Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Sunday, January 7, 2018 - 12:39

మహబూబాబాద్ : మరో వారం రోజుల్లో కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. దాదాపు 10 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న ట్రైయినింగ్ సెంటర్ ప్రారంభించారు. 

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Sunday, December 17, 2017 - 10:50

మహబూబాబాద్‌ : ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. మహబూబాబాద్‌లో ఉంటున్న అరుణ్‌.... హైదరాబాద్‌లో ఉన్న మైనర్‌ బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులు మహబూబాబాద్‌లో ఉంచి... ఆ తర్వాత యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత... శివానిని అరుణ్‌ వదిలేశాడు. నీతో ఎలాంటి...

Friday, December 15, 2017 - 18:06

మహబూబాబాద్ : జిల్లా మునికిచెర్ల దగ్గర మావోయిస్టు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు కోమళ్ల శేషగిరిరావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూర్‌ మండలం వెలకట్టే గ్రామానికి చెందిన శేషగిరిరావు.. ఆర్థిక ఇబ్బందులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులంటున్నారు. శేషగిరిరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Saturday, December 9, 2017 - 17:46

మహబూబాబాద్ : తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సరైన వైద్యం అందక నిండు ప్రాణం బలైంది. తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన దశరథ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగుమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందుబాటులో లేకపోడడంతో నర్సులు చెట్టుకిందనే వైద్యం చేశారు. దీంతో సరైన వైద్యం అందక దశరథ చనిపోయాడు. మృతుడి బంధువులు...

Friday, December 1, 2017 - 13:36

మహబూబాబాద్ : జిల్లాలో విషాదం నెలకొంది. పోలీసులు మోసగించారని ఓ రియలర్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లికుదురు మండల కేంద్రంలో రియల్టర్ తిరుమల్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ కు చెందిన ఏఎఎస్ ఐ వెంకటేశ్వరరెడ్డి, సీఐ మోహన్ కారణమంటూ సూసైట్ నోట్ లో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనను పోలీసులు మోసగించారని సూసైట్ నోట్ రాశారు. అప్పుల బాధ పెరిగిపోయిందని తిరుమలరావు ఆవేదన...

Pages

Don't Miss