డిగ్రీ ఏదైనా ఓకే : Tobacco బోర్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్, అకౌంటెంట్ ఉద్యోగాలు

Submitted on 26 June 2019
Tobacco Board Field Officer & Accountant Recruitment 2019 – 41 Posts

ఆంధ్రప్రదేశ్ లోని  గుంటూరు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన టోబాకో బోర్డ్ తాత్కాలిక ప్రాతిపదికన 41 పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, ఆఫీస్ వర్క్ ఆప్టిట్యూడ్ పేపర్లు ఉంటాయి.

పోస్టులు:
> ఫీల్డ్ ఆఫీసర్/టెక్నికల్ అసిస్టెంట్ - 25
> అకౌంటెంట్/సూపరింటెండెంట్ - 16

విద్యార్హత:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BSC(అగ్రికల్చర్) లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. టాలీ అకౌంట్స్ సాఫ్టవేర్ లో సర్టిఫికెట్ కోర్సు చేసుండాలి.

వయసు:
2019, జూలై 15 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:
అభ్యర్ధులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ST, SC, PWD అభ్యర్ధులకు మాత్రం ఫీజు లేదు.

దరఖాస్తు చివరితేది: జూలై 15, 2019.

Tobacco Board
Field Officer & Accountant Jobs
2019

మరిన్ని వార్తలు