బదిలీ టైం : తెలంగాణలో IAS, IPSల బదిలీలు!

Submitted on 26 May 2019
Transfer of IPS and IAS officers soon In Telangana

తెలంగాణలో పూర్తి స్థాయిలో పాలనపై దృష్టిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. అన్ని ఎన్నికలు పూర్తై ఫలితాలు కూడా వచ్చేయడంతో... పాలనలో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదరవుతున్నారనే భావనలో ఉన్న కేసీఆర్... పాలనను గాడిలో పెట్టాలనే భావిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి... మున్సిపల్, రెవెన్యూ శాఖలకు సంబంధించి కొత్త చట్టాలను రూపొందించే పనిలో ఉన్నారు. వాటికి సంబంధించిన కసరత్తు కూడా అధికారులు పూర్తి చేశారు. ఈ కొత్త చట్టాల ఆమోదం కోసం త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత.. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

పాలనలో మార్పులు రావాలంటే.. అధికారులను బదిలీ చేసి.. కొత్త వారిని నియమించాలనే సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలో.. కలెక్టర్లను, అధికారులను యుద్ధప్రాతిపదికన కేటాయించారు. ఇప్పటికి వారి పనితీరుపై పూర్తి స్థాయిలో అవగాహన రావడంతో వారి పనితీరు ఆధారంగా కొందరని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో కూడా కొంతమంది ఉన్నతాధికారులకు పదోన్నతులు రావడంతో.. వారు నిర్వహిస్తున్న శాఖల్లో మార్పులు తెస్తారని.. అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు... ఐపీఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్లపైనా సీఎం దృష్టిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

రాష్ట్రంలో ఇన్నాళ్లూ ఎన్నికల సీజన్ నడిచింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తై ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే నెల మొదటి వారంతో పూర్తవుతుంది. కోడ్ పూర్తైన వెంటనే అధికారుల బదిలీలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రాన్స్‌ఫర్ల అనంతరం.. పాలనా పరంగా కొన్ని సంస్కరణలు కూడా తెచ్చే అవకాశం ఉంది. మరి ఏ అధికారిని ఎక్కడికి మారుస్తారు.. ఎవరి పనితీరు సరిగ్గా లేదని కేసీఆర్ భావిస్తున్నారనే విషయం మరికొన్ని రోజుల్లోనే తెలిపోనుంది. 

Transfer
IPS and IAS
Officers
Telangana
KCR speech

మరిన్ని వార్తలు