తేలు విషంతో చికిత్స

Submitted on 12 June 2019
Treatment with scorpion poisoning

విషం అంటే ప్రమాదకరం. మనిషి ప్రాణం తీస్తుంది. విషం కలిగిన తేలు కరిస్తే ప్రాణాపాయమే. కానీ అంతటి విషంలోనూ ఔషద గుణాలున్నాయి. తేలు విషంతో కూడా రోగాలను నయం చేయొచ్చని పరిశోధనలో నిరూపితమైంది. బ్యాక్టీరియా ద్వారా వచ్చే క్షయ వంటి అంటురోగాలపై పోరాడేందుకు తేలు విషం నుంచి తయారు చేసిన రెండు సమ్మేళనాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, మెక్సికో నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డిప్లోసెంట్రస్‌ అనే తేలు విషం నుంచి రెండు పదార్థాలను తయారు చేశారు. ఈ పదార్థాలు ఎలుకల్లో క్షయవ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చంపాయని పేర్కొన్నారు.
 

Treatment
scorpion
poisoning
america

మరిన్ని వార్తలు