నేడే EAMCET-2019 ఫలితాలు

Submitted on 9 June 2019
TS EAMCET 2019 Results To Be Released On June 9

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EAMCET-2019 ఫలితాలు ఆదివారం (జూన్ 9)న విడుదల కానున్నాయి. కూకట్ పల్లి JNTUలోని UGC ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య తెలిపారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

అభ్యర్థులకు EAMCETలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్‌ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీతో కలిపి ఎంసెట్‌ ర్యాంకులను వెల్లడిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు గత నెల (మే 3, 2019) నుంచి మే 9వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. 

TS EAMCET
results
released
June 9
2019

మరిన్ని వార్తలు