Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Friday, December 22, 2017 - 16:09

మేడ్చల్ : జిల్లాలోని కుషాయిగూడలోని ఓక్‌వాలె పాఠశాల ఆన్యూవల్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

 

Sunday, December 17, 2017 - 10:31

మేడ్చల్ : జిల్లాలోని ఆల్వాల్ నారాయణ హైస్కూల్‌లో టీచర్ కొట్టడంతో విద్యార్థికి గాయాలయ్యాయి. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో.. బెంచ్ పక్కన రాడ్ తలకు తగడలంతో... తీవ్రగాయమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స చేయించారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 

 

Thursday, December 14, 2017 - 12:15

మేడ్చల్ : వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని పేర్కొంటూ హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై బంధువులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఫీర్జాదిగూడలో అంకుర ఆసుపత్రిలో అంకుర ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. బాలుడి మృతదేహంతో కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీనితో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

 

Tuesday, December 12, 2017 - 13:38

మేడ్చల్ : డంపింగ్‌ యార్డును ఎత్తివేయాలని..అక్రమ పవర్ ప్లాంట్ నిర్మించవద్దని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌ డంపింగ్ యార్డు వద్ద ప్రజా సంఘాలు చేపట్టిన మహా ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచి సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. డంపింగ్ యార్డు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

 

Sunday, December 10, 2017 - 16:17

మేడ్చల్‌ : విద్యార్థులు చార్మినార్‌ చూడటానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. స్కూల్‌ బస్సులో విద్యార్థులు సిరిసిల్ల నుంచి హైదరాబాద్ లోని చార్మినార్‌ చూడటానికి వస్తున్నారు. మార్గంమధ్యలో మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌ వద్ద ముందు వెళ్తోన్న స్కూల్‌ బస్సును వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ...

Tuesday, December 5, 2017 - 12:37

మేడ్చల్ : న్యాయం కోసం సంగీత పోరాటం కొనసాగుతుంది. పాపతో పాటు భర్త ఇంటి ముందు సంగీత న్యాపోరాటం చేస్తోంది. ఆమె పోరాటానికి నేడు 17వ రోజుకు చేరుకుంది. అది కుటుంబ సమస్య ఇక చేసేదేం లేదని ఎంపీ, ఎమ్మెల్యే అంటున్నారు. సంగీత మామ బాల్ రెడ్డి ఆస్తిలో చిల్లగవ్వకూడా ఇవ్వనని, సంగీతను కోడలిగా అంగీకరించనని తెగెసి చెబుతున్నాడు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss