వీళ్లు అసాధ్యులే : రాత్రికి రాత్రే బ్రిడ్జ్ నే.. మాయం చేశారు!

Submitted on 6 June 2019
The thieves who climbed the middle part of the bridge over the river

దొంగలంటే డబ్బు, నగలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వంటి విలువైన వస్తువులు దోచుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే దొంగలు మాత్రం అలాంటిలాంటి దొంగలు కాదు. వీళ్లు సామాన్యులు కాదు. మోసగాళ్లకు మోసగాళ్లు. ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇంతకీ ఈ ఘరానా దొంగలు దొంగిలించింది ఏమిటా అనుకుంటున్నారా? ఏకంగా ఏ బ్రిడ్జీనే ఎత్తుకెళ్లిపోయారు. ఏంటీ జోక్ అనుకుంటున్నారా? కానేకాదు. 

56 టన్నులు, 75 అడుగుల పొడవైన వంతెనను ఎత్తుకెళ్లి పోయారంటే ఈ దొంగల ప్లాన్.. క్రియేటివిటీ.. సాధారణమైంది కాదనపించక మానదు. ఈ ఘరానా దొంగతనం రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో జరిగింది. ఈ చోరీ స్థానికంగా సంచలనంగా మారింది. 

ఐకువెన్, లొవోజిరో ప్రాంతాలను కలుపుతూ ఉంబా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ శిథిలమైపోయింది. దీంతో ఆ బ్రిడ్జ్ పై రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఈ క్రమంలో ఈ బ్రిడ్జ్ మిడిల్ పార్ట్ వాటర్ లో పడిపోయిన ఫొటో ఒకటి మే 16న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కానీ మే 26న అధికారులు ఓ ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటోలో నీటిలో కూలిపోయిన బ్రిడ్జ్ పార్ట్ మాత్రం కనిపించలేదు. 

మీడియా సంబంధిత అధికారులను ప్రశ్నించింది. వారుమాత్రం  శిథిలమైపోయిన బ్రిడ్జ్ ని తాము తొలగించలేదని చెప్పారు.  దీంతో ఆ వంతెన దానంతట అదే కూలిపోలేదనీ.. ఎవరో మాయం చేశారనీ.. శిథిలమైపోయిన బ్రిడ్జ్ ను ఎత్తుకుపోయేందుకు కొందరా ప్లాన్ చేశారని తేలింది. దొంగలే దాన్ని కట్ చేసి నదిలో పడేశారని.. ఆ తర్వాత దాన్ని కట్ చేసి ఎత్తుకుపోయారని తెలిసింది.

కాగా నదీ ప్రవాహంలో పడిపోయిన బ్రిడ్జ్ కొట్టుకుపోయిందని అనుకోవాటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఆ నది ప్రవాహం సాధారణంగానే ఉంది. దీంతో ఆ వంతెన మిస్సింగ్ పై స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

thieves
Bridge
middle part
River
arctic
Russia

మరిన్ని వార్తలు