Wednesday, October 11, 2017 - 21:45

జనగామ : జనగామ జిల్లాను ప్రజలు పోరాడి సాధించుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. జనగామ జిల్లా అవతరణ దినోత్సవ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలో జనగామ పేరు లేదన్నారు. జనగామను జిల్లా చేయాలని ముందుగా ప్రతిపాదించింది సీపీఎం అన్నారు. పోరాట గడ్డను ముక్కలు చేద్దామనుకున్నా కేసీఆర్ కుట్రలను భగ్నం చేస్తూ జిల్లా ఏర్పాటుకు సీపీఎం...

Saturday, October 7, 2017 - 07:30

జనగామ : బడుగులు పిడుగులు కావాలి.. సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలి. ఎర్రజెండాలతో కలిసిరావాలి.. శుక్రవారం సీపీఐ పోరుయాత్రలో ఘనంగా ప్రారంభమైంది. జనగామ జిల్లాలో జరిగిన ప్రారంభ సభలో పలువురు నేతలు మాట్లాడారు. సామాజిక తెలంగాణ..సమగ్రాభివృద్ధి నినాదంతో ప్రారంభమైన ఈ యాత్ర మూడు నెలల పాటు కొనసాగనుంది. 31 జిల్లాల్లో 60 రోజుల పాటు పోరుబాట యాత్ర జరగనుది. సీపీఎం, జేఏసీ, టీమాస్‌, టీడీపీ...

Thursday, October 5, 2017 - 12:25

జనగాం : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వరంగల్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు వనపర్తి వెళ్తోంది. మార్గంమధ్యలో ఘన్ పూర్ మండలం చాగల్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ టీఎస్ రెడ్డి, ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు...

Wednesday, September 27, 2017 - 17:47

జనగాం : తన పేరుపైన ప్రభుత్వానికి సంబంధించిన గజం భూమి రిజిస్ట్రేషన్‌ అయినట్లు నిరూపించినా.. ఏ శిక్షకైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కలెక్టర్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కలెక్టర్‌ నిరాధార ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎంతో పాటు సీఎస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీని కోరతానని చెప్పారు. తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు...

Wednesday, September 27, 2017 - 08:40

హైదరాబాద్ : అధికారపార్టీనేతలు, ప్రజాప్రతినిధుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మీడియా సాక్షిగా నేతల అసలు రూపం జనం ముందుకు వస్తోంది. లీడర్లు ఆదర్శవంతంగా ఉండాలన్న ముఖ్యమంత్రి హితవులును బూడిదలోపోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. శాసనసభా పక్ష సమావేశాలు జరిగిన ప్రతిసారి సిఎం కెసిఆర్ నైతికపాఠాలతో దిశా నిర్దేశం చేస్తున్నా .. నేతల అవినీతి బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. అధికారులు...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Tuesday, September 19, 2017 - 15:18

జనగామ : జిల్లా కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. అధ్యాపకులు కలగజేసుకుని ఇరు వర్గాలకు బయటకు వెళ్లవలసిందిగా సూచించారు. అయితే బయటకొచ్చిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కర్ణాకర్‌పై పలువురు విద్యార్థులు దాడి చేశారు. ఎస్‌ఐ పరమేశ్వర్ అక్కడికి చేరుకుని దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Pages

Don't Miss