ప్రగతి భవన్ దగ్గర టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

Submitted on 13 June 2019
TRT candidates concerned at Pragati Bhavan in hyderabad

హైదరాబాద్ ప్రగతి భవన్ దగ్గర టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసి, రిజల్ట్ ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వలేదని అభ్యర్థులు ధర్నాకు దిగారు. మూడు రోజుల క్రితమే పోస్టింగ్ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినా ఇంకా కార్యరూపం దాల్చలేదన్నారు. మళ్లీ విద్యావాలంటీర్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై నిరసన తెలుపుతున్నారు. విద్యావాలంటీర్లను తీసుకోవడానికి వ్యతిరేకంగా ప్రగతి భవన్ ను ముట్టడించారు. సెలక్ట్ అయిన తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

తమకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. పోరాటం చేసి సాధించుకున్న బంగారు తెలంగాణలో ఒక్క టీచర్ పోస్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, టీచర్లు లేరని స్కూల్స్ ను మూసివేస్తున్నారని.. టీచర్స్ రిక్రూట్ మెంట్ ఉంటే పిల్లలు స్కూల్ కు వస్తారని ప్రశ్నించారు.

పోస్టింగ్ ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. విద్యావాలంటీర్లను పక్కన పెట్టి రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోస్టింగ్ ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ధర్నా చేపట్టిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

TRT
Candidates
concerned
Pragati Bhavan
Hyderabad

మరిన్ని వార్తలు