Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Sunday, September 17, 2017 - 12:47

హైదరాబాద్ : నిజాం పాలనను వ్యతిరేకించిన ప్రజలు వాళ్లు. రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురుతిరిగి.. తుపాకీకి గుండెను చూపించిన ధైర్యవంతులు. తమ గ్రామంలోకి వచ్చిన నిజాం సైన్యాన్ని ఎదురించారు. అంతా ఒక్కటై రజాకార్లను తరిమికొట్టారు. కానీ రజాకార్లు నిరాయుధులైన ప్రజలపై విరుచుకుపడ్డారు. ఆ మారణ కాండలో 11 మంది అసువులు బాసి చరిత్రలో అమరులుగా నిలిచారు. అంతటి త్యాగమూర్తుల కుటుంబాలు.. ఇవాళ అత్యంత...

Saturday, September 9, 2017 - 21:26

మహబూబబాద్ : కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు ప్రజాపోరాటాలను అణచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అన్ని సంఘాలు కలిసి పని చేస్తేనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలమని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీ మాస్ ఫోరం సభలో తమ్మినేని పాల్గొన్నారు. అంతకు ముందు కొమురం భీం సెంటర్‌ నుంచి యశోద గార్డెన్...

Saturday, September 9, 2017 - 18:11

మహబూబబాద్ : బిజెపి అధికారంలోకి వచ్చాక మతోన్మాద శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రజాస్వామ్య వాదులు దారుణ హత్యకు గురవుతున్నారని తమ్మినేని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్య పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నతమ్మినేని... కేంద్రం అవలంభిస్తున్న అనేక విధానాలపై టీ మాస్ ఫోరం పోరాటం చేస్తుందని తెలిపారు. 

Monday, August 28, 2017 - 22:06

మహబూబాబాద్ : ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్‌ ప్రీతి మీనా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ఎంపీడీవో కార్యాలయంలో పెద్దవంగర మండలాల అభివృద్ధి పనుల పురోగతి సమీక్షించిన ఎర్రబెల్లి.... కలెక్టర్‌ పని తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అయితే... తాము అన్నీ పనులు...

Friday, August 25, 2017 - 07:01

మహబూబాబాద్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేశ్‌లను పూజించాలంటూ మహబూబాబాద్‌లో నేను సైతం స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ప్రచారం చేపట్టింది. పట్టణానికి చెందిన ముస్లిం దంపతులు సుభానీ, సలీమా ఈ కార్యక్రమం చేపట్టారు. మట్టితో చేసిన వినాయకుడి ముఖాన్ని సుభానీ తన తలకు పెట్టుకుని రిక్షాపై కూర్చుని ప్రచారం చేస్తున్నా అందర్ని ఆకర్షిస్తున్నాడు. 

Monday, August 7, 2017 - 13:18

మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరులో అక్రమ రేషన్ బియ్యం ముఠా గుట్టురట్టైంది. 10టివి ప్రతినిధుల చొరవతో బండారం బయపడింది. లారీ సహా 440 బస్తాల రేషన్ బియ్యన్ని సీజ్ చేశారు. తొర్రూరు కేంద్రంగా ఏపీ, చత్తీస్ ఘడ్ కు బియ్యం తరలిపోతున్నాయి. పోలీసులు సీజ్ చేసిన బియ్యాన్ని సైతం ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజారత్న విచారణ చేపట్టారు. మరింత...

Pages

Don't Miss