Saturday, October 21, 2017 - 15:40

మేడ్చల్ : జిల్లాలోని ఘట్ కేసర్ మండలంలోని ఎన్ఎఫ్ సి నగర్ లో సర్పంచ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లుగా పదవిలో ఉన్నా ఏ ఒక్క పని కూడా పూర్తి చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు పాడై గ్రామమంతా మురుగుమయంగా మారిపోయిందని తెలిపారు. ఆయా సమస్యలపై వారు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించలేకపోతే పదవి నుండి తప్పుకోవాలని డిమాంండ్ చేశారు. ఎన్నికల సమయంలో...

Wednesday, October 18, 2017 - 18:00

మేడ్చల్ : జిల్లాలోని ఎల్లంపేటలో విషాదం చోటు చేసుకుంది. పోచమ్మ ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి చనిపోయాడు. బాలుడు సంపులో పడిన విషయం కుటుంబసభ్యులు గమనించేసరికి బాలుడు కన్నుమూశాడు. 

Monday, October 16, 2017 - 12:26

మేడ్చల్ : రెండు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని జశ్వాని అదృశ్యమైంది. శనివారం జశ్వాని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ ఎదుట ఆమె తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Sunday, October 15, 2017 - 11:07

 

మేడ్చల్ : జిల్లా మేడిపల్లి పరిధిలో ఇంటర్ విద్యార్థిని సాయిప్రజ్వల అదృశ్యమైంది. ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిపోయిన సాయిప్రజ్వల ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయిప్రజ్వల బయటకు వెళ్లిన సీసీ ఫుటేజీలు పోలీసులు స్వాధీనం చేసుకుని విద్యార్థిని ఎటు వెళ్లిందో అని దర్యాప్తు...

Saturday, October 14, 2017 - 12:53

మేడ్చల్ : జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజీగూడలో లారీ బీభత్సం సృష్టించింది. రాంగ్‌సైడ్‌ నుంచి దూసుకొచ్చిన లారీ.. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి, లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Wednesday, October 11, 2017 - 13:26

 

మేడ్చల్ : జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై తలసాని కారుకు ప్రమాదం జరిగింది. తలసాని కారును గుడ్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి తలసాని క్షేమంగా బయటపడ్డారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కలెక్టరేట్ భవనం శంకుస్థాపనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Tuesday, October 10, 2017 - 12:10

 

మేడ్చల్ : జిల్లాలో దారుణం జరిగింది. గుంటూరు చందిన ఓ యువకున్ని దారుణంగా హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. గట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గుంటూరు తరలించాలని కుటుంబ సభ్యులకు నిందితులు వార్నింగ్ ఇచ్చాని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, October 9, 2017 - 10:08

మేడ్చల్ : జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో డిజిటల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. రూ.10 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు యాజమాన్యం చెబుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఐదు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Monday, October 9, 2017 - 08:45

మేడ్చల్‌  : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు.  కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ మరో నిజాం నవాబులా మారారని సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం విమర్శించారు. కేబినెట్‌లో ఒక్క...

Pages

Don't Miss