Monday, November 12, 2018 - 11:10

మేడ్చల్‌ : ’ఓట్ల కోసం మా గ్రామానికి రావొద్దు’ అని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఓట్ల కోసం ’మా వద్దకు రావద్దని, స్థానిక సమస్యలను పరిష్కరిస్తేనే రాజ్యాంగ హక్కును వినియోగించుకుంటాము’ అని జిల్లాలోని జవహర్‌నగర్‌ వాసులు ఆందోళన చేపట్టారు. జవహర్‌నగర్‌ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌ బస్తీవాసులు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయొద్దని ఆదివారం నిర్ణయించారు. 10...

Sunday, October 28, 2018 - 22:15

మేడ్చల్‌ : జిల్లా గోదుమకుంటలోని ఓ ఆశ్రమంలో యువతి అదృశ్యం అయింది. 24 ఏళ్ల చందన అనే యువతిని తల్లి మంగాదేవి ఒమోజయ బాబా ఆశ్రమంలో రెండు నెలల క్రితం వదిలివెళ్లింది. తనకూతిరిని చూపించాలంటూ మంగాదేవి ఆశ్రమ నిర్వాహకులను కోరగా వారు నిరాకరించారు. దీంతో మంగాదేవి పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమం దగ్గర భారీగా...

Monday, October 15, 2018 - 12:22

మేడ్చల్ : జిల్లాలోని జవహర్ నగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గోనెసంచిలో పెట్టి కాల్చి వేశారు. చెన్నాపురం చెరువులో నీళ్లు లేని గుంతలో కాలిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలిన గాయాలతో వ్యక్తి అనుమానాస్పద మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తిని హత్య చేసి గోనెసంచిలో పెట్టి కాల్చి వేశారు. సమాచారం తెలుసుకున్న క్లూస్ టీమ్‌తో 
...

Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Saturday, August 18, 2018 - 18:32

మేడ్చల్ : జిల్లాలోని జవహర్ నగర్ లో దారుణం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శాంతినగర్ కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Wednesday, August 15, 2018 - 13:26

మేడ్చల్ : షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టాటాఏసీ ఆటో ఢీకొనడంతో ..ముందుకు వెళ్తున్న లారీ కిందపడి ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారి తుకుంటా గ్రామంలోని అలంకృత రిసార్ట్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Sunday, August 5, 2018 - 21:48

మేడ్చల్‌ : జిల్లాలోని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. చింతల దశరథం తనను వేధిస్తున్నాడంటూ వార్డర్‌ శ్రీనివాస్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. నిజాయితీగా ఉన్నందుకు తనను వేధిస్తున్నాడని శ్రీనివాస్‌ సెల్ఫీ వీడియో తీసి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన నెలకొంది. దశరథం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని శ్రీనివాస్‌ తన సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు. 

Sunday, August 5, 2018 - 09:32

మేడ్చల్ : జవహార్ నగర్ పీఎస్ పరిధిలోని అరుంధినగర్ లో ఓ మహిళ గొంతు కోశారు. ఉష అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన మైనర్ అబ్బాయిలు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే ఉష గొంతు కోసి పరారయ్యారు. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె గొంతు ఎందుకు కోశారో ? తెలియరాలేదు. పరారయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డారో...

Friday, August 3, 2018 - 13:13

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ లో మరో విషాదం చోటు చేసుకుంది. మరొక విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం గోడ కూలిపోవడంతో గురువారం ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న ఒక విద్యార్థి శుక్రవారం మృతి చెందాడు. దీనితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు...

Sunday, July 22, 2018 - 09:44

మేడ్చల్‌ : జిల్లాలోని కీసర మండల కేంద్రంలో వృద్ధురాలిని ఆగంతకులు హత్య చేశారు. కుతడి పెద్దమ్మను గొంతు నులిమి చంపి నగలను దోచుకెళ్ళారు దుండగులు.  మృతురాలిది యాదాద్రి జిల్లా మల్యాల గ్రామం. కాగా.. కూతురిని చూడటానికి వచ్చిన పెద్దమ్మ దుండగుల చేతిలో హతమైందని బంధువులు ఆవేదన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ ల్యాబ్, డాగ్‌స్క్వాడ్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు....

Pages

Don't Miss