యువతలో మార్పు : పెళ్లి కోసం బ్యాంకు లోన్లు

Submitted on 11 August 2019
todays generation having wedding expense their own money growing

పెళ్లి అంటే అమ్మాయి తల్లిదండ్రులకే అన్ని రకాలుగా ఖర్చు ఎక్కువ ఉంటుంది. మగపెళ్ళి వారికంటే ఆడపెళ్లి వారికే ఖర్చులే ఎక్కువ... కట్నం ఇవ్వాలి.. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి. పిల్లను కాపురానికి పంపేటప్పుడు అవసరమైన సామాన్లు ఇచ్చి పంపాలి...ఇలా చాలా ఉంటుంది లిస్టు. కానీ నేటి యువతరం భిన్నమైన మార్గంలో పయనిస్తోందని తాజా సర్వే  వెల్లడించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా లెండ్స్‌ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో కొత్త విషయాలు  వెలుగులోకి వచ్చాయి.

2018–19 సంవత్సరంలో యువతరం పెట్టుకున్న రుణాల దరఖాస్తుల్లో 20 శాతం వారి పెళ్లి కోసమేనని తెలిసింది. జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకం లాంటి పెళ్లి ఖర్చును తమ సొంత డబ్బుతోనే చేసుకోవాలనే ఆలోచన నేటి యువతలో బాగా పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. ఇక యువతీ యువకుల్లో ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్న కోరిక బాగా ఉంది. రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రయాణాల కోసమే 70 శాతం దాకా ఉన్నాయి. మిగిలినవన్నీ విద్యా రుణాలు, సొంతంగా కొత్త కంపెనీలు పెట్టేందుకు ఉన్నాయి. 

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రోనగరాల్లో 25–30 ఏళ్ల వయసు మధ్యనున్న వారు దేనికోసం రుణాలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. "ఈతరం పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని అనుకుంటున్నారు. తమ పెళ్లి కోసం రుణాలు తీసుకోవడం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అమ్మాయిల తల్లిదండ్రులే అన్నీ చేయాలన్న ధోరణిలో బాగా మార్పు వస్తోంది"  అని ఇండియాలెండ్స్‌ సంస్థ సీఈవో రవ్‌ చోప్రా చెప్పారు. ముంబైలో అత్యధికంగా 22 శాతం పెళ్లి కోసం రుణాలు తీసుకుంటే.. హైదరాబాదీల్లో 20 శాతం మంది ప్రయాణాల కోసమే లోన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని అన్నారు.

youth
Bank Loans
marriages
Expenditure
honey moon
foreign trip

మరిన్ని వార్తలు