TG News

Friday, October 30, 2015 - 16:43

హైదరాబాద్ : 'రాజు గారి గది' సినిమా చూస్తూ ఓవ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. అమర్నాథ్ అనే 50ఏళ్ల వ్యక్తి... హైదరాబాద్ బహదూర్ పూరాలోని మెట్రో థియేటర్ లో సినిమా చూస్తూ చనిపోయాడు. గుండె పోటుతో చనిపోయినట్టుగా థియేటర్ యాజమాన్యం తెలిపింది.

Friday, October 30, 2015 - 16:41

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు.. టిపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ఎన్నికపై జాతీయ సంస్థతో సర్వే చేయించామని తెలిపారు.. దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో తమ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే తేల్చిందని స్పష్టం చేశారు.. రేపు ఉదయం అభ్యర్థి పేరును ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పారు..

Friday, October 30, 2015 - 15:46

హైదరాబాద్ : వరంగల్‌ టిఆర్ ఎస్ అభ్యర్థిగా గుడిమల్ల రవికుమార్‌ను ప్రకటిస్తే మాదిగలనుంచి ప్రతిఘటన తప్పదని...ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.. ఓరుగల్లులో 80శాతం మాదిగలున్నారని.... వారినికాదని రవికుమార్‌కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.. కడియం శ్రీహరి తన కూతుకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తే ఎమ్మార్పీఎస్ వ్యతిరేకించిందని...

Friday, October 30, 2015 - 15:43

హైదరాబాద్ : వ‌రంగ‌ల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే క‌ట్టబెడుతూ నిర్ణయం తీసుకున్న గులాబీ పార్టీ నేత‌లకు ఇప్పుడు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. గురువారం నాటి స‌మావేశంలో అభ్యర్థిగా గుడిమ‌ళ్ల ర‌వికుమార్‌ పేరును కేసీఆర్‌ ఫైన‌ల్ చేశార‌నే ప్రచారం జ‌రిగింది. ఇక అధికారికంగా ప్రకటించ‌డమే త‌రువాయి అని పార్టీ వ‌ర్గాలు అంచ‌నా...

Friday, October 30, 2015 - 15:39

హైదరాబాద్ : నగరంలో టోలి చౌకీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా.. గ్యాస్ లీకేజీ జరిగింది. ఈ ఘటనలో 15మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...

Friday, October 30, 2015 - 14:49

హైదరాబాద్ : సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అలాంటి అవినీతికి పాల్పడిన వ్యక్తి ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదన్నారు. వాస్తవాలేమిటో ప్రజలకు చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

Friday, October 30, 2015 - 14:34

హైదరాబాద్ : ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి వైద్యులు దేశంలోనే అరుదైన శస్త్రచికిత్సను చేశారు. నాగరాజు అనే 24 ఏళ్ళ యువకుడికి కాలేయ మార్పడి చేసి చరిత్ర సృష్టించారు. 30 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీకి పేషెంట్ దగ్గర నుండి రూపాయికూడా తీసుకోకుండా చేసినట్టు వైద్యులు తెలిపారు.. వసతులు కల్పిస్తే ప్రైవేట్ హాస్పటల్ కు దీటుగా సేవలందిస్తామని ఈ సందర్భంగా వైద్యులు చెబుతున్నారు....

Friday, October 30, 2015 - 14:27

హైదరాబాద్ : సామాజిక వ్యవస్ధ పుట్టుకను, కులాల ఏర్పాటు వెనుక చరిత్రను, ఆంతర్యాన్ని వివరిస్తూ టెన్‌టీవీలో ప్రసారమవుతున్న జనచరిత కార్యక్రమానికి పద్మమోహన అవార్డు లభించింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య తరతరాలుగా కులం పేరుతో జరుగుతున్న అన్యాయాలను సైద్ధాంతికంగా శాస్త్రీయంగా వివరిస్తున్న జనచరితకు వచ్చిన ఈ అవార్డును టెన్‌ టీవీ అసిస్టెంట్‌ ఎడిటర్‌ తాడి సతీష్‌ అందుకున్నారు....

Friday, October 30, 2015 - 13:41

ఆదిలాబాద్ : గాయని మధుప్రియ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఇవాళ సాయంత్రం తను ప్రేమించిన యువకుడి శ్రీకాంత్ తో మధుప్రియ వివాహం జరుగనుంది. మధుప్రియ, తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకున్నారు. దీంతో ముధుప్రియ పెళ్లికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. వివరాల్లోకి వెళితే... మధుప్రియ, శ్రీకాంత్ అనే యువకుడు...

