Saturday, February 25, 2017 - 13:41

పెద్దపల్లి : ఇంజక్షన్లు వికటించి మూడు రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఇంజక్షన్ల రూపంలో మృత్యువు కబలిస్తోంది. వరుసగా మూడు రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇంజక్షన్లు వికటిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల ఎదుట మృతుల బంధువులు ఆందోళనకు...

Tuesday, February 21, 2017 - 17:41

పెద్దపల్లి : రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తున్నామని, రైతులకు వేసవిలో కూడా తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను అందించడానికి సిద్ధంగా ఉన్నామని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని కొత్తగా నిర్మాణం చేపట్టే 8, 9 యూనిట్లను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో అన్ని కేటగిరిలకు విద్యుత్‌ అంతరాయం కలగకుండా చూస్తున్నామని... కొత్తగా...

Wednesday, February 8, 2017 - 09:41

పెద్దపల్లి : జిల్లాలో దారుణం జరిగింది. సెంటినరీ కాలనీకి చెందిన ఓ యువతిపై గోదావరిఖనికి చెందిన రాకేశ్‌ అనే యువకుడు బ్లేడుతో దాడిచేశాడు. ఈ దాడిలో యువతి మణికట్టు దగ్గర గాయం అయ్యింది. తీవ్ర రక్తస్రావం కావడంతో..యువతిని గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిపై దాడి అనంతరం రాకేశ్‌కూడా తనను తాను గాయపరుచుకున్నాడు. యువతికి రెండురోజుల క్రితమే పెళ్లికుదరడంతో..రాకేశ్‌ ఈ దాడి చేసినట్టు...

Friday, February 3, 2017 - 19:58

పెద్దపల్లి : ఓపెన్‌కాస్ట్‌ గనుల వల్ల కాంట్రాక్టర్లకే ప్రభుత్వం మేలు చేకూర్చుతుందన్నారు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతున్న రెండో అంతర్జాతీయ గని కార్మికుల సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ కోదండరాం.. మైనింగ్‌ పాలసీని ప్రభుత్వం తుంగలో తొక్కి కొందరి స్వార్థం కోసం పాలసీలను మారుస్తున్నారని విమర్శించారు. ఈనెల 22న...

Saturday, January 28, 2017 - 16:39

పెద్దపల్లి : భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆకస్మికంగా పర్యటించారు. మంథని మండలం గుంజపడుగు, సిరిపురం గ్రామాల్లో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్ట్‌ల పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు. భూనిర్విసితులు ఆందోళన చేస్తారన్న ఉద్దేశంలో మంత్రి పర్యటనను గోప్యంగా ఉంచారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్ట్‌ల కింద భూములు కోల్పోయిన రైతులకు ఇంకా...

Monday, January 9, 2017 - 14:57

పెద్దపల్లి : జిల్లా మంథనిలో 10 టీవీ క్యాలెండర్‌ను మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆష్కరించారు. 10 టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన 10 టీవీ... అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని ప్రశంసించారు.. 

Monday, January 2, 2017 - 18:25

పెద్దపెల్లి : జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో 10టీవీ 2017 సంవత్సర నూతన కాలెండర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. సమాజంలో 10టీవీ నిర్వహిస్తున్న పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిదని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ కొనియాడారు. మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా 10టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూడు...

Thursday, December 29, 2016 - 16:54

హైదరాబాద్ : ఆదర్శంగా మొక్కలు పెంచుతున్న వారికి పారితోషికం అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. హరితహారంపై చర్చలో భాగంగా శాసనసభలో ఆయన అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నియోజకవర్గంగా పెద్దపెల్లి ఎంపికైనట్లు చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటిగా సిద్ధిపేటను కేసీఆర్‌ ప్రకటించారు. ఉత్తమ గ్రామం, జిల్లా, సర్పంచ్‌, ఉపాధ్యాయుడు అవార్డులను సీఎం ప్రకటించారు.

...

Sunday, December 25, 2016 - 18:37

పెద్దపల్లి : కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు, తొలి క్రైస్తవ సూక్తులకు దగ్గర పోలికలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం కోసమే..కీస్తు ప్రాణాలు అర్పించారని చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి, సమానత్వం కోసమే సీపీఎం పాదయాత్ర కొనసాగుతోందని ఆయన అన్నారు. 

 

Sunday, December 25, 2016 - 13:48

పెద్దపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర 70వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న మహాజన పాదయాత్రలో కేసీఆర్‌ సర్కార్‌పై పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు. 

Sunday, December 25, 2016 - 09:22

పెద్దపల్లి : ప్రజా సమస్యలపై చర్చించడంలో అసెంబ్లీ విఫలమైందని, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన మాట్లాడకుండా.. వ్యక్తిగత దూషణలకు దిగితూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలే ప్రతిపక్షాల పాత్ర పోషిస్తూ.. సమస్యలపై ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఆయన అన్నారు.

69వ రోజు...

Pages

Don't Miss