టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా

Submitted on 13 June 2019
TRS MP nama nageswara rao elected Lok Sabha LP leader

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కె.కేశవరావు, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేతగా నామా నాగేశ్వరరావు ఎంపికయ్యారు. జూన్ 17వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 13వ తేదీ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశాల్లో పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. 

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నామా వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, విభజన హామీలపై కేంద్రంపై వత్తిడి తీసుకరావడం..అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని..ఇందుకు నామా కరెక్టు వ్యక్తి అని ఆయన భావించారు. ఇదిలా ఉంటే..లోక్ సభ, రాజ్యసభలో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్ ను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

2003లో టీడీపీలో చేరారు నామా నాగేశ్వరరావు. 2004 నుంచి 2014 వరకు టీడీపీ తరపున లోక్‌సభకు మూడుసార్లు పోటీ చేశారు. 2009లో ఒక్కసారి విజయం సాధించారు. 2014లో నాలుగో స్థానానికి పరిమితమైంది టీఆర్ఎస్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారు. 

2009లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు నామా. 2014 ఎన్నికల సమయంలో నామా - తుమ్మల లు..ఇద్దరూ టీడీపీలోనే ఉన్నా ఒకరికి ఒకరు సహకరించుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యారనే వాదన ఉంది. ఇక.. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. తర్వాత జరిగిన పరిణామాలతో నామా కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకుని ఎంపీగా గెలుపొందారు. 

trs mp
nama nageswara rao
elected
Lok Sabha LP leader

మరిన్ని వార్తలు