Friday, October 30, 2015 - 10:52

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మళ్లీ స్వైన్ టెర్రర్ మొదలైంది. స్వైన్‌ ఫ్లూ విజృంభించి ప్రజల్ని గజగజ వణికిస్తోంది. వాతావరణం కాస్త చల్లబడటంతో మాయదారి రోగం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పంజా విసురుతోంది. స్వైన్‌ స్వైర విహారంతో జనాలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు
...

Friday, October 30, 2015 - 10:43

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఆరు లక్షల రుపాయలకు పెంచింది ప్రభుత్వం. అయితే ఈ పెంచిన పరిహారాన్ని గతంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 19 అనంతరం ఆత్మహత్య చేసుకున్న రైతులకు వర్తింప చేస్తామని క్యాబినేట్‌ నిర్ణయించింది. అయితే దీని పై విపక్షాలు,ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు...

Friday, October 30, 2015 - 10:24

ఆదిలాబాద్ : కాగజ్ నగర్ లో ధూంధాం కళాకారిణి మధు ప్రియను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కు యత్నించారు. మధుప్రియ, శ్రీకాంత్ అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మధుప్రియ అతన్ని వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఇవాళా తెల్లవారుజామున కాగజ్ నగర్ లో వివాహం చేసుకోవడానికి మధుప్రియ, శ్రీకాంత్ లు సిద్ధమయ్యారు. అయితే ఆమె తల్లిదండ్రులకు ప్రేమ వివాహం...

Thursday, October 29, 2015 - 19:48

హైదరాబాద్ :తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. బెంగళూరులో జరిగిన సీఈబీఐటీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఐటీకి సంబంధించి భారత్‌లో ఉన్న అవకాశాలపై చర్చించే ఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్ని ప్రసంగించారు. తెలంగాణలో ఐటీ బిజినెస్‌కు ఉన్న అవకాశాలను వివరించారు.

Thursday, October 29, 2015 - 19:46

మెదక్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో చోటు చేసుకుంది. రాజోల గ్రామానికి చెందిన చెరుకు రైతు నాగన్న ప్రైవేటు ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని బలవన్మరణం పొందాడు. ప్రైవేటు ఫైనాన్స్‌ వద్ద 3 లక్షల మేర అప్పు తీసుకోవడంతో పాటు 7 ఎకరాల పొలంలో నాగన్న చెరుకు సేద్యం చేశాడు . తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటకు...

Thursday, October 29, 2015 - 17:51

హైదరాబాద్ : భద్రత కోసం ప్రవేశపెట్టిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వాహనదారులను భయపెడుతున్నాయి. నెంబర్ ప్లేట్ల బిగింపు ప్రహాసనంగా మారడం,..బిగించిన ప్లేట్లు నాణ్యతగా లేకపోవడంతో వాహరదారులు లబోదిబోమంటున్నారు. నెంబర్‌ ప్లేట్లను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

సంఘ వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట...

Thursday, October 29, 2015 - 17:48

హైదరాబాద్ : డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికేట్లలో డాక్టర్‌ అని చేర్చకపోవడంపై జెఎన్టీయూ హైదరాబాద్‌ ఫార్మ్‌ డీ విద్యార్థులు నిరసనకు దిగారు. తెలుగు రాష్ట్రాలలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు డాక్టర్‌ అనే గుర్తింపుతో సర్టిఫికేట్‌లు జారీ చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. జెఎన్టీయూ...

Thursday, October 29, 2015 - 17:47

హైదరాబాద్ : వరంగల్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వామపక్ష ప్రజాసంఘాల అభ్యర్థి గాలి వినోద్‌ కుమార్ ప్రచారం జోరందుకుంది. వరంగల్‌ జరిగిన సమావేశంలో వామపక్ష పార్టీలు గాలి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ప్రచార పర్వం కొనసాగించారు. ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్‌ చేసిన వాగ్దానాలను మరిచారని అందుకు...

