రూ.15వేల లోపు : టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Submitted on 9 July 2019
Top 5 Smartphones To Buy Under Rs 15,000 In July 2019 

ఇండియన్ మొబైల్ మార్కెట్లలో స్మార్ట్ ఫోన్లకు రోజురోజుకీ ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. కొత్త కొత్త మోడల్స్, హై ఫీచర్లు, ఎట్రాక్టీవ్ కెమెరా ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. చౌకైన ధర, అదిరిపోయే ఫీచర్లు ఉండటంతో స్మార్ట్ ఫోన్ యూజర్లంతా ఆన్ లైన్, అఫ్ లైన్ లో కొనేందుకు క్యూ కట్టేస్తున్నారు. ఇండియా మార్కెట్లో రిలీజ్ అయిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎంత ధర ఉన్నాయి.. ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసా? జూలై  నెలలో మార్కెట్లలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో రూ.15వేల లోపు ఉన్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోండి. 

1. రెడ్ మి నోట్ 7 ప్రొ : 
ప్రస్తుతం.. ఇండియన్ మార్కెట్లో క్రేజీ స్మార్ట్ ఫోన్ ఇదే. రెడ్ మి నోట్ 7 ప్రో.. మోస్ట్ పాపులర్ ఫోన్ గా చెప్పుకోవచ్చు. టాప్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల నుంచి ప్రీమియం గ్లాస్ డిజైన్ బాడీతో మార్కెట్లోకి వచ్చింది. శాండ్ విచ్, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 బాడీతో ఎట్రాక్టీవ్ ఉంది. 6.3 అంగుళాల ఫుల్ HD+ డాట్ నాచ్ డ్ డిస్ ప్లే ప్రత్యేకం. 11nm స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ తో పాటు MIUI 10 టాప్ బేసిడ్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 4000mAhతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 48MP సోనీ IMX సెన్సార్ ప్రైమరీ కెమెరాతో పాటు 5MP సెకండరీ డెప్త్ సెన్సార్ ఉంది. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.13వేల 999గా ఉండగా ఫ్లిప్ కార్ట్, mi.com వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది. 

2. రియల్ మి3 ప్రో : 
ఈ ఫోన్.. హై పాలీకార్బొనేట్ బాడీతో సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. మిడ్ రేంజ్ విన్నర్ గా రియల్ మి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రియల్ మి 3 ప్రొ.. 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ వాటర్ డ్రాప్ నాచ్ డ్ డిస్ ప్లే ఉంది. గొర్రిల్లా గ్లాస్ 5తో గ్రేడియంట్ డిజైన్ బ్యాక్ సైడ్ లో ఉంది. 16MP సోనీ IMX 519 సెన్సార్ సాయంతో డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. 5MP డెప్త్ సెన్సార్, 25MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది. క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ తో రెండు వేరియంట్లలో కొత్త colorOS6.0తో ఆండ్రాయిడ్ 9 పై పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 4,405mAh సపోర్ట్.. VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ (20W)తో మైక్రో USB పవర్డ్ బ్రిక్ లోపలివైపు ఉంటుంది. 

3. శాంసంగ్ గెలాక్సీ M30 :
శాంసంగ్ కంపెనీ అందించే తక్కువ ధర స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ సిరీస్ నుంచి M30 ఒకటి. ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 6.4 అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD+ డిస్ ప్లే ఫీచర్లతో పాటు వాటర్ డ్రాప్ నాచ్ ఆన్ టాప్ ఉంది. దీన్ని ఇన్ఫినిటీ-V డిస్ ప్లేగా పిలుస్తారు. బయట వైపు హైక్వాలిటీ ప్లాస్టిక్ పాలీకార్పొనేట్ బాడీతో గ్రేడియంట్ కలర్ డిజైన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. శాంసంగ్ సొంత టెక్నాలజీ Exynos 7904 SoC ఆక్టా కోర్ చిప్ రన్ అవుతుంది. ఈ ఫోన్ 4GB లేదా 6GB ర్యామ్ వేరియంట్ ఎట్రాక్టీవ్ గా ఉంటుంది. గెలాక్సీ ఎం30లో 13MP ప్రైమరీ షూటర్, 5MP అల్ట్రా వైడ్ లెన్స్, మూడోది 5MP డెప్త్ లెన్స్ ఉంది. ఆండ్రాయిడ్ 8.1 ఒరియోతో ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతూ One UI సపోర్ట్ చేస్తుంది. అతిపెద్ద బ్యాటరీ 5,000mAhతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ చేసేలా సపోర్ట్ చేస్తుంది. 

4. రెడ్ మి నోట్ 7S :
షియోమీ నుంచి రిలీజ్ అయిన రెడ్ మి 7 సిరీస్ లో ఇదొకటి. రెడ్ మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రిలీజ్ అయిన తర్వాత రెడ్ మి 7S మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఇండియాలో షియోమీ అందించే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ 48MP డ్యుయల్ కెమెరాతో రెడ్ మి 7S ఎట్రాక్ట్ చేస్తోంది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ నాచ్ డ్ డిస్ ప్లేతో పాటు గ్లాస్ శాండ్ విచ్ బాడీ, గొర్లిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఉంది. స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 3GB/4GB ర్యామ్, 32GB/64GB బుల్ట్ ఇన్ స్టోరేజీ, మైక్రోSD కార్డు ద్వారా 256GB వరకు ఎక్స్ పాండబుల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ స్పోర్ట్స్ 13MP సెన్సార్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. బ్యాటరీ 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఆండ్రాయిడ్ 9.0 పై, బేసిడ్ MIUI 10 సపోర్ట్ చేసేలా ఉంది. 

5. రియల్ మి 2 ప్రొ : 
2018లో ఇండియాలో రిలీజ్ అయిన రియల్ మి 2 ప్రొ.. స్మార్ట్ ఫోన్ రూ.15వేల లోపు బడ్జెట్ ఫోన్లలో బెస్ట్ ఫోన్. ప్రస్తుతం ఈ ఫోన్ మార్కెట్లో ప్రారంభ ధర రూ.12వేల 990గా ఉంది. స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6.2 అంగుళాల ఫుల్ HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే, డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 3,500mAh బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 పై కొత్త కలర్ ఓఎస్ 6 అప్ డేట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. 

Top 5 smartphones
July 2019
redmi
Realme
redmi note 7 pro
Galaxy M30 

మరిన్ని వార్తలు