Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Friday, June 29, 2018 - 20:27

గద్వాల : ఎందరో ప్రాణత్యాగాలతో సాకారమైన తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్‌. దేశంలోనే రైతాంగానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన సీఎం.. జిల్లాపై వరాల జల్లు కురిపించారు. 454 కోట్లతో చేపట్టిన ఈ పథకంతో 33వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

ఈ సందర్భంగా గద్వాలలో...

Friday, June 29, 2018 - 18:09

జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాలపై వరాల జల్లు కురిపించారు. గట్టు మండలంలోని రూ. 554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గద్వాలకు వరలా జల్లు కురిపించారు. 300 పడకల ఆసుపత్రిగా తయారు చేసేందుకు ఆదేశాలిస్తున్నట్లు..వంద కోట్ల రూపాయల గద్వాల కోసం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్...

Friday, June 29, 2018 - 17:57

జోగులాంబ గద్వాల్ : తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కలిసి రాలేదని...అభివృద్ధిలో కూడా కలిసి రావడం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గట్టు మండలంలోని రూ. 554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ మాట్లాడుతూ...కాంగ్రెస్ మాయమాటలు చెబుతున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు తెచ్చుకుంటున్నామని పేర్కొన్నారు. గట్టు...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Pages

Don't Miss