Wednesday, October 11, 2017 - 13:26

 

మేడ్చల్ : జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై తలసాని కారుకు ప్రమాదం జరిగింది. తలసాని కారును గుడ్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి తలసాని క్షేమంగా బయటపడ్డారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కలెక్టరేట్ భవనం శంకుస్థాపనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Tuesday, October 10, 2017 - 12:10

 

మేడ్చల్ : జిల్లాలో దారుణం జరిగింది. గుంటూరు చందిన ఓ యువకున్ని దారుణంగా హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. గట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గుంటూరు తరలించాలని కుటుంబ సభ్యులకు నిందితులు వార్నింగ్ ఇచ్చాని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, October 9, 2017 - 10:08

మేడ్చల్ : జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో డిజిటల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. రూ.10 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు యాజమాన్యం చెబుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఐదు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Monday, October 9, 2017 - 08:45

మేడ్చల్‌  : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు.  కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ మరో నిజాం నవాబులా మారారని సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం విమర్శించారు. కేబినెట్‌లో ఒక్క...

Thursday, September 28, 2017 - 15:44

మేడ్చల్ : ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యపై జరిగిన దాడిపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో కంచె ఐలయ్యకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజాసంఘాల కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఐలయ్యపై దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో తమ భావాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని.... నేడు ఆ హక్కుకే ముప్పువాటిల్లే ప్రమాదమేర్పడిందని అన్నారు. తమ అభిప్రాయాలను...

Thursday, September 28, 2017 - 12:45

మేడ్చల్ : బోడుప్పల్‌లో బోడుప్పల్ మున్సిపాలిటీ కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మహా బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం దంపతులు, ఐద్వా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ బి హైమావతి పాల్గొన్నారు. కోదండరాం దంపతులు , హైమావతి బతుకమ్మ ఆడి సందడి చేశారు. సద్దులబతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించాలన్న కోదండరామ్‌.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. 

Thursday, September 28, 2017 - 12:31

మేడ్చల్ : జిల్లా కీసరలో ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. కీసర సమీపంలోని స్లీమీ క్రషర్ మిషన్ దగ్గర విమాన కూలడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Thursday, September 28, 2017 - 11:35

మేడ్చల్ : జిల్లా కీసర మండలంలో యద్గర్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చేపపిల్లల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి సర్వీస్‌ రోడ్డుపైకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా జిల్లా నుంచి మెదక్‌ జిల్లాకు చేపపిల్లలు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Pages

Don't Miss