బీటెక్ అభ్యర్థులు అర్హులే : టీజీటీ పోస్టులపై హైకోర్టు తీర్పు

Submitted on 5 July 2019
TS Gurukul Notification 2019 Teacher Trained Graduate Posts

బీటెక్ అభ్యర్థులకు శుభవార్త. టీజీటీ పోస్టులపై హైకోర్టు తీర్పునిచ్చింది. పోస్టులకు వీరు కూడా అర్హులేనని ప్రకటించింది. గురుకులాల సొసైటీల్లో టీచర్డ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ (టీజీటీ) పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులే అర్హులని పేర్కొంది. దీనిపై ఖమ్మంకు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టు మెట్లు ఎక్కాడు. పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణకు అంగీకరించింది. 

2019, జులై 04వ తేదీ గురువారం జస్టిస్ అభినంద్ కుమార్ షావలి విచారణ చేపట్టారు. NCTE మార్గదర్శకాల ప్రకారం ఏదేని డిగ్రీలో పాస్ సాధించాల్సి ఉంటుందని..దీని ప్రకారం బీటెక్‌ను పరిగణలోకి తీసకోకుండా నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని పిటిషనర్ తరపు అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత సాధించినా..ఎంపిక ప్రక్రియలో పేర్లను చేర్చలేదన్నారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి NCTE 2004 నిబంధనల ప్రకారం TGT పోస్టుల భర్తీకి బీఏ, బీఎస్సీ, బీకాంతో పాటు బీటెక్ క్యాండిడేట్స్‌లను కూడా పరిగణలోకి తీసుకోవాలని తీర్పు వెలువరించారు. ఒకవేళ పిటిషనర్లకు అర్హతలు ఉంటే..వారిని టీజీటీ పోస్టులకు ఎంపిక చేయాలని సూచించింది కోర్టు. 

TS Gurukul
notification 2019
Teacher Trained Graduate Posts

మరిన్ని వార్తలు