Wednesday, March 14, 2018 - 18:01

మేడ్చల్‌ : జిల్లాలోని జవహార్‌ నగర్‌ లో దారుణం చోటు చేసుకుంది. కౌకుర్‌ భరత్‌ నగర్‌లో 9వ తరగతి చదువుతున్న మణి అనే బాలుడుని తండ్రి ప్రహ్లాద్‌ చితక బాదడంతో బాలుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. తండ్రి ప్రహ్లాద్‌ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. 

Wednesday, March 14, 2018 - 17:56

మేడ్చల్‌ : జిల్లాలోని కాప్రా పరిధిలోని తులసి ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన జమాల్‌ అనే వ్యక్తికి ఆరోగ్య శ్రీ కార్డు రాలేదని వైద్యం చేయడానికి నిరాకరించారు డాక్టర్లు. దీంతో  వైద్యం అందక జమాల్‌ ఆస్పత్రిలోనే మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జమాల్‌ మృతి చెందాడని బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. కోపంతో ఆస్పత్రిలోని అద్దాలు ధ్వంసం...

Sunday, March 11, 2018 - 06:56

మేడ్చల్‌ : జిల్లా జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్ ఆదేశాలమేరకు... రౌడీషీటర్లు, సంఘ విద్రోహకశక్తులు, తప్పించుకు తిరుగుతున్న నేరస్థులు లక్ష్యంగా తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు ఐదు వందల మంది పోలీసు అధికారులు ఈ కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. 

Sunday, March 4, 2018 - 13:13

మేడ్చల్‌ : జిల్లాలోని ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జబర్దస్త్‌ కామిడీ యాక్టర్‌ కార్తిక్, బుల్లితెర నటి కీర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. 

Saturday, March 3, 2018 - 15:37

మేడ్చల్ : జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డీసీఎం, నిల్వ ఉంచిన టైర్లు, ఆయిల్ కాలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఆఫీస్ పక్కనే అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. పెద్దగా ఆస్తినష్టం జరగలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Saturday, February 24, 2018 - 20:45

మేడ్చల్‌ : జిల్లాలోని మల్కాజిగిరి మౌలాలీలోని గాంధీ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. చాక్లెట్‌ ఆశ చూపి చిన్నారులను ఎత్తుకెళ్లేందుకు నలుగురు యువకులు యత్నించారు. పిల్లలను ఎత్తుకొని పారిపోతుండగా చిన్నారులు అరవడంతో స్థానికులు యువకులను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 

 

Wednesday, February 21, 2018 - 11:22

మేడ్చల్ : జిల్లా చర్లపల్లిలో ఏపీటెట్ సెంటర్ గందరగోళంగా మారింది. ఆఖరి నిమిషంలో అధికారులు ఎగ్జామ్ సెంటర్ ను మార్చారు. హయత్ నగర్ వివేకానంద ఇన్ స్టిట్యూట్ కు సెంటర్ ను మార్చారు. దీంతో అభ్యర్థులు ఆవేదనకు గురైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Sunday, February 18, 2018 - 17:23

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ మండలం కొర్రెముల మూసీ కాల్వలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ మెట్ కి చెందిన జవాజీ బాలమణిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నా పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Tuesday, February 13, 2018 - 18:45

మేడ్చల్ : కీసరగుట్టలో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి.. ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వేగంగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss