Saturday, February 10, 2018 - 10:27

మేడ్చల్ : జిల్లాలోని మేడిపల్లి పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్‌ ఉదయం 4 గంటల నుంచి ఇందిరానగర్, రాజీవ్‌నగర్, అంబేడ్కర్ నగర్, దేవేందర్‌నగర్‌ కాలనీల్లో తనిఖీలు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

 

Tuesday, February 6, 2018 - 14:18

మేడ్చల్ : ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.. ఆర్థిక ఇబ్బందులు..ఇతరత్రా కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..ఒక్కోసారి కుటుంబం కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరం. తాజాగా మరొక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కీసర మండలంలో చోటు చేసుకుంది. పెద్దమ్మ చెరువులోకి ఒక కుటుంబం దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో భార్య భర్తలు..ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరందరూ ఘట్ కేసర్ మండలం...

Sunday, February 4, 2018 - 11:11

మేడ్చల్ : జిల్లా.. కాప్రా మండలం.. జవహర్‌నగర్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు నవీన్‌పై దాడి చేశాయి. అలాగే మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాయి. రోడ్లపై పందులు, కుక్కలు సంచరిస్తున్నా గ్రామాధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా గ్రామాధికారులు తక్షణమే స్పందించి.. చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Friday, February 2, 2018 - 08:58

మేడ్చల్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సుమా రెసిడెన్సీ కాలనీలో ఉన్న ఓ ఇంటికి తాళం వేసింది. శుక్రవారం తెల్లవారుజామున దొంగలు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రూ. 4లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. చోరీ జరగిన ప్రదేశంలో ఆధరాలు సేకరించే ప్రయత్నం...

Wednesday, January 31, 2018 - 15:41

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ సమీపంలోని శివన్నగూడెంలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. డానో వ్యాక్సిన్ బయలాజికల్ కెమికల్ కంపెనీలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న డానో కంపెనీలో అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Wednesday, January 31, 2018 - 10:18

హైదరాబాద్ : ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. వీరిలోకి పోలీసులు కూడ వస్తుండడం వ్యవస్థ ప్రతిష్టపై మచ్చ పడుతోంది. ఇటీవలే ఓ మహిళా ఎస్పీతో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసుపై డీసీపీకి ఫిర్యాదు అందింది.

ఓ కేసు నిమిత్తం జవహార్ పీఎస్ కు తన భార్యతో కలిసి వెళ్లడం...

Tuesday, January 30, 2018 - 07:36

మేడ్చల్ : ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. మద్యం తాగి కారు డ్రైవింగ్‌ చేయడమే తప్పు కాగా... రాంగ్‌ రూట్లో వచ్చి వాహనాల మీదకు దూసుకెళ్ళాడు. యాక్టివా వాహనంపై వెళ్తున్న దంపతుల కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది....

Pages

Don't Miss