దుబాయ్ వెళ్తున్నారా? : 30రోజుల ఫ్రీ అల్కాహాల్ లైసెన్స్ కావాలంటే? 

Submitted on 12 July 2019
Travelling to Dubai? Here's how to get your free 30-day alcohol licence

దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. పర్యాటక దేశంలో ఇకపై స్వేచ్చగా మందు కొట్టొచ్చు. స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం.. విదేశీ పర్యాటకుల కోసం దుబాయ్.. 30 రోజుల ఫ్రీ అల్కాహాల్ లైసెన్స్ ఆఫర్ చేస్తోంది. సాధారణంగా దుబాయ్‌ పర్యాటనకు వెళ్లిన చాలామంది సందర్శకులు ఆహ్లాదకరంగా గడపాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో అల్కాహాల్ సేవించి శిక్షకు గురవుతున్నారు. దుబాయ్ చట్టాల ప్రకారం.. విదేశీ పర్యాటకులు మద్యం సేవించడం అక్కడ నేరం. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై జరిమానా విధించడం కామన్.

దీంతో దుబాయ్ వెళ్లాలంటేనే ఎక్కడ జరిమానా పడుతోందనని పర్యాటకులు భయపడుతున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ ఈ కొత్త ఆఫర్ అందిస్తోంది. 30 రోజుల పాటు ఉచితంగా ఆల్కహాల్ లైసెన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. పర్యాటకుల్లో మద్యం సేవించాలంటే.. 21ఏళ్ల వయస్సు పైబడి ఉండాలి.. ముస్లింయేతర సందర్శకులు అయి ఉండాలి. వీరికే మాత్రమే ఉచితంగా మద్యం లైసెన్స్ వర్తిస్తుంది.

ఈ లైసెన్స్ పొందాలంటే పర్యాటకులు మందుగా ఎమిరేట్స్ గ్రూపుకు చెందిన సపరేట్ సిగ్మంట్.. అల్కహాల్ రిటైల్ ఔట్ లెట్ మారిటైమ్, మెర్కెంటెయిల్ ఇంటర్నేషనల్ (MMI) అనే వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పర్యాటకులకు లైసెన్స్ పొందేందుకు అవసరమైన మార్గదర్శకాలను సూచిస్తుంది. దీని ప్రకారం.. పర్యాటకులు లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ వెళ్లగానే పర్యాటకులు ముందుగా MMI స్టోర్ ను సందర్శించాల్సి ఉంటుంది.

అక్కడ.. తమ పాస్ పోర్టుతోపాటు అల్కహాల్ కొనుగోలు చేసేది ఒక టూరిస్ట్ అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు.. పర్యాటకుని దగ్గర నుంచి పాస్ పోర్టు కాపీని తీసుకుంటారు. ప్రతి పర్యాటకుడికి మార్గదర్శకాలతో కూడిన ఎంట్రీ స్టాంప్ వేసి అల్కహాల్ లైసెన్స్ అందిస్తారు. 

ప్రస్తుతం.. దుబాయ్ నివాసితుల్లో వీసా కలిగిన వారికి రెండేళ్ల అల్కహాల్ లైసెన్స్ ఉంటుంది. ఈ లైసెన్స్ ద్వారా షాపుల్లో.. స్టోర్లలో, ఇంట్లో అల్కాహాల్ కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంటుంది. దుబాయ్ లోని సిటీ బార్లు, రెస్టారెంట్లలో మద్యం సేవించాలన్నా టెక్నికల్ గా లైసెన్స్ ఉండాలి. అప్పుడే మద్యం సేవించేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతోంది.

Alcohol
alcohol licence
Dubai
non-Muslim visitors
MMI store
entry stamp 


మరిన్ని వార్తలు