హరీశ్, కేటీఆర్ ముచ్చట్లు : బావా!లక్ష మెజారిటీ ఖాయం..

16:02 - December 7, 2018

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల మధ్య టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సరదా సరదా ముచ్చట్లు జరిగాయి. హైద్రాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకొని సిరిసిల్లకు వెళ్తున్న కేటీఆర్ మార్గమధ్యలోని సిద్దిపేటలో  హరీష్ రావు‌ను కలిశారు. ఇద్దరూ కొద్దిసేపు ఆప్యాయంగా..ఆదరంగా పలకరించుకున్నారు. అంతేకాదు బావా!లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని హరీష్‌తో కేటీఆర్ అంటు సరదాగా..ధీమాగా..ఆప్యాయంగా పలకరించుకోవటంతో ఆహ్లాదకరణ వాతావరణం నెలకొంది. 
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  పోలింగ్ ఎలా వుందో తెలుసుకుంటు హరీష్ రావు  నియోజవర్గంలోని  గ్రామాలు తిరుగుతున్న సమయంలో  గుర్రాలగొంది గ్రామం వద్ద మంత్రి కేటీఆర్, హరీశ్ రావుల కాన్వాయ్ లు  ఎదురెదురుగా వచ్చాయి. దీంతో ఇద్దరు కార్లు దిగి రానున్న మెజారిటీపై ముచ్చటించుకున్నారు. 
అంతేకాదు నీకు వచ్చే మెజారిటీలో కనీసం సగం మెజారిటీ అన్న తెచ్చుకొంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల పోతున్నానను.. మీ వాళ్లంతా అక్కడ నీ కోసం ఎదురుచూస్తున్నారని హరీష్ రావుతో కేటీఆర్ అన్నారు. 
ఈ మాటలు అనగానే  హరీష్ రావు నవ్వుతూ ఆప్యాయంగా  కేటీఆర్ ను హత్తుకొన్నారు. వీరిద్దరి మధ్య సంభాషణను విన్న కార్యకర్తలు  సరదాగా నవ్వుకున్నారు.
 

Don't Miss