Tuesday, May 1, 2018 - 13:22

మేడ్చల్‌ : రాష్ట్రంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జిల్లాలోని కండ్లకోయ దగ్గర ఔటర్‌ రింగ్‌రోడ్డు ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండు స్కైవేలు నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. అందుకు వంద ఎకరాల రక్షణ శాఖ స్థలం కావాలని 
కేంద్రాన్ని అడిగితే వాటికి తగిన భూమి ఇవ్వాలని కోరగా ఆరు వందల...

Friday, April 27, 2018 - 21:56

హైదరాబాద్ : అవినీతి ఆరోపణలతో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ సర్కారుపై స్వరం మరింత పెంచారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే అన్న ధీమాతో ఉన్న ఉత్తమ్‌... పవర్‌లోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై విచారణ జరిపిస్తామన్న వాదాన్ని వినిపిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు...

Friday, April 27, 2018 - 21:41

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ విజయవంతంగా ముగిసింది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం, ఇంటింటికి సంక్షేమం-ప్రతి ముఖంలో సంతోషం' లాంటి తీర్మానాలు ఇందులో ఉన్నాయి.

ఆరు తీర్మానాలకు ప్లీనరీ ఆమోదం...

Friday, April 27, 2018 - 21:35

మేడ్చల్ : దేశ రాజకీయాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు గులాబీ దళపతి. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న తన ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో దడ పుట్టిందన్నారు.

...

Friday, April 27, 2018 - 19:45

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఉత్తమ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని చెప్పుకొచ్చిన ఉత్తమ్‌కు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ప్రగతి భవన్‌లో 15 గదుల కంటే ఎక్కువ గదులు ఉంటే తాను ముక్కు నేలకు రాసి సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు కేసీఆర్‌. 

Friday, April 27, 2018 - 19:43

మేడ్చల్ : కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్యందరికీ టికెట్లు ఇస్తానని ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎంబీసీలకు ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్‌ పదవులిస్తామన్నారు కేసీఆర్‌. హైదరాబాద్‌ కేంద్రంగానే దేశ రాజకీయాలను...

Thursday, April 26, 2018 - 21:42

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భాగ్యనగరం ముస్తాబైంది. కొంపల్లిలో జరిగే ప్లీనరీకి దారితీసే రోడ్లన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నగరం మొత్తం గులాబీవర్ణంతో శోభాయమానంగా మారింది.

టీఆర్‌ఎస్‌ ...

Thursday, April 19, 2018 - 12:43

మేడ్చల్ : కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... మేడ్చల్‌ జిల్లా శమిర్‌పేట్‌ మండలం బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ ధర్నా నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు సీఐటీయూ నేతలు తరలి వచ్చారు. దీంతో పోలీసులు సీఐటీయూ నేతలను అరెస్ట్‌ చేశారు. 

Tuesday, April 17, 2018 - 07:41

మేడ్చల్ : మహిళలపై దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచారం, హత్యలను నిరసిస్తూ మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో సామాజిక,ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. అక్కడ జరిగిన క్యాండిల్‌ ర్యాలీలో విమలక్క పాల్గొన్నారు. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అత్యాచారాలకు...

Sunday, April 15, 2018 - 17:49

మేడ్చల్‌ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించారు. గత ఎన్నికల్లో  ఇచ్చిన హామీలను నెరవేర్చేలా టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

Pages

Don't Miss