Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Thursday, January 4, 2018 - 06:39

జనగామ : జిల్లాలో సావిత్రి బాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీ బాయి పూలే అంటరానితనాన్ని నివారిస్తూ, మహిళల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు కేజీబీవీ జిల్లా కన్వీనర్‌ కల్పనాదేవి. సావిత్రీబాయిపూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆమె కోరారు. జిల్లా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

Thursday, December 28, 2017 - 13:09

జనగాం : జిల్లాలో 10టివి న్యూ ఇయర్ 2018 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ శ్రీదేవిసేన ఆవిష్కరించారు. 10 టివి క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. 10టివి యాజమాన్యానికి, సిబ్బందికి, జనగామ జిల్లా ప్రజలకు శ్రీదేవిసేన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  

Wednesday, December 27, 2017 - 20:41

దొంగది గాదు దొడ్లకు రాదన్నట్టు.. ఆ బట్టెవాయి మాటలు ఎందుకు మాట్లాడాలే మళ్ల ఎందుకు మత్పరియ్యాలే జనగామా ఎమ్మెల్యేగారూ..? విద్యల రిజర్వేషన్లు తీశేయాలని కుద్దుగ అంటివి మళ్ల.. డ్యాష్ కథలు వడవడ్తివి నేను అట్ల అనలేదు.. చేయలేదని.. ఒక్కదినంలనే మాటమార్చెటోనివి నువ్వు ఎమ్మెల్యే పదవి శిగ్గుదీస్తున్నవ్ గదా..? ప్రజలారా సూడుండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాగోతం..

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Sunday, December 24, 2017 - 15:05

జనగామ : జిల్లా కొడకండ్ల మండలం వెలిశాల వద్ద ఇల్లందు ఎమ్మెల్యే కోర కనకయ్య కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Saturday, December 9, 2017 - 16:10

జనగామ : కాలం మారినా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. ప్రపంచమంతా వాయు వేగంతో అభివృద్ధి వైపుకు దూసుకోపోతున్నా... ఇంకా కొన్ని గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కనిపించడం లేదు. భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన చిన్నారులు చదువుకునేందుకు తరగతి గదులు లేక చెట్ల కిందే చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ.. పాఠాలను అభ్యసిస్తున్న మీదికొండ స్కూల్‌ పరిస్థితిపై 10టీవీ...

Pages

Don't Miss