Thursday, October 29, 2015 - 17:23

హైదరాబాద్‌ : నగరంలోని సీపీఎం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌ను వియత్నాం ప్రతినిధులు సందర్శించారు. వీరికి ఘన స్వాగతం లభించింది. వియత్నాంకు వామపక్ష పార్టీల మద్దతు ఎప్పుడూ ఉందని వియత్నాం - భారత్‌ల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ప్రతినిధి బృందం ప్రెసిడెంట్‌ ఎంపీ వూజువాన్‌ హంగ్‌ అన్నారు. 

Thursday, October 29, 2015 - 17:15

ఆదిలాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందినా.. గ్రామీణ ప్రాంత ప్రజలను మంత్రాల భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దళితులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికార దర్పంతో అగ్రవర్ణ పెద్దలు.. అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు మూడ నమ్మకాలతో భయంతో వణికిపోతున్నాయి.అగ్రవర్ణాల దాడితో ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌...

Thursday, October 29, 2015 - 16:56

ఖమ్మం : ఆశ కార్మికుల సమ్మెకు సీపీఎం నైతిక మద్దతును అందచేస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బిక్షాటన చేపట్టి నిధులను సమీకరించి వారికి అండగా నిలువనున్నట్లు తెలియచేశారు. ఖమ్మంలో కలెక్టరేట్ ఎదుట ఆశ కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించిన...

Thursday, October 29, 2015 - 16:49

మహబూబ్‌నగర్‌ : ఓ వైపు కందిపప్పు ధరలు సామన్యుడిని భయపెడుతుంటే..మరోవైపు అక్రమార్కులు కందిపప్పును దోచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం గోవిందహళ్లి గ్రామ శివారులో ఖాళీ కందిపప్పు ప్యాకేట్లు బయటపడ్డాయి. ఎమ్మెర్వో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 200 ధర...

Thursday, October 29, 2015 - 16:47

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ లో సమ్మె సందర్భంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హెచ్‌ఆర్సీ జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. నెలరోజుల్లో విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. కార్మికుల జీవనానికి ఇబ్బంది కలుగుతున్నందున వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది.

Thursday, October 29, 2015 - 16:41

కరీంనగర్‌ : ముత్తారం మండలం ఆదివారం పేటలో వేల్పుల శ్యామల అనే పాలిటెక్నిక్‌ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సంవత్సరం పాలిటెక్నిక్‌ చదువుతున్న శ్యామల కొద్ది రోజుల క్రితమే టీసీ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని కోరింది. దీంతో కాలేజీ యాజమాన్యం 50 వేలు డిమాండ్ చేసింది. మనస్థాపానికి గురైన శ్యామల పురుగుల మందు సేవించి...

Thursday, October 29, 2015 - 16:35

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నిక అభ్యర్ధిని రెండురోజుల్లో ప్రకటిస్తామని దిగ్విజయ్‌సింగ్‌ తెలియచేశారు. ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయాలన్నీ సేకరించామని ఆయన చెప్పారు. మరోవైపు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తాను వరంగల్‌లో పోటీ చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

Thursday, October 29, 2015 - 16:33

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్ధి ఎంపికపై సమావేశమైన టీఆర్‌ఎస్‌.. నిర్ణయాధికారాన్ని సీఎం కేసీఆర్‌కే అప్పచెప్పింది. రేపు కేసీఆర్‌ అభ్యర్ధి పేరును ప్రకటిస్తారు. గురువారం తెలంగాణ భవన్‌లో వరంగల్‌ జిల్లా నేతలతో కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో పార్టీ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో పాటు వరంగల్‌ జిల్లాలోని పార్టీ...

Thursday, October 29, 2015 - 15:15

హైదరాబాద్ : పార్టీ మారక ముందు ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యం. హస్తాన్ని వీడి కారెక్కిన వెంటనే బుగ్గ కారు ఇచ్చారు. బంగారు తెలంగాణ కోసం ఆయనకు భారీ బాధ్యతలను అప్పగించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ప్రాధాన్యతను కుదించారు. ఆయనకు కేటాయించిన వ్యవహారాలను సైతం ఆయన లేకుండానే కానిచ్చేస్తున్నారు. కనీసం సమావేశాలకు సైతం ఆయనకు ఆహ్వానం అందటం లేదు.

...

Thursday, October 29, 2015 - 15:08

హైదరాబాద్ : చండీయాగం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ వృధా చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేంధర్‌ అన్నారు. నల్గొండ జిల్లాకు నీరవ్వలేని కేసీఆర్‌..యాగాల పేరుతో డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. 

Pages

Don't Miss