొనసాగిస్తూనే.. ఆయనతో పాటు కారెక్కేందుకు రెడీ అవుతున్నవారిపై ఆరా తీస్తున్నారు హస్తం నేతలు. ఈ...

Saturday, July 4, 2015 - 06:33

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నేతల కలలు తీరడం లేదు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఆలస్యం కావడంతో నేతల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకపక్క పార్టీలోకి వలసలు పెరుగుతుండడం.. మరోపక్క స్థానిక సంస్థల మండలి ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పదవుల కేటాయింపునకు అడ్డంకిగా మారబోతున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి భారీగా హామీలిస్తుండడంతో.. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న...

Saturday, July 4, 2015 - 06:07

నల్గొండ : విజయవాడ హైవేపై కేశినేని ట్రావెల్స్ బస్సు బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. కేశినేని ట్రావెల్స్ (ఎపి16 టిసి 3773) బస్సు ఏలూరుకు వెళుతోంది. శనివారం తెల్లవారుజామున చివ్వెంల (మం) గుంపుల వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన 15 మందిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి...

Friday, July 3, 2015 - 21:23

హైదరాబాద్:ఐఐటీ- జేఈఈ రాసిన తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. ఇంటర్ బోర్డు ద్వారా సమాచారం తీసుకుని... తక్షణమే ర్యాంకులు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈకి ధర్మాసనం సూచనలు చేసింది. 

Friday, July 3, 2015 - 21:20

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. అక్కడే కొందరికి మొక్కలు పంపిణీ చేశారు.. అంతకుముందు చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు కేసీఆర్...

Pages

Don't Miss