Wednesday, July 12, 2017 - 20:33

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరు వివాదాస్పదమైంది. హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్..కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హరితహారం కార్యక్రమంలోనే సిబ్బంది ఆందోళనకు దిగారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర మనస్థాపం చెందిన కలెక్టర్ ప్రీతిమీనా..ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టర్‌కు జరిగిన...

Sunday, July 9, 2017 - 09:37

మహబూబాబాద్‌ : జిల్లాలోని నెల్లికుదురు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. ఉదయం కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్ధినులకు పురుగులతో కూడిన అన్నం వడ్డించడంతో వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సరైన భోజన ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరచూ తమ పిల్లలు...

Thursday, June 29, 2017 - 19:39

మహబూబబాద్ : జిల్లాలోని దంతాలపల్లిలో గొడ్డలి యాకయ్య అనే వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారు. యాకయ్య అరాచకాలకు పాల్పడుతున్నందుకే ఆ శిక్ష విధించామని మావోయిస్టుల పేరుతో లేఖ ఆయన జేబులో ఉంది. ఆ లేఖ మావోయిస్టు పార్టీ సూర్యాపేట కమిటీ పేరుతో ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాకయ్య మృతదేహనికి వైద్యులు పొస్టుమార్టం పూర్తి చేశారు. యాకయ్య శరీరంలో వైద్యులు బుల్లెట్ ను గుర్తించారు...

Monday, June 19, 2017 - 21:23

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...

Tuesday, June 13, 2017 - 12:13

మహబూబాబాద్ : జిల్లా కేంద్రలో జరుగుతున్న టెన్త్ సప్లిమెంటరీ పేపర్ లీక్ అయింది. అటు ఖమ్మం జిల్లా గార్లలో టెన్త్ మ్యాథ్స్ సప్లిమెంటరీ పేపర్ లీక్ అయింది. ఆ రోజు మ్యాథ్స్ పేపర్ కావడంతో ఉదయం 10.30 నిమిషాలకు పేపర్ లీక్ అయనట్టు తెలుస్తోంది. జిరాక్స్ సెంటర్ పేపర్ జిరాక్స్ చేస్తుండగా లీక్ పేపర్ లీక్ అయనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారులు పేపర్ లీకేజీ పై ఎటువంటి ప్రకటన చేయలేదు....

Thursday, June 8, 2017 - 12:29

మహబూబాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో నకిలీ పత్తి విత్తనాల ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్ టివి సమాచారంతో తొర్రూరు సీఐ ఆధ్వర్యలో నకిలీ విత్తనాల తయారీ కేంద్రంలో దాడులు నిర్వహించారు. విత్తనాలు చీడ పీడలను తట్టుకుంటాయని నమ్మబలికి, రూ.800అమ్మాల్సిన పత్తి విత్తనాలను బీటి పేరుతో రూ.1200 అమ్ముతున్నారు. నకిలీ విత్తనాలు పక్కనున్న ఏపీ రాష్ట్రంలోకి...

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, June 1, 2017 - 10:35

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Friday, March 10, 2017 - 19:12

మహబూబాబాద్: తెలంగాణ పల్లెల్లో గొంతెండుతోంది. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో మంచినీటి కోసం జనం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండో పంటకు నీరివ్వడం వల్లే గ్రామంలో మంచినీటి కొరత ఏర్పడిందన్నారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తామన్న పాలకులు.. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల ప్రజల మంచినీటి కష్టాలపై...

Wednesday, March 8, 2017 - 17:35

హైదరాబాద్: దళితులకు మూడు ఎకరాల భూమి. ఇది టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అంతే. ఆ ఒక్క రోజు సంబరంతోనే సరిపెట్టింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అటకెక్కించింది. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే, ప్రయివేట్ భూమి కొనైనా సరే, ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడేసి ఎకరాల చొప్పున పంపిణీ...

Pages

Don't Miss