Sunday, August 20, 2017 - 18:40

మేడ్చల్  : రెండు నెలల క్రితం అదృశ్యమైన సాయి సృజన్‌ కేసు మిస్టరీ వీడింది. మేడ్చల్‌ జిల్లా మీర్పేట్‌ హౌసింగ్‌ బోర్డ్‌లో ఇంట్లో నుండి క్రికెట్‌ పై మోజుతో ఇంట్లో చెప్పకుండా తప్పించుకున్నాడు. అనంతరం ఎక్కడికి వెళ్లాలో తెలియక క్రికెట్‌ కోసం ముంబై వెళ్లిఉంటాడని పోలీసులు అనుమానించారు. దీంతో ముంబై పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడి పోలీసులు గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం తెలిపారు. ...

Sunday, August 20, 2017 - 18:35

మేడ్చల్‌ : జిల్లాలో ఓ ఇంట్లో భారీ చోరి జరిగింది. నేరెడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సైనిక్‌ విహార్‌లో ఓ ఇంటికి తాళం పగుల కొట్టి బంగారు ఆభరణాలు, వెండి నగదు దోచుకెళ్లారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తో పరిశీలిస్తున్నారు.

 

Saturday, August 19, 2017 - 14:53

మేడ్చల్‌ : 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. మిత్రుడితో కలిసి మణిందర్‌ స్కూల్‌కు వెళ్తుండగా కిడ్నాపర్లు.. బాలుడిని అహరించారు. కిడ్నాపర్లు 10 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, August 16, 2017 - 13:30

మేడ్చల్ : మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని... మంత్రి కేటీఆర్ తెలిపారు.. ప్రజలపై ఎలాంటి భారం పడకుండానే ఈ పనులు చేపడుతున్నామని ప్రకటించారు.. కొంపల్లిలో మిషన్‌ భగీరథ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.. ఈ ప్రాజెక్టుద్వారా అవుటర్‌ రింగ్‌ రోడ్‌ గ్రామాలకు తాగునీరు అందనుంది.. లక్షా 50వేల కుటుంబాలు లబ్ది పొందనున్నారు.. 628 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు పనులకు...

Sunday, August 13, 2017 - 19:37

మేడ్చల్ : జిల్లాలోని జవహర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సైనికుని భూమిని కొందరు కబ్జాకోరులు ఆక్రమించారు. సంతోష్‌నగర్‌ కాలనీలో గల సర్వే నంబర్ 423, 424 లో ఉన్న భూమిని స్థానిక రాజకీయ నేతలు కబ్జా చేశారని మాజీ సైనికుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డుపై పడ్డ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

 

Tuesday, August 8, 2017 - 13:35

మేడ్చల్ : మూడు చింతలపల్లికి గోదావరి జలాలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం మాట్లాడారు. మేడ్చల్ జిల్లాలో 374 చెరువులను నింపుతామని చెప్పారు. మూడు చింతలపల్లిలో ప్రాథకమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వారంలో పీహెచ్ సీ భవనానికి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గోదావరి నది నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లు...

Friday, August 4, 2017 - 21:16

మేడ్చల్ : రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలిచ్చే పరిస్థితి పోతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. వ‌చ్చే ఏడాది గోదావ‌రి జ‌లాల‌తో ల‌క్ష్మాపూర్ చెరువును నింపుతామ‌ని సీఎం చెప్పారు. ల‌క్ష్మీదేవి ల‌క్ష్మాపూర్ గ్రామంలో తాండ‌వించాల‌ని అన్నారు. 365 రోజులు ల‌క్ష్మాపూర్ చెరువు నిండుగా ఉంటుంద‌...

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Pages

Don't Miss