Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Sunday, May 6, 2018 - 12:48

మహబూబాబాద్ : షార్ట్ సర్క్యూట్ తో మిర్చీ గోదాంలో మంటలు చెలరేగాయి. మిర్చీ, పత్తి పంట అగ్నికి ఆహుతైంది. కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Friday, April 27, 2018 - 08:18

సిద్ధిపేట : తెలంగాణ పోలీసు శాఖలో అక్రమ సంబంధాల గుట్టు ఒక్కొక్కటిగా రట్టు అవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. వీరిలోకి పోలీసులు కూడ వస్తుండడం వ్యవస్థ ప్రతిష్టపై మచ్చ పడుతోంది. ఇటీవలే ఓ మహిళా ఎస్పీతో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు పలు ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా ప్రేమించి పెళ్లి...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Sunday, April 8, 2018 - 21:22

మహబూబాబాద్ : గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచడం సహా...

Thursday, April 5, 2018 - 17:01

మహబూబాబాద్‌ : జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన రసాభాసగా మారింది. కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణంలో భవనాలు కోల్పోతున్న బాధితులు.. మంత్రిని కలిసేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలో  నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌కు తమ గోడును వినిపించేందుకు బాధితులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. తమకు ప్రత్యామ్నాయ స్థలం...

Thursday, April 5, 2018 - 16:42

మహబూబాబాద్‌ : జిల్లాలో మంత్రులు కే.టి.ఆర్, కడియం, చందూలాల్‌కు చుక్కెదురైంది. ప్రైవేట్‌ యూనివర్సిటీల  బిల్లును వ్యతిరేకిస్తూ.. పట్టణంలోని కంకరబోర్డ్‌ సమీపంలో అఖిలపక్ష విద్యార్థులు మంత్రుల కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

Thursday, April 5, 2018 - 06:37

మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమంలో జగన్‌, చిరంజీవికి చుక్కల చూపిన గడ్డ మానుకోటని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మానుకోట వేదికగా సమైక్యవాదులను తరిమికొట్టిన ఘనత ఇక్కడి గిరిజన బిడ్డలకు దక్కుతుందన్నారు. ప్రతిపేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. గిరిజన తండాలను, ఆదివాసీ, కోయగూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కె దక్కుతుందన్నారు....

Pages

Don't Miss