Thursday, April 19, 2018 - 12:43

మేడ్చల్ : కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... మేడ్చల్‌ జిల్లా శమిర్‌పేట్‌ మండలం బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ ధర్నా నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు సీఐటీయూ నేతలు తరలి వచ్చారు. దీంతో పోలీసులు సీఐటీయూ నేతలను అరెస్ట్‌ చేశారు. 

Tuesday, April 17, 2018 - 07:41

మేడ్చల్ : మహిళలపై దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచారం, హత్యలను నిరసిస్తూ మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో సామాజిక,ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. అక్కడ జరిగిన క్యాండిల్‌ ర్యాలీలో విమలక్క పాల్గొన్నారు. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అత్యాచారాలకు...

Sunday, April 15, 2018 - 17:49

మేడ్చల్‌ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించారు. గత ఎన్నికల్లో  ఇచ్చిన హామీలను నెరవేర్చేలా టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Monday, April 2, 2018 - 19:12

మేడ్చల్ : జిల్లాలో విషాదం నెలకొంది. ప్రహరీగొడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. శామీర్ పేట మండలం లాల్ గుడి మలక్ పేటలో నిన్న కురిసిన వర్షాలకు నాని ప్రహరీ గొడ కూలింది. దీంతో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా జోత్స్నప్రియ (5), శిరీష (4) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

 

Thursday, March 29, 2018 - 18:24

మేడ్చల్ : కేజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పేద పిల్లలకు వైద్యం అందించడం కోసమే క్యాంప్ ఏర్పాటు చేశామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 

Sunday, March 25, 2018 - 17:58

మేడ్చల్‌ : దుండిగల్‌లో పోలీసులు భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక రాష్ట్రం బీదర్‌ నుంచి కొంపల్లికి మారుతి వ్యాన్‌లో గుట్కా, తంబాకు ప్యాకెట్లను కొంతమంది అక్రమంగా తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న బాలానగర్‌ ఎస్‌వోటీ, దుండిగల్‌ పోలీసులు కాపుకాసి వాహనాన్ని పట్టుకున్నారు. సుమారు 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జెస్సారాం...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Pages

Don't Miss