షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు : హీరో నాగశౌర్యకు రూ.500 జరిమానా!

Submitted on 13 August 2019
Top Telugu Hero Fined By Hyderabad Traffic Police For Tinted Glass

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ గ్లాస్ ఉన్న కారులో ప్రయాణించినందుకు నాగశౌర్యకు రూ.500 జరిమానా విధించారు. మంగళవారం (ఆగస్టు 13, 2019)న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి కారులో నాగశౌర్య వెళ్తున్నారు. 

ఆ కారు విండోలకు బ్లాక్ ప్రేమ్ గ్లాసులు ఉండటం గుర్తించిన పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు.  తనిఖీలు చేసి జరిమానా విధించారు. కారులో ఉన్న మనిషి కనిపించకుండా.. వాహనాల విండోలకు బ్లాక్ గ్లాస్‌లను ఉంచడం సుప్రీంకోర్టు రూల్స్ ను ఉల్లంఘన కిందికి వస్తోంది.  

ఇటీవల.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కూడా ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోవడంతో పోలీసులు జరిమానా విధించిన విషయం తెలిసిందే. నగరంలోని మూసాపేట్‌ శ్రీరాములు థియేటర్‌ వద్ద వర్మ  బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చేశారు. ట్రిపుల్‌ డ్రైవింగ్‌ వ్యవహారంపై స్పందించిన పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంతో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘన కింద వర్మ కు రూ.1350 జరిమానా విధించారు.

Naga Shourya
Fined By Hyderabad Traffic Police
For Tinted Glass

మరిన్ని వార్తలు